తెలుసుకొందాం

పదవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ A. రామచంద్రయ్య శక్తి రూపాలన్నీ ఉష్ణరూపంలోకి మారుతున్నాయి.(Energy Tends to Reform into Heat) విశ్వంలో మనచుట్టూ రకరకాల శక్తి రూపాలున్నాయి. కాంతి శక్తి, గురుత్వ శక్తి, కేంద్రక శక్తి, రసాయనిక శక్తి ఇలా ఎన్నో రకాలైన శక్తి రూపాలు మనకు తెలుసు. ప్రతి చోటా ప్రతిక్షణం మార్పులు (సంఘటనలు) జరుగుతున్నాయి. ఈ సంఘటనలలో శక్తిమార్పిడులు (Exchange among Forms of Energy) కూడా జరుగుతున్నాయి. అయితే కాలక్రమేణా
మంచిమాట

మంచి మాట

యుద్ధమూ శాంతీ! మన పాఠ్యగ్రంథాలు యుద్ధాల్ని కీర్తిస్తాయి. వాటి దుర్మార్గాల్ని దాచిపెడతాయి. అవి మన పిల్లల హృదయాల్ని విద్వేషమయం చేస్తాయి. నేనైతే యుద్ధాన్ని కాదు శాంతిని బోధిస్తాను. ద్వేషాన్ని కాదు ప్రేమను వారిలో నింపుతాను. - ఆల్బర్ట్ ఐన్ స్టీన్
సంపాదకీయం

ఆనందం కరువైన అభివృద్ధి

సంపాదకీయం "ఆనందమె జీవిత మకరందం" అంటాడు సినీ కవి సముద్రాల. ఇంతకూ సదరు ఆనందానికి మూలకందం ఏది? అంతులేని సంపదలా? అఖండ జ్ఞాన విజ్ఞానాలా? శాంతి సామరస్యాలా? స్నేహమయ సామాజిక సంబంధాలా? జనచైతన్యమా? ప్రజానుకూల పాలనా విధానాలా? ఇటీవల విడుదలైన "ప్రపంచ సంతోష నివేదిక" (2025) వీటన్నిటిని తనదైన శైలిలో విశ్లేషించి దేశాలకు ర్యాంకులిస్తుంది. వీటిల్లో కొన్ని మన కళ్ళు తెరిపిస్తాయి. కొన్ని నివ్వెర పరుస్తాయి. కొన్ని ఉసూరుమనిపిస్తాయి. ఈ
శాస్త్ర ప్రచారం

సైన్సు – శాస్త్రీయ ప్రాపంచిక దృక్పధం

కె. బాలగోపాల్ ఏడవతరగతిలో కాబోలు, వాయుపీడనాన్ని గురించి పాఠం ఉండేది. వీధి లోని బోరు పంపు ఏ విధంగా పనిచేస్తుందనేది పరీక్షలో తప్పనిసరి ప్రశ్న. నిలువు కోత పటంతో సహా వివరించాలి. దానిని అధ్యయనం చేస్తూ అప్రయత్నంగా అన్వయించుకొని రోజూ కలంలో సిరా నింపుకునే 'ఇంక్ ఫిల్లర్' కూడ అదే సూత్రంమీద పనిచేస్తుందని ఏ పంతులూ చెప్పకుండా అర్థం చేసుకున్ననాడు అనుభవించిన పారవశ్యం మరిచిపోలేనిది. సైన్స్ అంటే ఏమిటో మన
శాస్త్ర వికాసం

సామాన్యుడు శాస్త్రజ్ఞుడైన వేళ!

ప్రొ. యశ్ పాల్ అతడో పల్లెటూరి రైతు. అతనికున్నదల్లా ఓ పంపుసెట్టు. అదే అతని ప్రాణం, జీవనాధారం. దాని అంగాంగమూ అతనికి తెలుసు. దాని ప్రతి కదలికా అతని కనుసన్నల్లోనే జరుగుతుంది. అప్పుడప్పుడూ అది మొరాయిస్తుంది. అయితేనేం? దాన్ని బుజ్జగించి (మరమ్మత్తు చేసి) దారిలో పెట్టుకోవడం అతనికి చిటికెలోపని! ఆ రైతు కొడుక్కి పదేళ్లు. వాడికి ఈ పంపుసెట్టు పని అంటే మహా సరదా. జుగాడ్ ఇలా పుట్టిందిఒకరోజు మన
చరిత్ర ఏమంటోంది

