పరిశోధనా రంగం నుంచి ప్రజాసైన్సు ఉద్యమంలోకి
యంపి పరమేశ్వరన్ జీవనయానం విఠపు బాలసుబ్రమణ్యం "నా కలలు కాలం చెల్లనివి " అని ఎప్పుడూ ధీమాగా చెప్పుకునే యంపీ పరమేశ్వరన్ ఇప్పుడు ఒక కలగా మిగిలిపొయ్యాడు. తొంబై ఒక్క ఏళ్ళు మీదబడి శరీరం ఏ మాత్రం సహకకరించకున్నా ఆయన కలలు కనడం మాత్రం ఎప్పుడూ మానలేదు. ఏదో ఒక వసంతకాల సుప్రభాతాన ఒక మహోన్నత సమాజం ఈ భూమ్మీద అవతరిస్తుందనీ, ఆ సామాజిక విప్లవానికి సైన్సు ఒక చోదక
