- డా. విరించి విరివింటి "ఆర్కపెలాగో" అంటే 'ద్వీపాల సముదాయం' అని అర్థం. మన భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ద్వీపాల సముదాయాలు ఎన్నో వున్నాయి. ఇవి కాలక్రమంలో పెద్ద ఖండాల నుండి విడిపోయినవి కావడంతో మొక్కల, జంతువుల, మనుషుల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రకృతి సహజమైన జీవశాస్త్ర ప్రయోగశాలల్లాగా ఉపయోగపడతాయి. అందుకే ఆంత్రోపాలజిష్టుల నుంచి పరిణామ వాదులు, పర్యావరణవేత్తలు, డాక్టర్లు దాకా ఈ ప్రాంతాలలో పరిశోధనలు చేయడానికి