జీవపరిణామం ఆగిపోయిందా? కొనసాగుతోందా?
మానవునితో జీవపరిణామం ఆగిపోయిందా లేక కొనసాగుతోందా అంటే సమాధానం రెండు విధాలుగా వస్తుంది. కింది స్థాయి జీవులనుండి ఉన్నత జీవులకు పరిణామం నేటికీ కొనసాగుతోంది అనేది మొదటి సమాధానం. మానవుని తరువాత పరిణామం ముందుకు సాగడం ఆగిపోయినట్లే అన్నది రెండో సమాధానం. జీవపరిణామం అన్నది ఒక నిరంతర క్రమం. పదార్థ నిత్య చలనంలో, నిత్య పరిణామంలో అది అంతర్భాగం. ఈ భూమి, (గ్రహాలు కూడా పదార్థ చలనంలో భాగంగా ఏర్పడినవే.
