చరిత్ర ఏమంటుంది

పిల్లనగోవి నియాండర్తల్ మానవుడిదా?

డాక్టర్. డి బాలసుబ్రమణియన్,  మాజీ డైరక్టరు, సిసియంబి “రాగం రానివాడు, రోగం లేని వాడు లేడు” అనేది సామెత. రోగం సరే జీవపదార్థం అంటూ ఒకటి వున్నంతకాలం “నేను వున్నాను” అంటూ వెంటపడుతూనే వుంటుంది. మరి రాగమో? ఇది ఎప్పటినుండి మనిషితో మమైకమైనట్టు? సైన్సు లేని చోటు లేదు! సంగీతాలు, సరాగాలు సాంస్కృతికాంశాలు. శాస్త్రానికీ వీటికీ సంబంధం ఏమిటి?  అని సవాలు చేస్తారేమో మీరు.  శాస్త్రం (సైన్సు) వేలు పెట్టని