ప్రకృతి-పర్యావరణం

నివాళి : ప్రజా పర్యావరణ తాత్వికుడు మాధవ్ గాడ్గిల్

విఠపు బాలసుబ్రహ్మణ్యం పర్యావరణం అంటే నదులూ, కొండలేనా? అడవులూ, చెట్లేనా? పక్షులూ, జంతువులేనా? మరి వాటి మధ్య బతుకుతున్న మనుషుల సంగతేమిటి? వారి మనుగడ మాటేమిటి ? ఈ ప్రశ్నలు మన నాగరిక పర్యావరణ మిత్రులకు చాలామందికి ఎదురు గావు. కొండ కోనల్ని నమ్ముకొని తరాల తరబడి వాటి చుట్టూ తమ జీవితాల్ని అల్లుకున్న మూల ప్రజల గురించి వారు పట్టించుకోరు. చాలా సందర్భాల్లో ప్రజలకు, జీవావరణానికి మధ్య వాళ్లు
ప్రకృతి-పర్యావరణం

ఇథనాల్ పరిశ్రమలు ఎవరికోసం?

డా. కలపాల బాబూ రావు కన్నెగంటి రవి భారత ప్రభుత్వం 2021లో ఇథనాల్ -20 విధానం తీసుకొచ్చింది. రోజుకు 60 వేల లీటర్ల నుంచి 6 లక్షల లీటర్ల దాకా ఇథనాల్ ఉత్పత్తి చెయ్యగల సామర్థ్యం మన దేశానికి అవసరమని లెక్కించి, దానికనుగుణంగా దేశవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో 30, ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిమాణంలో ఈ పరిశ్రమలు పెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మనం వాడుతున్న
శాస్త్ర వికాసం

డార్విన్ కి ముందున్న జీవశాస్త్రం

డా. విరించి డార్విన్‌ను సరిగా అర్థం చేసుకోవడం నిజానికి చాలా అవసరం. నేటికీ అతడిని సరైన రీతిలో అర్థం చేసుకుంటున్నామా అన్నది ప్రశ్న. డార్విన్ నుంచి సరిగ్గా అర్థం చేసుకోకపోతే అతడు వాడుకోబడతాడు; అతడి సిద్ధాంతమూ వాడుకోబడుతుంది—చరిత్ర ఇది ఎన్నోసార్లు నిరూపించింది కూడా. డార్విన్‌ను “జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త”గా మాత్రమే నిర్వచించిన క్షణంలోనే, అతడి మేధో ప్రాముఖ్యతను మనం సంకుచితం చేస్తున్నట్టు. డార్విన్‌ను అర్థం చేసుకోవడం అంటే
నమ్మకం-నిజం

తుమ్ములలో మంచి తుమ్ము ఏదయా?

మిఠాయి యుగంధర్ బాబు "తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందని" సామెత. అంటే చిన్న చిన్న విషయాలకే ఘర్షణ పడే సంబంధాలు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు నిలబడదని అలా చెప్పారు. తుమ్ము వస్తే అంత గట్టిగా, అంత బలంగా తుమ్ముతాము. ఎవరైనా గాట్టిగా తుమ్ముతుంటే "జాగ్రత్తరోయ్ ముక్కు ఊడిపోయేను" అని తమాషా చేస్తుంటారు. కొంతమంది అదేపనిగా తుమ్ము రావాలని పలుచనిన గుడ్డ కొనని గొట్టంలా చుట్టి ముక్కులో పెట్టుకుంటారు.
తెలుసుకొందాం

విశ్వ నేత్రం: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చరిత్రను ఎలా తిరగరాస్తోంది?

