మంచిమాట

మంచి మాట

నిజంనిజం కూడా నిరంతరం ప్రచారంలో వుండాలి లేకుంటే నిజం అబద్ధంగా మారుతుంది.రాష్ట్రాన్ని, దేశాన్నే గాదు ప్రపంచాన్ని సైతం ప్రమాదంలోకి నెడుతుంది!-బి. ఆర్. అంబేద్కర్
మంచిమాట

మంచి మాట

ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు! జీవితంలోని కష్టాలను తీర్చలేనిది ఆవిష్కరణ కాదు!! జీవితంలోని ప్రతి కోణాన్ని చూపలేనిది సాహిత్యమే కాదు !!- కొడవటిగంటి కుటుంబరావు
మంచిమాట

మన కర్తవ్యం

మంచి మాట మన కర్తవ్యంప్రపంచాన్నేగాదు మనల్ని గురించి కూడా అర్థం చేసుకోనీకుండా అడ్డగించే సంకుచిత మత దృక్పథాన్నుంచి, లోకాతీత పారలౌకిక ఊహా సౌధాల భ్రమల్లో నుంచి మనం బయటపడాలి. వర్తమానంతో, ఈ జీవితంతో, ఈ ప్రపంచంతో, మన చుట్టూ ఆవరించి ఉన్న ఈ ప్రకృతితో ముఖాముఖి పోరాడాలి.- జవహర్ లాల్ నెహ్రూ
మంచిమాట

మంచి మాట

ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని  గుడ్డిగా నమ్ముతారు.   -మహాకవి కాళిదాసు                                                                                                                                                  
మంచిమాట

మంచిమాట

ఉపాధ్యాయుడు      ఉపాధ్యాయుడు తాను అబద్ధాలు చెపుతూ పిల్లల్ని సత్యం పలకమనడం వృథా! తాను పిరికితనం పులుము కొని పిల్లల్ని సాహసవంతులుగా తీర్చాలనుకోడం అసాధ్యం!! తనకు ఆత్మనిగ్రహం లేకండా పిల్లలకు ఆత్మనిగ్రహాన్నిఅలవర్చడం అసంభవం!!! - మహాత్మాగాంధీ