మంచిమాట

మంచి మాట

నిజంనిజం కూడా నిరంతరం ప్రచారంలో వుండాలి లేకుంటే నిజం అబద్ధంగా మారుతుంది.రాష్ట్రాన్ని, దేశాన్నే గాదు ప్రపంచాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతుంది!-బి. ఆర్. అంబేద్కర్
సంపాదకీయం

“అయో”మయ రాజకీయాలు !

సంపాదకీయం వృత్తాసుర సంహారం కోసం దేవతల కంసాలి త్వష్ట ఇంద్రుడికి వజ్రాయుధం తయారు చేసి ఇచ్చాడట. దీంతో ఆ ఆర్య యోధుడికి ఎదురులేకుండా పోయిందట. ఒంటి చేత్తో శత్రు స్థావరాలను కకావికలం చేసాడట. ఫలితంగా ఇంద్రాధిపత్యం శాశ్వతంగా దఖలు పడిపోయిందట! ఇది పురాణం. ఆశ్చర్యం ఏమంటే ఆధునిక యుగంలోనూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతికి ఒక వజ్రాయుధం చిక్కింది. కాకుంటే ఇప్పుడాయనకు పురాతత్వ శాస్త్ర వేత్తలు నేల పొరల్నండి తవ్వితీసి
శాస్త్ర ప్రచారం

ఉపద్రవంగా మారుతోన్న విజ్ఞానోన్మాదం!

 డా.విరించి విరివింటి సైన్సు అంటే మన చుట్టుపక్కల పరచుకొని వున్న చరాచర జగత్తుకి ఒక వివరణాత్మక నమూనా మాత్రమే. కానీ ప్రపంచం సైన్సుని అంతవరకే చూసిందనలేము. మనం 19 -20 శతాబ్దాల చరిత్రను చూస్తే మానవులు సైన్సుని చాలాసార్లు ఒక భావజాల ఆయుధంగా వాడుకున్నారన్న వాస్తవం బయటపడుతుంది. మనుషుల్లోని వైషమ్యం, అసమానత, యుద్ధపిపాస, సంకుచిత జాత్యాధిపత్యం వీటన్నిటికీ శాస్త్రపరమైన సమర్ధనల్ని సైన్సు అందించింది. అది మానవ కపాలాలను కొలిచే ‘క్రేనియోమెట్రీ’
శాస్త్రజ్ఞులు సందర్భం

కమల సొహొని (1912-1998)

అరవింద గుప్త విజ్ఞాన శాస్త్ర రంగంలో పిహెచ్.డి చేసిన మొదటి మహిళ కమల సొహొని. పేద పల్లెప్రజలు తినే ఆహారంలోని మూడు ముఖ్య అంశాల మీద విస్తృతంగా జీవరసాయనిక పరిశోధనలు చేసి వాటి పోషక విలువలను ఆమె కనుగొన్నారు. కమల 1912లో జన్మించారు. తండ్రి నారాయణరావ్ భగత్, మామయ్య మాధవరావ్ పేరుగాంచిన రసాయనిక శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని భారత విజ్ఞానశాస్త్ర సంస్థ నుంచి మొదట పట్టభద్రులైన వాళ్లల్లో వీరు కూడా ఉన్నారు.
చరిత్ర ఏమంటోంది

ఆదిమ సామాజిక జీవితాలు

డా.యం.గేయనంద్ ప్రాథమిక జ్ఞాన విజ్ఞానాలు..ని, ఎవరో మంత్రం వేసినట్టు సృష్టించలేదు. జీవ పరిణామంలో మానవజాతి ఆవిర్భావం యాదృచ్ఛికం. భూఖండాలు కలవడం విడిపోవడం, వివిధ శీతోష్ణ పరిస్థితులు లక్షలాది సంవత్సరాలు కొనసాగడం, మంచు యుగాలు ఏర్పడటం, మధ్యలో వెచ్చటి వాతావరణాలు, అడవులు పెరగడం క్షీణించడం, మైదానాలు ఏర్పడటం, అగ్నిపర్వత విస్పోటనం – ఇలాంటి పరిణామాల మధ్య, తిని తిరిగి నిలదొక్కుకోగలిగిన జీవులు మానవ స్వరూపం సంతరించుకున్నాయి. గత 60-70 లక్షల సంవత్సరాలలో,
ప్రకృతి-పర్యావరణం

