శాస్త్రజ్ఞులు

పర్యావరణోద్యమాలకు ప్రాతఃస్మరణీయుడు సుందర్​లాల్ బహుగుణ

డా. నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-13 1981లో నైరోబీ నగరంలో ప్రపంచ శక్తి సదస్సు జరుగుతోంది. పైజామా, కుర్తా వేసుకొన్న వ్యక్తి కట్టెల మోపు భుజాన వేసుకుని సమావేశమందిరంలోకి ప్రవేశించడం ఎందరినో ఆకర్షించింది! అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో పేదరికం, వెనుకబాటుతనం ఎలా దెబ్బ తీస్తున్నాయో పాశ్చాత్య దేశాల ప్రతినిధులకు చెప్పాలని సుందర్​లాల్ బహుగుణ ప్రయత్నం!! 1927 జనవరి 9న టెహ్రి (ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రపు జిల్లా) ప్రాంతం
శాస్త్ర వికాసం

చంద్రుడిపై నీరు – అంతరిక్ష భవిష్యత్తుకు కొత్త దారి

రవిరాజ పోతినేని కొందరు చంద్రుడిని కవిత్వానికి ప్రతీకగా చూస్తారు. మరికొందరు ప్రేమకు, అందానికి చిహ్నంగా భావిస్తారు. అయితే శాస్త్రవేత్తల దృష్టిలో చంద్రుడు ఇప్పుడు మరో కారణంతో అత్యంత ప్రాధాన్యం పొందుతున్నాడు. అదే చంద్రుడిపై నీటి ఉనికి. ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయిన, ప్రాణం లేని రాతిగోళంగా భావించిన చంద్రుడిపై నీరు ఉందని నిర్ధారణ కావడం అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణగా నిలిచింది. ఈ ఆవిష్కరణ మానవాళి అంతరిక్ష భవిష్యత్తును
నమ్మకం-నిజం

న్యూ’మారాల’జీ

మిఠాయి యుగంధర్ బాబు వెనుకటి ఒక సామెత. ఒకడికి భగవంతుడు (ఉంటే సుమా!!) ప్రత్యక్షమై' ఏం వరం కావాలో కోరుకోరా' అంటే...."నా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు స్వామి, తత్తిమాది నే చూసుకుంటా" అన్నాడంట. అంటే అర్థం ఏమిటి ? మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిస్తే అది అదృష్టం కింద లెక్క. అప్పుడిక ఆయన పట్టింది అంతా బంగారం అయిపోతుంది! తరువాత  ఆయన కూతురుని పెళ్లి చేసుకుంటే ఆ బంగారం
చరిత్ర ఏమంటోంది

మధ్యయుగాల్లో భారతదేశంలో సాంకేతికతలు – లోహాలు, నిర్మాణాలు

డా. యం. గేయానంద్ మధ్యయుగాల నాడు ఉన్న కొన్ని సాంకేతిక విజ్ఞానాల గురించి మాట్లాడుకొందాం. లోహాల గురించీ, కొన్ని వృత్తుల గురించి, కట్టడాల గురించీ మాట్లాడుకొందాం. వీటన్నింటిలో ఉన్న సాంకేతికతలు, అనుభవ విజ్ఞానం ద్వారా నేర్చుకొన్నవే. కొన్ని విదేశాల నుండీ స్వీకరించినవి. అయితే చాలా అంశాలలో అవసరమైన వేగం, చురుకుదనం కనిపించదు. దానికి ఆనాడున్న సామాజిక పరిస్థితులే కారణం కావచ్చు. లోహాల గురించి మాట్లాడుకోవాలంటే ముందు గనుల గురించి మాట్లాడుకోవాలి.
సైన్స్ పాఠం

