నాదెప్పుడూ శాస్త్రీయదృక్పథమే
జవహర్ లాల్ నెహ్రూ జీవిత సమస్యలను పరిశీలించడంలో నాదెప్పుడూ శాస్త్రీయదృక్పథమే. 19, 20 శతాబ్దాల శాస్త్రజ్ఞానంలో నా కంతటి విశ్వాసము. పేచీపూచీలు లేని సుఖజీవనంవల్లనూ, దారుఢ్యం, శక్తి, ఆత్మవిశ్వాసం ఉండడంచేతనూ శాస్త్రజ్ఞానమందు నా కలాంటి నమ్మకం. ఏదో లీలగామాత్రం 'మానవత్వం” నాకు నచ్చింది. నేడు సర్వే సర్వత్రా బుద్ధికౌశల్యంగలవారంతా అంగీకరించి అమలుపరుస్తున్న మతం - హిందూమతం కానివ్వండి, క్రైస్తవమతం, ఇస్లాము,బౌద్ధమతం కానివ్వండి - నన్నెప్పుడూ ఆకర్షించలేదు. ఏవో కొన్ని ఆచార
