మధ్యయుగాలు – యుద్ధాలు – ప్రయాణాలు
డా. యం. గేయానంద్ మనిషి భౌతిక జీవితంతో ముడిపడి ఉండేదే టెక్నాలజి. భౌతిక జీవితాన్ని మెరుగు చేసుకునే క్రమంలోనే టెక్నాలజి అభివృద్ధి అవుతూ ఉంటుంది. శాస్త్ర సాంకేతికాంశాల అభివృద్ధిలో మానవుడికి సహజంగా ఉండే ఉత్సుకత/జిజ్ఞాస కూడా ఒక పాత్ర వహిస్తుంది. ఒక్కోసారి ఇతరుల్ని చూసి నేర్చుకొని, టెక్నాలజీని మనిషి సొంతం చేసుకొంటాడు. అట్లే టెక్నాలజి వ్యాప్తిలో అధికారం, వ్యాపారం కూడా పాత్ర వహిస్తాయి. అయితే మధ్యయుగాల భారతంలో టెక్నాలజి అభివృద్ధిలో
