అక్టోబర్ 2026

సంపాదకీయం

విద్యారంగం – జెన్ జీ  పాఠం

నానాటికీ శాస్త్రీయ దృక్పథం కొరవడుతోందనీ, ఛాందసం ముదురుతోందనీ బాధపడుతున్న రోజులు మనవి. నిజమే గానీ వీటన్నిటికీ మూలాలు ఎక్కడ వున్నాయి అంటే మన విద్యారంగ సంక్షోభంలో వున్నాయి అంటోంది జెన్ జీ. విద్యారంగం కేంద్రంగా విస్తృత సామాజిక రాజకీయ ఉద్యమం జరగాలన్నది దాని వాదం. విద్యారంగం గురించి చాలా చాలా చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి గానీ విద్యారంగ సంక్షోభం సామాజిక ఆర్థిక సంక్షోభంగా మారిందన్న జెన్ జీ విశ్లేషణ కొత్తది, విలువైనది. ఇదో నూతన కోణం, దృక్పథం.

సందర్భం

డిజిటల్ నిఘా నీడలో భారత ప్రజాస్వామ్యం – జంతర్ మంతర్ పోరాటాలు

పౌరుల స్వేచ్ఛను నియంత్రించే అటువంటి వ్యవస్థ గురించి ఆ నవల చేసిన హెచ్చరిక, నేడు డిజిటల్ నిఘా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోసారి చర్చకు వస్తోంది. భారత ప్రజాస్వామ్యంలో పౌర హక్కులపై ఈ నిఘా చూపే ప్రభావాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.

సంస్కృతి

మాతృస్వామ్యవాదనలు : మూలాలు, గమనం

మాతృస్వామ్యం అంతరించిపోయిన తర్వాత లేదా పురుషులు దాన్ని నాశనం చేసిన తర్వాత పితృస్వామ్యం మొదలైందని స్త్రీవాద చర్చల్లోనూ, ప్రగతిశీల మేధావి వర్గాల్లోనూ ఒక అభిప్రాయం/వాదన ప్రాచుర్యంలో ఉంది. ఈ అభిప్రాయానికి/వాదనకు పూర్తిగా విరుద్ధంగా, అసలు మాతృస్వామ్యం అనేదే మానవ చరిత్రలో లేదనీ, అది కేవలం ఒక అపోహ మాత్రమేననీ ఎవరైనా అంటే?..

చరిత్ర ఏమంటోంది

మధ్యయుగాలలో సాంకేతిక పరిజ్ఞానం

మధ్యయుగాలలో అనేక యాంత్రిక సూత్రాలు భారతీయులకు తెలుసు. కొన్ని ముఖ్యమైన యాంత్రిక సూత్రాలను విదేశాల నుండి స్వీకరించారు. కానీ ఆ సూత్రాలను విడివిడి అవసరాలకే వాడుకున్నారు కానీ, వాటిని ఒకదానితో ఒకటి అనుసంధానించుకొని వాడలేదు. ఒక వృత్తిలో ఉపయోగపడిన ఒక సూత్రాన్ని, మరో వృత్తికి అనువర్తించుకోలేదు.

శాస్త్ర వికాసం

శుక్రయాన్: వేగుచుక్క రహస్యాల శోధనకు భారత ప్రయాణం

వెన్నెల కాంతులు విరజిమ్మే చందమామను పక్కన పెడితే, నక్షత్రాల మధ్య అత్యంత తేజస్సుతో, కనులవిందుగా మెరిసిపోయే ఆ అద్భుతమైన తెల్లటి చుక్కే మన ‘వేగుచుక్క’! కవులు ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా వర్ణించే ఆ అందమైన తార వెనుక.. ఊహకందని ఒక భయంకరమైన నరకం దాగి ఉందనే నిజం మీకు తెలుసా?”

శాస్త్రజ్ఞులు

‘హ్యూమన్ కంప్యూటర్’ శకుంతలాదేవి

ఆధునికత, సాంప్రదాయం, వంటలు, హోమో సెక్చుయాలిటీ వంటి అంశాలపై రచనలతో పాటు నవలలు, జ్యోతిష్యం … వీటికి మించి ఆరు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే లభించే అపారమైన గణిత ప్రతిభ… వీటన్నిటికి బీజగణితాత్మక సమాకలనం వంటిది శకుంతలా దేవి! వారి గురించి తెలుసుకుందాం.

నమ్మకం-నిజం

శని- మట్టి గ్రహమా? దుష్ట గ్రహమా?

శని దోషం ఉంటే జీవితంలో అభివృద్ధి ఉండదు అనే భావన. నువ్వులు, నూనె దానం చేస్తే భాధలు తొలగిపోతాయని ప్రచారంలో ఉంది. నివారణ కోసం రకరకాల పూజ పద్ధతులు, అవి చేయకపోతే కలిగే దుష్ఫలితాలు… ఇవన్నీ కలిపి శని అంటే ప్రతి ఒక్కళ్ళు జీవితంలో భయపడేలా చేస్తున్నారు.. శని ప్రభావం వల్ల కష్టాలు వస్తాయి అని చెబుతున్నప్పుడు అదే శని స్థానంలో ఉన్న అందరికీ ఒకే విధమైన కష్టాలు ఎందుకు రావడం లేదు?. తెలుసుకుందాం..

సైన్స్ పాఠం

సైకిల్ – సైన్స్

మన జీవితంలో సైకిల్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్నపిల్లలకు అది నేర్చుకోవాల్సిన మొదటి వాహనం. విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే సాధనం. రైతులకు, కార్మికులకు, చిరువ్యాపారులకు ఉపయోగకరమైన వాహనం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారికి వ్యాయామ పరికరం. పర్యావరణాన్ని ప్రేమించేవారికి కాలుష్యరహిత ప్రయాణ సాధనం. దాని వెనుక ఉన్న సైన్స్ తెలుసుకుందాం..

మంచిమాట

మంచి మాట

నిజమైన శాంతి
ప్రపంచంలో నిజమైన శాంతి నెలకొనాలంటే
యుద్ధానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం జరగాలి!
దీన్ని మనం మన పిల్లలతోనే ప్రారంభించాలి
అప్పుడే నిజమైన శాంతి వర్ధిల్లుతుంది !!
–  మహాత్మాగాంధీ

Must Watch

మంచి మాట

సంచికలు

శీర్షికలు