సంపాదకీయం

ద్రవిడచైతన్యానికి సైన్సు వత్తాసు

సంపాదకీయం మానవులకు తమ మూలాలు శోధించుకోడమంటే మహా ముచ్చట. తమ పురావైభవాన్ని తవ్వితీసి కథలు కథలుగా చెప్పుకోడమంటే చెప్పలేని వ్యామోహం. ఇందుకోసం ఎవరి పురాణాల్ని వాళ్ళు సృష్టించుకుంటారు. ఎవరి మూల పురుషుల్ని వాళ్లు వెతుక్కొంటారు. ఇక్కడితో ఆగక తమ గతం అనన్యసాధ్యమన్న గొప్పలకు పోతుంటారు. తమది స్వచ్ఛమైన, సర్వోన్నతమైన జాతిగా భ్రమపడుతుంటారు. దీనికోసం గొడవలు పడుతుంటారు. గొంతులు కూడా కోసుకుంటారు. ఇది జాత్యహంకారం. ఫాసిజానికి పూర్వరూపం. వాస్తవానికి జాతిని నిర్ధారించేందుకు
సంపాదకీయం

అలసట లేని ఎదురీత !

సంపాదకీయం "జన విజ్ఞానం" మూడో ఏడాది ముంగిట్లోకి అడుగుపెడుతోంది. దాదాపు అన్ని వైపుల నుంచి సవాళ్లు తప్ప సానుకూలత సన్నగిల్లుతున్న సందర్భమిది. ఇలాంటి ఎదురీత యుగంలో ఒక ఆన్‌ లైన్‌ ప్రజా సైన్సు పత్రికకు రెండేళ్లేమీ తక్కువ కాలం గాదు. ఈ మాటలు రాస్తుండగా కలల చక్రవర్తి పరమేశ్వరన్‌ గారు( యంపి) కలగా మిగిలిపొయ్యారన్న వార్త శరాఘాతంలా వచ్చి తగిలింది. "జన విజ్ఞానం" ప్రారంభ సంచికలో "శాస్త్ర ప్రచారంతో సరిపెట్టక
సంపాదకీయం

బడి లేని చదువు

సంపాదకీయం "బడి అంటూ ఒకటి పెట్టి, అందులో పిల్లల్ని కూర్చోబెట్టి, చదువు అనే కసరత్తు నేర్పడం చరిత్రలో ఎప్పుడు మొదలైందో గానీ మానవేతిహాసంలో అది మాత్రం దుర్ముహూర్తాల్లోకెల్లా దుర్ముహూర్తం. ఈ బడి ఎన్ని భావోద్వేగాల్ని మంటగలిపిందో, ఎంత సృజనాత్మకతకు పాతర పెట్టిందో, ఎన్ని ఆలోచనలల్ని మొగ్గలోనే తుంచేసిందో ఎన్ని హక్కుల్ని కాలరాసిందో, ఎవ్వరూ తూకం వెయ్యలేని ఎంత విషాదాన్ని బాల్యానికి బలవంతంగా అంటగట్టిందో చెప్పగలిగిన వారెవరూ లేరు. ఇది మహా
సంపాదకీయం

ఇంగ్లీషు ఆధిపత్యం ఇక ముగిసినట్టేనా?

సంపాదకీయం జాత్యభిమానమూ, భాషాభిమానమూ రెండు అక్కాచెల్లెళ్ళు. ఒకదాని వెంట ఒకటి మనల్ని ఆవహిస్తుంటాయి. ఆవేశపరుస్తుంటాయి. తమ భాష ఎంతో సుందరమైందనీ, తియ్యనిదనీ ఎవరికి వారికి మమకారం వుంటుంది. ఇది హద్దులు దాటి ఇతర భాషలను కించపరిచే దాకా వెళ్లడంతో పాటు తమ భాష ఒక్కటే కలకాలం భూమిపై నిలబడాలన్న కోరికా, నిలబడుతుందన్న భ్రమా కూడా మనల్ని వెంటాడుతుంటాయి. సహజంగా తమ తమ భాష చుట్టూ దీనికి తగ్గట్టు కథనాలు, పండిత
సంపాదకీయం

సైన్సూ – ఛాందసమూ

సంపాదకీయం కేంద్రవిద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొత్తగా 'గ్రీన్ విచ్ టైమ్' (GMT) మీద యుద్ధం ప్రకటించాడు. అసలు 'గ్రీన్ విచ్ ' అనేది వలసదార్ల ఊహారేఖ మాత్రమేననీ, దాన్ని కాలానికి కేంద్రంగా పరిగణించడం మెకాలే విద్యా మానసిక స్థితి నుంచి పుట్టుకొచ్చిందనీ కొత్త భాష్యం చెప్పుకొచ్చాడు. ఉజ్జయిని కేంద్రంగా "మహాకాలం" ప్రామాణికంగా గుర్తించే రోజు రావాలని పిలుపునిచ్చాడు. గత మాసం మొదటి వారం ఉజ్జయినిలో జరిగిన 'మహాకాల్ అంతర్జాతీయ సదస్సులో
సంపాదకీయం

