సృజనను పెంచే సైన్సు ఫిక్షన్ - ఎస్. వెంకట్రావు మనిషిని జంతువు నుండి వేరు చేసే ప్రధాన లక్షణం ఊహాశక్తి. జంతువు ఆలోచనల్లో "నిన్న" లేదు కాబట్టి" రేపు" కూడా వుండదు. దానికి వున్నది "అప్పుడు" " అక్కడ" మాత్రమే. కానీ మనిషి ఊహాశక్తి అతన్ని "నేటి" నుండి విడగొట్టింది. అందుకే అతడు నిన్నటి గురించి ఆలోచించగలడు. రేపటి గురించి ఊహించగలడు. ఇదే అతడిని ఆధునిక మానవునిగా మెట్టు మెట్టు ఎదగడానికి