మంచిమాట

మంచి మాట

మన విద్యా శిక్షణాసంస్థలు! మన విద్యా శిక్షణాసంస్థలు!స్వతంత్రంగా వ్యవహరించే వారినీ,స్వేచ్ఛగా ఆలోచించే వారినీ,విధేయతను పాటించని వారినీజల్లెడ పట్టి దూరంగా నెట్టడమేమొత్తం మన విద్యా శిక్షణాసంస్థలు చేస్తున్న పని.ఎందుకంటే వీరున్నంతకాలం ఇవి పనిచెయ్యలేవు మరి! -నోమ్ చోమ్స్కీ
సంపాదకీయం

చిక్కుల్లో చిన్న స్కూళ్ళు !

సంపాదకీయం గత పదేళ్లలో ఏకంగా దేశంలో 89,441 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి. ఈ మూతల్లో మధ్యప్రదేశ్ (29 410), ఉత్తర ప్రదేశ్ (25,126) రాష్ట్రాలు 60.9% వాటాతో ముందున్నాయి. దీన్నీ మధ్య సాక్షాత్తు కేంద్ర విద్యా శాఖ ఉప మంత్రి జయంత్ చౌదరి గారు పార్లమెంటులో ప్రకటించారు. మన తెలుగు రాష్ట్రాలు ఈ “రికార్డును” 2015 కు ముందే సాధించాయి! వీటిలో 9503 పాఠశాలలు అప్పటికే తలుపులు మూసేశాయి. ఇవన్నీ
శాస్త్ర ప్రచారం

సార్థకం, బహుముఖీనం నార్లేకర్ జీవితం

విఠపు బాలసుబ్రహ్మణ్యం మనందరికీ స్టీఫెన్ హాకింగ్,  ఐన్ స్టీన్ తర్వాత అంతటి విశ్వశోధకుడని తెలుసు. స్థల కాలాల ఏకత్వాన్ని విశ్వానికి అన్వయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన హాకింగ్ మెదడులోనే మొదట పుట్టింది. ఆ రెండింటి ఆరంభం బిగ్ బాంగ్ లోనే వుందనీ, అవి కాలబిలాలతో అంతమవుతాయని కూడా ఆయన సూత్రీకరించాడు. దీనికిప్పుడు వైజ్ఞానిక ప్రపంచంలో పెద్ద మద్దతు వుంది. కానీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో హాకింగ్ తో టేబుల్ టెన్నిస్ ఆడిన
శాస్త్రజ్ఞులు

సకల సైన్సు సుగుణాభిరాముడు జె. వి. నార్లీకర్

డాII. నాగసూరి వేణుగోపాల్ నేటి తరాలకు పరిపూర్ణంగా ఆదర్శమూర్తిగా నిలిచే మన కాలపు మహా శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లీకర్. జగదీష్ చంద్రబోస్ అనగానే కలకత్తాలోని బోస్ ఇన్స్టిట్యూట్, సి.వి. రామన్ అనగానే బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హోమీ జహంగీర్ భాభా అనగానే ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, మేఘనాథ సాహా అనగానే కలకత్తాలోని సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వంటివి గుర్తుకు వచ్చినట్లుగానే జె.వి.
చరిత్ర ఏమంటుంది

వైదిక యుగాలలో విజ్ఞానాలు

డాక్టర్ గేయానంద్ అన్ని వేదాల్లోనో, మన పురాతన గ్రంథాలలోనూ ఉన్నాయని వాదించడం చూస్తాం. అది ప్లాస్టిక్ సర్జరీ అయిన, జెనెటిక్స్ అయినా, విమానాలైనా, ఇంటర్నెట్ అయినా- అవన్నీ మనవాళ్లకు ఎప్పుడో తెలుసు అని, ఆ జ్ఞానాన్ని పాశ్చాత్యులు దొంగలించారని చెబుతూ ఉంటారు. నిజంగా వేద కాలాలలో, భౌతిక జీవితం ఎలా ఉంది? విజ్ఞానం ఏ మేరకు ఉందో ఒకసారి తెలుసుకుందాం. వేద కాలం లేదా యుగం అంటే స్థూలంగా 1500-600
పిల్లలు-చదువులు