యుద్ధోన్మాదం

సంపాదకీయం మనిషికి యుద్ధాల పిచ్చి ఎప్పటినుంచి పట్టుకుంది? కొంపదీసి అది అతని సహజాతమా? శత్రు నిర్మూలనాలు, జీవ విధ్వంసాలు లేకుండా అతని పురోగమనమే సాగలేదా? సాగడం వీలు కాదా ?ఇప్పటి మన ముందున్న నాగరికతా, అభివృద్ధీ అంతా యుద్ధ పర్యవసానాలేనా? ఇప్పటి పరిణామాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా ఎదురవుతాయి. ఈ వైపు వ్యాఖ్యానాలకూ కొదువేమీ లేదు."సేపియన్లలో సహనం చాలా తక్కువ. వర్తమాన కాలంలో ఒంటి రంగు, మాట్లాడే మాండలికం
సంపాదకీయం

సంపాదకీయం

కృత్రిమమేధ చెపుతున్న కొత్త పాఠం చిన్నప్పుడు మన పాఠశాలల్లో మనల్ని వారానికో, మాసానికో ఒకసారి ఏదో ఒక అంశంపై స్వంతంగా వ్యాసం రాయమనేవాళ్ళు. కిందామీదా పడి ఎక్కడెక్కడ నుంచో సమాచారం సేకరించుకొని రాసేవాళ్ళం. అందులో ఏవేవో ఆలోచనల్ని చొప్పించే వాళ్ళం. అందంగా రాయడానికి కుస్తీ పట్టేవాళ్ళం. మనకంటూ ఏదో ఒక ప్రత్యేకత వుండాలని తాపత్రయం పడేవాళ్ళం. ఇందులో కాపీలు ఉండేవి కావు. ఒకరి మీద ఆధారపడ్డం అసలే వుండేది కాదు.
సంపాదకీయం

ముసురుకొస్తోన్న మేధోమాంద్యం

సంపాదకీయం క్రమంగా మానవ సమాజం మూగబోతోందా? భిన్న దృక్పథాల ప్రవాహాలకూ, నూతన ఆలోచనా స్రవంతులకూ తావులేని ఎడారిగా మారుతోందా? మనిషి ప్రశ్నించడం మరిచిపోతున్నాడా? ఎదిరించడం, నిలదీయడం, ప్రజల పక్షాన నిలబడడం మేధావులు తమ పని కాదనుకుంటున్నారా? మౌనధారణే మేలనుకుంటున్నారా? ఒకవైపు మానవుడు భూనభోనాంతరాలను జయించానని జబ్బలు చరుస్తున్నాడు. ప్రకృతి శక్తుల్ని గుప్పిట్లో బంధించానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అవును మనిషి చరిత్ర ఎప్పుడూ ఎరగని ఆవిష్కరణలు చేస్తున్నమాట నిజమే. ఎల్లల్ని చెరిపేసి
సంపాదకీయం

ఉన్నత విద్యారంగం చట్టూ ఊహాలోక విహారం

సంపాదకీయం "ఉన్నత విద్యారంగం ఎలా వుంది ? ఏ వైపు పయనిస్తోంది "అనేదాన్ని బట్టి "మన సమాజం ఎలా వుంది ? అది ఏ వైపు నడుస్తోంది" అని మనం సులభంగా అంచనా వెయ్యొచ్చు. కాకుంటే కొంచెం ఓపికతో, వాస్తవిక దృష్టితో మనం చూడగలగాలి. శాస్త్ర సాంకేతిక రంగం ప్రపంచాన్ని శాసిస్తున్న యుగంలో ఉన్నత విద్య ఏ దేశాన్నయినా ఆ పోటీలో దీటుగా ఎంత నిలబడగలిగేలా చెయ్యగలదో మాత్రమే గాదు,
సంపాదకీయం

చరిత్రపాఠాలు చేదుగా వుంటాయి!

సంపాదకీయం "ప్రపంచ నాగరికతల ఘర్షణా ప్రవక్త" శామ్యూల్ హటింగ్టన్ సమాధి నుంచి లేచొచ్చి అమాంతం అమెరికా ప్రభుత్వాన్ని ఆవహించినట్టుంది! పాశ్చాత్యదేశాల నాగరికతకు ఎప్పుడూ లేని ముప్పు ముంచుకొచ్చిందనీ, వలసల్ని అడ్డుకోకుంటే వాటి ప్రాభవం, భవిష్యత్తూ మంటగలిసి పోతాయనీ అది గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. దీనికోసం ఒక "నూతన వ్యూహాత్మక నివేదికను" రూపొందించి, దాన్ని ప్రపంచ దార్శనికతా పత్రంగా వర్ణిస్తూ ముందుకు తెచ్చింది. ఒకవైపు అమెరికా మానవ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన