ప్రకృతి సూత్రాలు-17,18వ సార్వత్రిక నియమాలు
ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య 17. సార్వత్రిక నియమముజీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు (Life Exists only Inside a Cell). భూమ్మీద మాత్రమే జీవం ఉన్న ఆధారాలున్నాయి. భూమి లాంటి పరిస్థితులు విశ్వంలో కొన్ని గ్రహాల్లో ఉన్నట్లు అంచనా వేశారు. అయినా భూమికి తోడుగా మరెక్కడయినా జీవులు ఉన్న దాఖలాలు ఇంత వరకు ఋజువు కాలేదు. భూమ్మీద జీవులు ఏర్పడే పరిస్థితులు నేటికి సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రిందట
