సంపాదకీయం

ఏ మలుపుకు చేరుకొన్నాం?

సంపాదకీయం "గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అంటాడు తిక్కన భారతంలో. మరి తిక్కనకు అంతకు ముందటి కాలమంతా అంత గొప్పగా ,తన కాలం దానికి తీసికట్టుగా ఎందుకు కనిపించిందో మరి! వర్తమానం మీదా, భవిష్యత్తు మీదా ఆయనకెందుకు ఆశాభావం లేదో మరి ! కానీ గురజాడ "మంచి గతమున కొంచెమేనోయ్" అంటాడు. శ్రీశ్రీ మరో అడుగు ముందుకేసి "గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో" అన్నాడు. వీళ్ళిద్దరికీ
శాస్త్ర వికాసం

సూడో సైంటిఫిక్ జాతి వాదం

- డా. విరించి విరివింటి "ఆర్కపెలాగో" అంటే 'ద్వీపాల సముదాయం' అని అర్థం. మన భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ద్వీపాల సముదాయాలు ఎన్నో వున్నాయి. ఇవి కాలక్రమంలో పెద్ద ఖండాల నుండి విడిపోయినవి కావడంతో మొక్కల, జంతువుల, మనుషుల గురించి లోతుగా తెలుసుకోవడానికి ప్రకృతి సహజమైన జీవశాస్త్ర ప్రయోగశాలల్లాగా ఉపయోగపడతాయి. అందుకే ఆంత్రోపాలజిష్టుల నుంచి పరిణామ వాదులు, పర్యావరణవేత్తలు, డాక్టర్లు దాకా ఈ ప్రాంతాలలో పరిశోధనలు చేయడానికి
సందర్భం

దామగుండం అడవికి గండం

- రాహుల్జీ హైదరాబాదు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ అడవిలో భారతదేశ రక్షణ అవసరాల కోసం ఒక లోఫ్రిక్వెన్సీ రాడార్ స్టేషన్ ని ఏర్పాటు చేస్తున్న విషయం చాలామందికి తెలిసే వుంటుంది.  ఈ ప్రతిపాదన 2014 నుంచే వున్నా, ఈ మధ్య అన్ని రకాల అనుమతులతో ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం నౌకాదళానికి భూమిని బదలాయించడంతో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి
చరిత్ర ఏమంటుంది

బాపూజీ సైన్స్ బాట-1 

అహింసాత్మక, రాడికల్, ప్రత్యమ్నాయ సైన్స్ వాది – గాంధీజీ డా. నాగసూరి వేణుగోపాల్ 9440732392 ప్రముఖ సైన్స్ కాలమిస్ట్ & ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు  "విజ్ఞాన శాస్త్రపరంగా సాధించిన గణనీయమైన అభివృద్ధి అనేది సమాజంలోని విద్వేషాలను, అన్యాయాలను తగ్గించలేకపోయింది. యూరోప్ ఖండపు నైతిక స్థాయి ఒక అంగుళం కూడా పెరగలేకపోయింది." అనే మాట మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన అభిప్రాయం! ఇంతకూ ఈ అభిప్రాయం చెప్పిన వారెవరు? ' మ్యాన్స్ ప్లేస్
తెలుసుకొందాం

పద్దెనిమిది ప్రకృతి సూత్రాలు

 మూడవ సార్వత్రిక నియమము - ఎ. రామచంద్రయ్య ఈ విశ్వంలో ఏదీ స్థిరంగా లేదు. ప్రతిదీ చలనంలో ఉంది. ఏ వస్తువూ శాశ్వతం కాదు. చిన్నదైనా, పెద్దదైనా ప్రతిదీ మార్పు చెందవలసిందే. మారనిదేదీ విశ్వంలో లేదు. కేవలం మార్పు మాత్రమే శాశ్వతం. గతిలో లేని దానికి విశ్వంలో స్థితి లేదు. (Nothing in the Universe is Eternal; Nothing is Static; Everything, Small or Big, Has to Change. No Object
మంచిపుస్తకం