శిలాయుగాలలో రెండు సాంకేతిక విప్లవాలు

డా. గేయానంద్ దాదాపు 85 వేల సంవత్సరాల నాడు, ఒక హంటర్ గాదరర్ సమూహం, ఆఫ్రికాను వీడింది. మూడు వేల తరాలకు ముందటి, మన పూర్వీకులు వాళ్ళందరూ. ఈ మహా ప్రయాణం ప్రారంభించినప్పుడు, వారి శరీరానికి ఒక పరిమితి( ఇప్పటికీ!) ఉంది. చాలా దూరాలు నడవటం పరిగెత్తడం తప్ప, వాళ్లకున్న శారీరిక సామర్థ్యం ఇంకేదీ లేదు. పరిసరాలు, వాతావరణం విధించే పరిమితులు ఎలాగూ ఉన్నాయి. వీటన్నింటికీ తగ్గట్టుగా మార్పులు సంతరించుకోగలిగే
ప్రజారోగ్యం శాస్త్రజ్ఞులు

ప్రసూతి చికిత్స పితామహుడు వి.ఎన్. శిరోద్కర్ (1899-1971)

అరవింద్ గుప్తా డా॥ వి.ఎన్.శిరోద్కర్ పేరు ప్రపంచమంతా “శిరోద్కర్ కుట్టు” కనుగొన్న వ్యక్తిగా ఖ్యాతి గాంచింది. సర్జన్ ఆయన మహిళల వ్యాధుల చికిత్సకు ఎంతో దోహదం చేశారు. విఠల్ నగేశ్ శిరోద్కర్ 1899లో గోవాలోని శిరోదా గ్రామంలో జన్మించారు. గ్రామం పేరు మీదనే వారికి ఆ ఇంటి పేరు సంక్రమించింది. హుబ్లీలో విద్యను అభ్యసించి ముంబయిలోని గ్రాంట్ వైద్య కళాశాలలో చేరారు. 1923లో ఎం.బి.బి.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. గర్భధారణ, ప్రసూతి
ప్రకృతి-పర్యావరణం

గంగా నది కాలుష్యం, స్వయంశుద్ధి రహస్యం

 టి. వి. వెంకటేశ్వరన్ 1892లో ఎర్నెస్ట్ హాన్బరి హన్కిన్స్ అనే సైంటిస్టుని కెమికల్ అనలిస్టుగా, బాక్టీరియాలజిస్టుగా పంజాబ్ ప్రావిన్సు, మధ్య ప్రావిన్సులలో పనిచేయడానికి బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. అతని ప్రధాన కర్తవ్యం బ్రిటీష్ సైనికుల్ని ప్రాణాంతక వ్యాధులనించి ప్రత్యేకించి కలరా నుంచి కాపాడ్డం. ఢిల్లీలో అతను ప్రతిరోజూ వేలమంది స్థానికులు యమునా నదిలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులు కడగడం చూసి ఆశ్చర్య పోయాడు. ఇతర యూరోపియన్ ఆఫీసర్ల
తెలుసుకొందాం

తొమ్మిదవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య విశ్వంలో అన్ని సంఘటనలలోనూ ద్రవ్య-శక్తి నిత్యత్వమే ఉంటుంది! పదార్ధం-శక్తి రూపాల్లో మారవచ్చునేగాని పదార్ధం-శక్తి పరిణామం సంఘటనకు ముందు సంఘటన తర్వాత ఒకే విధంగా ఉంటాయి. సంఘటనలలో పదార్ధం-శక్తిని నూతనంగా సృష్టించలేము. నాశనం చేయలేము.(Matter - Energy are Conserved During Any Process. Energy and Matter May Change Their forms but the Net Quantity of Matter- Energy is fixed
నమ్మకం-నిజం

ఆధునిక యుగంలో అమానుష విశ్వాసం

యుగంధర్ అది ఊరి బయట ఒక ఇంటిలో ఓ గది. గది గోడల నిండా రకరకాల దేవతల భయంకర రూపంలో ఫోటోలు. గది అంతా దీపపు కాంతితో వెలిగిపోతోంది. అక్కడక్కడ సాంబ్రాణి పొగ లుంగ చుట్టుకుని మెల్లగా వెలువడుతోంది. గది మధ్యలో పెద్ద ముగ్గు. ఆ ముగ్గులో అక్కడక్కడ పూలు, పసుపు కుంకుమలు, పెద్ద పెద్ద నిమ్మకాయలతో అలంకరించబడి ఉంది. ముగ్గు మధ్యలో పిండితో చేయబడి, వికృతంగా కాళ్లు, చేతులు