చరిత్ర ఏమంటోంది

భారతదేశంలో తొలి మధ్యయుగాలు-  ఆర్యభట్టు ప్రభావం

డా. యం. గేయానంద్ తొలి మధ్యయుగాలలో భారతదేశం అనేక చిన్న మధ్యతరహా రాజ్యాలుగా విడిపోయింది. ఒక కేంద్రీకృత అధికారం క్షీణించింది. స్థానిక పాలకులు నిరంతర యుద్ధాలకు పాల్పడేవారు. వివిధ పద్ధతులలో ఫ్యుడలీకరణ జరిగింది. నగదుకు బదులు భూములను దానంగా/ ప్రతిఫలంగా ఇచ్చే పద్ధతి ఎక్కవయింది. విదేశీ వాణిజ్యం తగ్గడం వల్ల నగరాల ప్రాముఖ్యత తగ్గి గ్రామీణ ఆర్ధిక వ్వవస్థ బలపడింది. అనేక కొత్త ఉప కులాలు ఏర్పడ్డాయి. సామాన్య ప్రజల్లోకి
సైన్స్ పాఠం

ఆమ్లాలు మరియు క్షారాలు

కె. శ్రీకృష్ణసాయి ఒక రోజు తరగతిలో  స్వామి, తన టీచర్ ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. “సార్, ఈరోజు పేపరులో ఒక వార్త చదివాను. ఒక దుండగుడు ఒక అమ్మాయి మీద ఆమ్లం (ACID)పోశాడట. దాంతో ఆమె ముఖం, చర్మం తీవ్రంగా కాలిపోయాయి. కానీ నిమ్మరసం కూడా సిట్రిక్ ఆమ్లం కదా! అది మన శరీరం మీద పడినా ఎలాంటి హాని కలగదు. పైగా మనం దాన్ని తాగుతాము
సంపాదకీయం

ముసురుకొస్తోన్న మేధోమాంద్యం

సంపాదకీయం క్రమంగా మానవ సమాజం మూగబోతోందా? భిన్న దృక్పథాల ప్రవాహాలకూ, నూతన ఆలోచనా స్రవంతులకూ తావులేని ఎడారిగా మారుతోందా? మనిషి ప్రశ్నించడం మరిచిపోతున్నాడా? ఎదిరించడం, నిలదీయడం, ప్రజల పక్షాన నిలబడడం మేధావులు తమ పని కాదనుకుంటున్నారా? మౌనధారణే మేలనుకుంటున్నారా? ఒకవైపు మానవుడు భూనభోనాంతరాలను జయించానని జబ్బలు చరుస్తున్నాడు. ప్రకృతి శక్తుల్ని గుప్పిట్లో బంధించానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అవును మనిషి చరిత్ర ఎప్పుడూ ఎరగని ఆవిష్కరణలు చేస్తున్నమాట నిజమే. ఎల్లల్ని చెరిపేసి
శాస్త్ర వికాసం

గగన్‌యాన్: అంతరిక్షంలో భారతీయుల అడుగు!

రవిరాజా పోతినేని పరిచయందశాబ్దాల క్రితం, ఒక సైకిల్‌పై రాకెట్ భాగాలను మోసుకెళ్లిన రోజుల నుండి నేడు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చంద్రుడిపైకి, అంగారకుడిపైకి అడుగులు వేసిన వరకు—భారత అంతరిక్ష ప్రయాణం ఒక అద్భుత గాథ. అయితే, ఇప్పటివరకు మన రాకెట్లు యంత్రాలను మాత్రమే మోసుకెళ్లాయి. కానీ ఇప్పుడు, చరిత్ర పుటల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. భారత గడ్డపై నుండి, భారతీయ రాకెట్ సాక్షిగా, ముగ్గురు భారతీయులు నింగిలోకి ఎగరబోతున్నారు. అదే
పిల్లలు-చదువులు

బాల్యం ఎందుకు ఆనందంగా వుండాలి?