వ్యవసాయం పై వాతావరణ మార్పుల ప్రభావం

ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాల రావు ప్రస్తుతం “వాతావరణ మార్పు” ప్రపంచాన్ని వణికిస్తున్న అంశమని అర్థమౌతూనే ఉంది. కారణం, ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే అన్ని రంగాల్లోకి అతిముఖ్యమైంది వ్యవసాయం-ఆహారొత్పత్తి. ప్రతి చిన్న వాతావరణ ఎగుడు, దిగుడులు, పర్యావరణ పరిణామాలు, అత్యంత సున్నితమైన జీవావరణం పై పడతాయి. ఫలితంగా మన ఆహారానికి కీలకమైన పంటల సాగు, జీవాల పెంపకం, సమస్యల వలయంలోకి నెట్టబడతాయని యిప్పటికే అనుభవాలు చెప్తున్నాయి. ఈ వాతావరణ మార్పుకు “హరిత
నమ్మకం-నిజం

“దెబ్బకు దెయ్యం దిగుతుందా?!!”

- మిఠాయి యుగంధర్ బాబు అది జార్ఖండ్ లోని పాలెం జిల్లా దగ్గర హైదర్ నగర్. మిట్ట మధ్యాహ్నం మంచి ఎర్రటి ఎండలో ఎర్రటి పిడకల మంట.. ఆ మంటలో ఎవరో కొబ్బరికాయలు, బియ్యం వేశారు. మంట పైకి ఎగసింది. కొంచెం దూరంలో నల్ల మేకకు ఎర్రటి బొట్టు పెడుతున్నారు. కొందరు ఓ మహిళ శరీరాన్ని దారంతో గట్టిగా చుడుతున్నారు. అక్కడ ఓ మాంత్రికుడు మంత్రాలు పటిస్తూ అన్నంలో మాంసం
పిల్లలు-చదువులు

పిల్లలు పుస్తకాలు ఎందుకు చదవాలి?

C.V.కృష్ణయ్య (CVK) పాఠాలు చదవడానికి సమయం చాలడం లేదు. ఇతర పుస్తకాల చదవడానికి సమయం ఎక్కడ ఉంది? పిల్లలు చదివేది కథల పుస్తకాలే కదా! కథల్లో ఏముంది కాలక్షేమం చేయడానికి తప్ప. ఇది చాలామంది తల్లిదండ్రుల టీచర్ల అభిప్రాయం. ఈ అభిప్రాయమే పిల్లల భవిష్యత్తును దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నది. ఎందులోనూ నైపుణ్యంలేని వ్యక్తుల్ని తయారు చేసి ఈ విద్యా వ్యవస్థ మానవ వనరుల్ని వృధా చేస్తున్నది. ఈ విషయాల గురించి లోతుగా
తెలుసుకొందాం

18 ప్రకృతి సూత్రాలు-ఎనిమిదవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య భౌతిక రాశులన్నీ గులకలు (క్వాంటాలు)గా ఉంటాయి. ఏ భౌతిక రాశి విలువ అవిచ్చిన్నంగా ఉండదు.(All Physical Entities are Quantised; No Physical Quantity can be Infinitely Continuous) ఓ బస్తాలో బియ్యం ఉన్నాయనుకుందాం. బియ్యం పదార్ధం పేరు. కానీ బియ్యం గింజలుగా మాత్రమే ఉంది. లేదా నూకలుగా ఉంటుంది. అవన్నీ విడివిడిగా ఉంటాయి. గులకలు (descrete specs) గానే ఉన్నాయి. ఓపిక ఉంటే
మంచిమాట

మంచి మాట

ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు! జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణ కాదు!! జీవితంలోని ప్రతి కోణాన్ని చూపలేనిది సాహిత్యమే కాదు !!- కొడవటిగంటి కుటుంబరావు