నమ్మకం-నిజం

నమ్మకం- నిజం

గబ్బిలం అరిష్టమా? - యుగంధర్ బాబు అదేదో సీరియల్ లో పాము మనిషిగా మారిపోతుంది. మనిషి పాముగా అయిపోతాడు. నాగమ్మ .. శ్వేతనాగు... ఇలా రకరకాల పేర్లతో రకరకాల సినిమాలూ, సీరియళ్ళూ! అసలు మనిషిగా పుట్టిన వాళ్లు కనీసం మనిషిగా మారడానికే ప్రయత్నం చేయడం లేదు కానీ జంతువుల్ని మాత్రం మనుషులుగా మార్చేస్తున్నారు! ఇలా జంతువులు మనుషులుగా మారే కథల్లో ముందంజలో వుంటుంది ఒక జీవి. అదే అమాయక ప్రాణి
నమ్మకం-నిజం

బల్లి పురాణం

నమ్మకం-నిజం బల్లి పురాణం! - యుగంధర్ బాబు బల్లిని చూడగానే చాలామంది కెవ్వుమంటారు. ఎక్కడ మీద పడిపోతుందోనని కంగారు పడతారు, హడలిపోతారు. చాలామందికయితే బల్లి అంటే ఎక్కడాలేని అసహ్యం. దాన్ని బయటకు తరిమేంతవరకు  ఆ గదిలో అడుగు కూడా పెట్టరు. ఇక  దీని చుట్టూ అల్లుకున్న నమ్మకాలు, అపోహలు రాస్తే ఒక పురాణమే అవుతుంది. ఇంట్లో బల్లిని తాకితే అపచారమనీ, అసహ్యమనీ ఈసడించుకొనే వారే కంచిపెళ్లి బంగారు బల్లిని  తాకడం కోసం నానా తండాలు పడతారు.