సంపాదకీయం

ఇప్పుడు మనకు ఐన్ స్టీన్లు లేరు, నెహ్రూలూ లేరు!

సంపాదకీయం “ఒక్క మానవజాతిని మాత్రమే గుర్తుంచుకోండి ! మిగిలినవన్నీ మరిచిపోండి” అంటుంది 1955 నాటి రస్సెల్- ఐన్ స్టీన్ మేనిఫెస్టో. విజ్ఞానశాస్త్రం ఊహాతీత హననానికి రాచబాట వేస్తున్నవేళ సూటిగా గుండెలకు గుచ్చుకునే ఈ రెండు మాటలు వాళ్ళు చెప్పి డెబ్బై ఏళ్ళు ముగుస్తున్నాయి. దాదాపు రెండు లక్షల మందిని క్షణాల్లో భస్మీపటలం చేసిన 1945 నాటి నాగసాకి, హిరోషిమా అణువిధ్వంసాన్ని చూచిన 'మ్యాన్ హట్టన్' ప్రాజెక్టు డైరెక్టర్ ఓపెన్ హైమర్
చరిత్ర ఏమంటుంది

రాతి యుగంలో మనిషి చేసిన తొలి ప్రయోగం. . .

చరిత్రలో సైన్సు ఎలా వికసించింది? ఈ ఫిబ్రవరి, సైన్సు నెల, నుండి మాట్లాడుకుందాం.. సైన్స్ అంటే, ఏదో ఒక సూత్రం, లేకుంటే ప్రయోగం, రుజువు అనుకుంటాం. అయితే వీటి వెనక ఒక చరిత్ర ఉందనే విషయం, పెద్దగా పట్టించుకోం. చాలా సామాజిక సందర్భాలు సైన్స్ ను ప్రభావితం చేశాయి. సైన్సు నడిచే దారుల్లో ఎన్నో తప్పులు, ఒప్పులు జరిగేవి. ఈ తప్పులు ఒప్పులు చేసేది శాస్త్రవేత్తలే. శాస్త్రవేత్త అనే పదం
శాస్త్ర ప్రచారం

పరిణామ వాదానికి పాతా కొత్తా సవాళ్లు

పాశ్చాత్య దేశాల్లో ఈ రోజుకీ అగ్గిలా మండుతున్న శాస్త్ర సంబంధమైన అంశం ఏదైనా వుందంటే అది డార్విన్ పరిణామవాదం మాత్రమే. ఆయన ఎప్పుడో 1859 లో రాసిన The Origin of Species గ్రంథం ప్రచురితమైనప్పటి నుండి ఇప్పటికీ సైన్స్ కు మతానికీ మధ్య వివాదాలు రేపుతూనే వుంది. బైబిల్ సృష్టి వాదానికి దీనికీ మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత వైరం సాగుతూనే ఉంది. మరీ ప్రస్తుత అమెరికన్ మత
శాస్త్ర వికాసం

జీవపరిణామం ఆగిపోయిందా? కొనసాగుతోందా?

మానవునితో జీవపరిణామం ఆగిపోయిందా లేక కొనసాగుతోందా అంటే సమాధానం రెండు విధాలుగా వస్తుంది. కింది స్థాయి జీవులనుండి ఉన్నత జీవులకు పరిణామం నేటికీ కొనసాగుతోంది అనేది మొదటి సమాధానం. మానవుని తరువాత పరిణామం ముందుకు సాగడం ఆగిపోయినట్లే అన్నది రెండో సమాధానం. జీవపరిణామం అన్నది ఒక నిరంతర క్రమం. పదార్థ నిత్య చలనంలో, నిత్య పరిణామంలో అది అంతర్భాగం. ఈ భూమి, (గ్రహాలు కూడా పదార్థ చలనంలో భాగంగా ఏర్పడినవే.
శాస్త్ర వికాసం

విజ్ఞాన శాస్త్రం- వికృత ధోరణులు

విజ్ఞాన శాస్త్రం రుజువులతో వాస్తవాల్ని బయటపెట్టాలి. సత్యాన్ని పరమధర్మంగా భావించాలి. సంకుచిత ధోరణి నుంచి మళ్లించి సమాజానికి విశాల దృక్పథం కలిగించాలి. విశ్వమానవత్వం దాని అంతిమలక్ష్యంగా వుండాలి. దాని పరిశోధనల్లో, సూత్రీకరణల్లో స్వీయ మానసికతకు, స్వార్ధపర శక్తుల ప్రయోజనాలకు తావుండరాదు. అధిపత్య వర్గాల చేతుల్లో పావుగా మారి, సైన్సు పేర వారి చేతికి కొత్త పరికరాలు అందించరాదు. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్సు నుంచి మనం సత్యాన్ని ఆశిస్తాం. శాస్త్రవేత్తలు
నమ్మకం-నిజం

“హ్యాపీ టు బ్లీడ్”

          “రాజేశ్వరి అలా తాకడానికి వీలు లేకుండా దూరంగా ఎందుకు ఉండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిది ఏముంది ? ప్రకృతి సిద్ధంగా, స్త్రీకి ఎంతో సహజమైన ఈ 'ఋతు కార్యక్రమం' ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అని నలుగురికి చాటి చెప్పడం ఏం బాగుంది ? … ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు ?”           ఈ వాక్యాలు 45 ఏళ్ల ముందు
తెలుసుకొందాం

ఏడవ సార్వత్రిక నియమము

ఒకే సూత్రాల సమూహంతో చలనాలన్నింటినీ వివరించగలము.(One Set of Laws Explains all Set of Motions) విశ్వంలో అన్ని చోట్లా చలనాలు ఉన్నట్లు తెలుసుకున్నాం. దోమ, ఏనుగు, అణువు, పరమాణువు, నదులు, సముద్రాలు, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాలు ఇలా దేనిలోనైనా జరిగే చలనాలను వివరించడానికి ఒకే విధమైన సూత్రాలు సరిపోతాయి. ఉదాహరణకు గాడిద పొట్టప్రేవుల్లో కదిలే నీటి గతిజశక్తికి సూత్రం E=1/2 mv2 అయితే హిమాలయ పర్వతాల