రవిరాజా పోతినేని మిమ్మల్ని గతంలోకి తీసుకెళ్లకుండా, గతాన్ని మీ ముందుకు తెచ్చే ఒక కాలయంత్రాన్ని (Time Machine) ఊహించుకోండి. అదే 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్' (JWST). ఇది మానవజాతి నిర్మించిన అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన మరియు సంక్లిష్టమైన స్పేస్ టెలిస్కోప్. ఇది భూమికి పది లక్షల మైళ్ల దూరంలో ఉంటూ, విశ్వం యొక్క చీకటి కోణాలను పరిశీలిస్తోంది. హబుల్ టెలిస్కోప్ మనకు విశ్వం యొక్క స్పష్టమైన, రంగుల చిత్రాలను
శాస్త్రజ్ఞులు

వాతావరణ పరిశోధనారంగంలో దురంధరుడు డా. ఏ.పి. మిశ్రా

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 8 డా. నాగసూరి వేణుగోపాల్  మిత్రా అనగానే మనకు రేడియో ఫిజిక్సుకు ఆద్యుడయిన శిశిర్ కుమార్ మిత్రా (ఎస్.కె. మిత్రా) గుర్తుకు రావచ్చు. ఈ మిత్రా గారి శిష్యుడే మరో మిత్రా ఉన్నారు. ఆయనే ఏ.పి. మిత్రా, ఇరువురూ రేడియో ఫిజిక్స్ లోనే గొప్ప కృషి చేశారు. మిత్రుడంటే సూర్యుడనే అర్ధం కూడా వుంది. ఏ కారణమో ఏమో గానీ వీరిద్దరూ ఉపరితలాల వాతావరణం సంబంధించి
సందర్భం

కేలండర్లలో భారతదేశం

వి. రాహుల్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! కొత్త సంవత్సరం వచ్చింది. సంవత్సరంలో ఏది మారినా మారకపోయినా క్యాలెండర్ మారుతుంది. కొత్త క్యాలెండర్ వస్తుంది. ఇప్పుడు మనం అందరం వాడుతున్న క్యాలెండర్  గ్రిగేరియన్ క్యాలెండర్ 1582 లో పోప్ గ్రెగొరీ తయారు చేశాడు. అంతకు ముందున్న జూలియస్ క్యాలెండర్ కి కొన్ని మార్పులు చేసి దీన్ని ప్రవేశపెట్టాడు. స్వాతంత్రం వచ్చాక ప్రముఖ శాస్త్రవేత్త మేఘనాథ్ సారధ్యంలో ఓ కమిటీని అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నియమించింది. దాని పని
మంచిమాట

మంచి మాట

సైన్సు మనల్ని ఆకలి నుంచీ, పేదరికం నుంచీ, నిరాశ నుంచీ,నిరక్షరాస్యత నుంచీ, మూఢనమ్మకాల నుంచీ, ఛాందసాల నుంచీ కాపాడగల్గింది సైన్సు మాత్రమే!- జవహర్ లాల్ నెహ్రూ
సంపాదకీయం

చరిత్రపాఠాలు చేదుగా వుంటాయి!

సంపాదకీయం "ప్రపంచ నాగరికతల ఘర్షణా ప్రవక్త" శామ్యూల్ హటింగ్టన్ సమాధి నుంచి లేచొచ్చి అమాంతం అమెరికా ప్రభుత్వాన్ని ఆవహించినట్టుంది! పాశ్చాత్యదేశాల నాగరికతకు ఎప్పుడూ లేని ముప్పు ముంచుకొచ్చిందనీ, వలసల్ని అడ్డుకోకుంటే వాటి ప్రాభవం, భవిష్యత్తూ మంటగలిసి పోతాయనీ అది గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. దీనికోసం ఒక "నూతన వ్యూహాత్మక నివేదికను" రూపొందించి, దాన్ని ప్రపంచ దార్శనికతా పత్రంగా వర్ణిస్తూ ముందుకు తెచ్చింది. ఒకవైపు అమెరికా మానవ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన
ప్రకృతి-పర్యావరణం

ప్రకృతి నియమాలను మనం అధిగమించగలమా?

డాక్టర్ కె. బాబురావు “ప్రకృతిలో దయ లేదు, జాలి లేదు. అక్కడ నియమం మాత్రమే ఉంది” అని అమెరికా మూలవాసుల నాయకుడు ఒరెన్ లయోన్స్ చెప్పిన మాట ఈ రోజుల్లో మరింత సత్యంగా అనిపిస్తోంది. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత సాంకేతిక విజ్ఞానం పెరిగినా, ప్రకృతి నియమాల ముందు అందరూ సమానమే. ఈ నియమాలకు ఎలాంటి మినహాయింపులూ లేవు. మన అవసరాలు, కోరికలు, ఆశలు ప్రకృతికి అర్థం కావు.