సి.వి. కృష్ణయ్య పిల్లలు ఎందుకు ఆనందంగా ఉండాలి? ఎందుకు సంతోషంగా పెరగాలి? ఆనందం లేకుండా పెరిగిన పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి వ్యక్తులుగా తయారవుతారు? అసలు బాల్యంలో ఆనందం అనేది ఎలా ఉంటుంది? పిల్లలపై ఎలాంటి హింస జరుగుతూ ఉంది?  పిల్లల ఆనందం కోసం పెద్దలు ఏమి చేయాలి? ఈ  విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. బాల్యం గురించి ఏమీ తెలియని ప్రపంచంప్రపంచ మానవాళి ప్రకృతి గురించి, జీవుల గురించి ఎంతో
సైన్స్ పాఠం

ఘర్షణ

కె. శ్రీ కృష్ణసాయి సైన్సు పాఠం ( సైన్సు దినోత్సవం సందర్భంగా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కొత్త శీర్షిక "సైన్సు పాఠం" ప్రారంభిస్తున్నాం. దీన్ని రేవతి సైన్స్ సెంటర్ (రామచంద్రాపురం) నిర్వాకులు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కె. శ్రీకృష్ణసాయి గారు నిర్వహిస్తారు. ప్రధానంగా ఇది ఉపాధ్యాయుల కోసం. పాఠ్యాంశపు లక్ష్య వివరణ, చారిత్రక నేపథ్యం, పై తరగతుల్లో దీని కొనసాగింపు, నిత్య జీవితంతో అనుసంధానం, శాస్త్రీయ దృక్పథానికి అన్వయింపు,
శాస్త్రజ్ఞులు

గొప్ప వైద్యుడు, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు-డా. బి.సి. రాయ్

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 9 అది 1942... క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతోలది. పుణే నగరంలో గాంధీజీ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఔషధాలు స్వీకరించడానికి గాంధీజీ అంగీకరించడంలేదు, ఆ మందులు భారత దేశంలో తయారు కాలేదని. గాంధీజీ మిత్రుడయిన ఓ రాజకీయ నాయకుడు, వైద్యుడు వైద్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. "నేనెందుకు ఔషధాలు స్వీకరించాలి? నలభై కోట్ల భారతీయులకు ఉచితంగా వైద్యం చేయగలవా?" అని ఆ
నమ్మకం-నిజం

కుడి ఎడమైతే…

మిఠాయి యుగంధర్ బాబు కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..... అని పాత దేవదాసు సినిమా లో ఓ పాట ఉంది కదా. ఇది ఒక సామెత కూడా అయిపోయింది చాలా సందర్భాల్లో దీనిని వాడుతూ ఉంటారు. ఈమధ్య ఎవరో ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. ఆ గేయ రచయిత సముద్రాల సీనియర్ ఇలా రాసారట "కూడి ('కు' కి దీర్ఝము... అంటే కలిసి) ఎడమైతే (అంటే విడిపోతే) పొరపాటు లేదోయ్...
శాస్త్ర ప్రచారం

అష్ట గ్రహాలు

ఎస్. వెంకట్రావు మన సౌరకుటుంబంలో గ్రహాలూ ఎన్ని? ఇప్పుడు అవి ఎనిమిది అని అందరికీ తెలిసిందే! ఒకప్పుడు ప్లూటో కూడా ఉండేది. మొత్తం తొమ్మిది. కానీ ఇప్పుడు ప్లుటోని గ్రహంగా లెక్కించటం లేదు. 2006లో జాకోస్లోవేకియాలోని ప్రాగ్ నగరంలో సమావేశమయిన అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సంఘం (ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్-ఐ.ఎ.యు) చేసిన నిర్ణయాన్ని బట్టి ఇకపై మనం సూర్య కుటుంబాన్ని అష్ట గ్రహ కూటమిగా పిలవాల్సి ఉంటుంది... అవి: బుదుడు, శుక్రుడు,