మనకు తెలియని మరో సమాజం – ఒక హిజ్రా ఆత్మకథ

విఠపు బాల సుబ్రహ్మణ్యం దొరస్వామికి ఏదో అయింది. అతడికి ఆడపిల్ల లాగా పావడ, రవిక తొడుక్కోవాలనిపిస్తోంది. పూలు పెట్టుకోవాలని కోరికగా వుంది. పచ్చటి పొలంలో పనిచేసేప్పుడు ఆడపిల్లల్లా ఊహించుకుంటూ పాటల పాడాలనిపిస్తోంది. ఏడో తరగతిలో చంద్రమతి వేషం వేసినప్పుడు పట్టరాని సంతోషం వేసింది .తాను అబ్బాయి అయినా మగ పిల్లల్ని ప్రేమించాలని ఉబలాటంగా వుంది. అదొక స్వభావం! మగ, ఆడ పిల్లల లాగే ఇలాంటి వాళ్ళూ ప్రకృతిలో వున్నారు. అక్షరాలా
ప్రకృతి-పర్యావరణం

పర్యావరణ పరిరక్షణ – తాజా నాటకం

- ప్రొ. యన్. వేణుగోపాల రావు ఐక్యరాజ్యసమితి "కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్" 28వ చర్చా వేదిక దుబాయ్ నగరంలో 2023 నవంబరు 30 నుండి డిసెంబరు 13 దాకా జరిగింది. ఇలాంటి' గెట్ టుగెదర్లు' గత మూడు దశాబ్దాల్లో వివిధ నగరాల్లో జరుగుతూనే వున్నాయి. తీర్మానాలు చేస్తూనే వున్నారు. గతంలో జరిగిన క్యోటో ( 1997), పారిస్( 2017) ఒప్పందాలు మనల్ని చాలా ఊరించాయి. కానీ ధనిక దేశాలు మాత్రం
నమ్మకం-నిజం

నల్ల పిల్లి చూడతరమా!

- యుగంధర్ బాబు "ఎరుపు అంటే కొందరికి భయం భయం    చిన్నపిల్లలు వారికంటే నయం నయం.."..  అన్నాడు ఓ కవి. కానీ మన దేశంలో చాలామందికి నలుపు అంటే కూడా భయమే. నలుపుని అశుభానికి సూచకంగా భావిస్తారు. కొందరు నలుపు రంగు దుస్తులు ధరించరు. నలుపు రంగు వస్తువులు వాడరు. అంతటితో ఆగి పోకుండా ఆ రంగుని జంతువులకు కూడా ఆపాదించారు. "పిల్లులలో  నల్ల పిల్లి వేరయా"  అని... నల్ల
మంచిమాట

మంచి మాట

ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని  గుడ్డిగా నమ్ముతారు.   -మహాకవి కాళిదాసు                                                                                                                                                  
సంపాదకీయం

ఏ వెలుగులకీ ప్రస్థానం?

"చారిత్రక విభాత సంధ్యల మానవ కథా వికాసమెట్టిది?ఏ దేశం ఏ కాలంలోసాధించినదే పరమార్ధం ?" అంటూ శ్రీశ్రీ అంతిమంగా "ఏ వెలుగులకీ ప్రస్థానం" అని ప్రశ్నిస్తాడు. నిజంగానే మానవ సమాజం వెలుగుల వైపే ప్రయాణం సాగిస్తోందా?  మొత్తంగా ప్రస్తుత కాలపు మానవజాతి ఆలోచనలు ఎలా వున్నాయి? ఏ దేశాల మానవుల భావ స్రవంతి ఎటువైపు ప్రవహిస్తోంది ? మళ్లీ పొరలు పొరలుగా  విడదీస్తే ఒకే దేశంలోని భిన్న సామాజిక వర్గాలు వేటికవిగా ఏ