పరీక్షలు- మార్కులు-పోటీలు

సి. వి. కృష్ణయ్య మన చదువులే నాసిరకం చదువులు. ఆ చదువులకు పెట్టే పరీక్షలు మరింతనాసిరకం. అశాస్త్రీయం. అందరూ కలిసి ఆడుతున్న గొప్ప నాటకం. పిల్లల్ని మోసగించటం. ఈ పరీక్షలు పిల్లల్ని భయపెట్టడానికి అవమానించడానికి తప్ప ఎందుకు పనికిరావు. పిల్లలు పరీక్షల గురించి వారికి వచ్చే మార్కుల గురించి ఎలాంటి ఆలోచనలతో ఉంటారు? వారి మనసుల్లో ఎలాంటి భయాలుఉంటాయి?. ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటారు?. పెరిగి పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ భవిష్యత్తు
నమ్మకం-నిజం

పాములు పగబడతాయా?

మిఠాయి యుగంధర్ బాబు "సార్ ! వాడు పున్నమినాగు సార్. వాడిని ముట్టుకోకండి." "వాడిని పాము చాలా సార్లు కాటేసింది సార్. వాడి వొళ్లంతా విషం". "వాడిని ముట్టుకోకండి". పాఠశాలలో మధ్యాహ్నం పూట వంట చేసే ఆమె తన కొడుకు గురించి అందరూ ఇలా అంటుంటే... పిల్లవాడిని తీసుకొని ఊరు వదిలి పోవడానికి తయారయింది. ఓ పది ఏళ్ల ముందు జరిగిన విషయం ఇది. ఒకే అబ్బాయిని పాము అనేకసార్లు
శాస్త్ర వికాసం

అంధకారం నుంచి అక్షర ప్రపంచంలోకి…

అరవింద గుప్తా ‘వెన్న ముద్దల్లాంటి మబ్బుల్ని తదేకంగా చూస్తున్న ఆ పిల్లవాడు ఉన్నట్టుండి తూనీగల వెంబడి తుర్రుమంటున్నాడు. రంగురంగుల సీతాకోక చిలుకలని వెంటపడి తరుముతున్న ఆ అల్లరి పిల్లగాడు పూలరంగుల్ని, వాటి పుప్పొడిని శోధించి చూస్తున్నాడు’.. ఇదంతా ఇప్పుడు ఒకనాటి మధుర స్మృతి! అయిదేళ్ల వయసుకే అతనికివన్నీ స్మృతుల జాబితాలోకి జారిపోయాయి! దబ్బనం తెచ్చిన అంధకారంఒక విషాదం అతని రెండు కళ్ళను బలిగొంది వాళ్ళ నాన్న చర్మకారుడు ఎవ్వరూ లేనప్పుడు
తెలుసుకొందాం

పదార్ధాలన్నీ పరమాణు నిర్మితాలు

ప్రొఫెసర్ ఏ. రామచంద్రయ్య పదార్ధాలన్నీ పరమాణు నిర్మితాలు (Matter is Made Up of Atoms) మన చుట్టూ ఎన్నో రకాల పదార్థాలు, వస్తువులు ఉన్నాయి. గాలి, నీరు, ఆహారం, ఇల్లు, నేల, నాగలి, ఫ్యాను, కంప్యూటరు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పాదరసం, గాజు, అనాల్జిన్ మాత్ర, పారాసిటిమల్ మందు, దోమ, ఏనుగు ఇలా చిన్నా పెద్దా అన్నీ కూడా పదార్థాలతో తయారయ్యాయి. లోహాలు, కొన్ని వాయువులు, కొన్ని ద్రవాలు
మంచిమాట

మంచి మాట

దేశభక్తి నువ్వు పలానా దేశంలో పుట్టావు గాబట్టిఆ దేశం ప్రపంచంలోనే అత్యున్నతమైందనిగాఢంగా నమ్మడాన్నే 'దేశభక్తి ' అంటాం! - జార్జి బెర్నార్డ్ షా