థర్మామీటర్ల చరిత్ర, పరిణామం మరియు శాస్త్రీయ వివరణ

కె శ్రీకృష్ణ సాయి పరిచయంమన రోజువారీ జీవితంలో “ఉష్ణోగ్రత” అనే భావన చాలా ముఖ్యమైనది. మనకు జ్వరం వచ్చినప్పుడు, వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, లేదా ప్రయోగశాలలో పరిశోధనలు చేస్తున్నప్పుడు - ప్రతి సందర్భంలోనూ థర్మామీటర్ కీలక పాత్ర పోషిస్తుంది. థర్మామీటర్ అనేది కేవలం ఒక కొలిచే పరికరం మాత్రమే కాదు, అది శాస్త్ర అభివృద్ధి యొక్క ఒక గొప్ప సూచిక.  థర్మామీటర్ అంటే ఏమిటి?థర్మామీటర్ అనేది  ఒక వస్తువు లేదా
సంపాదకీయం

సైన్సూ – ఛాందసమూ

సంపాదకీయం కేంద్రవిద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొత్తగా 'గ్రీన్ విచ్ టైమ్' (GMT) మీద యుద్ధం ప్రకటించాడు. అసలు 'గ్రీన్ విచ్ ' అనేది వలసదార్ల ఊహారేఖ మాత్రమేననీ, దాన్ని కాలానికి కేంద్రంగా పరిగణించడం మెకాలే విద్యా మానసిక స్థితి నుంచి పుట్టుకొచ్చిందనీ కొత్త భాష్యం చెప్పుకొచ్చాడు. ఉజ్జయిని కేంద్రంగా "మహాకాలం" ప్రామాణికంగా గుర్తించే రోజు రావాలని పిలుపునిచ్చాడు. గత మాసం మొదటి వారం ఉజ్జయినిలో జరిగిన 'మహాకాల్ అంతర్జాతీయ సదస్సులో
శాస్త్ర ప్రచారం

మన పూర్వీకులు శాస్త్రీయంగా అభివృద్ధి చెందినవారా?

జె.వి. నార్లికర్ [ఈ వ్యాసం ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ వి. నార్లికర్ రాసినది. ఇది మొదట 1985 ఏప్రిల్‌లో Science Age అనే పత్రికలో వెలువడింది. ఆ పత్రికను బొంబాయిలోని నెహ్రూ సెంటర్ ప్రచురించింది. ఈ వ్యాసం  4 దశాబ్దాల పాతదైనా, నకిలీ శాస్త్రంపై వచ్చిన విమర్శలలో ఎక్కువ భాగంలాగే ఇది ఇప్పటికీ ప్రాసంగికంగానే ఉంది. అమెరికన్ తత్వవేత్త  మాస్సిమో పిగ్లియూచ్చి (Massimo Pigliucci) తన పుస్తకం Nonsense
శాస్త్ర ప్రచారం

సైంటిఫిక్ టెంపర్

డా|| పి.ఎం. భార్గవ, సీనియంబీ వ్యవస్థాపక డైరెక్టర్ జవహర్లాల్ నెహ్రూ 1946లో ప్రచురించిన తన డిస్కవరీ ఆఫ్ ఇండియా' పుస్తకంలో మొదటిసారిగా 'సైంటిఫిక్ టెంపర్' అనే పదాన్ని వాడారు. అప్పటికే నెహ్రూ భారత సైన్స్ వర్కర్ల సంఘానికి (అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ పర్ఫన్స్ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు. ఇది ఒక రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్. ఈ సంఘంతో 1940వ దశకం, 1950వ దశకం ప్రథమార్ధంలో నాకు బాగా సన్నిహిత సంబంధాలుండేవి.
చరిత్ర ఏమంటోంది

భారతదేశ మధ్యయుగాల్లో వ్యవసాయ సాంకేతికతలు

డా. యం.గేయానంద్ క్రీ.పూ. 7 వేలకు ముందే భారత ఉపఖండంలో బార్లీ, గోధుమ పండించారు. సింధూ నాగరికత సమయంలో ఎద్దుల బళ్ళు (2500-1900 BC) ఉండేవి. క్రీ.పూ.3000 సం.ల నాటికే వరి ఉంది. వరి పంటతో పాటు అడవి జంతువుగా ఉన్న నీటి దున్న మచ్చిక అయింది. క్రీ.పూ.900 నాటికి చెరకు పంట ఉంది. క్రీ.పూ.350 నాటి పాణిని అవిసె గింజల గురించి, జనుము, నీలిమందు అద్దకపు పంటల గురించిన