సంపాదకీయం

ద్రవిడచైతన్యానికి సైన్సు వత్తాసు

సంపాదకీయం మానవులకు తమ మూలాలు శోధించుకోడమంటే మహా ముచ్చట. తమ పురావైభవాన్ని తవ్వితీసి కథలు కథలుగా చెప్పుకోడమంటే చెప్పలేని వ్యామోహం. ఇందుకోసం ఎవరి పురాణాల్ని వాళ్ళు సృష్టించుకుంటారు. ఎవరి మూల పురుషుల్ని వాళ్లు వెతుక్కొంటారు. ఇక్కడితో ఆగక తమ గతం అనన్యసాధ్యమన్న గొప్పలకు పోతుంటారు. తమది స్వచ్ఛమైన, సర్వోన్నతమైన జాతిగా భ్రమపడుతుంటారు. దీనికోసం గొడవలు పడుతుంటారు. గొంతులు కూడా కోసుకుంటారు. ఇది జాత్యహంకారం. ఫాసిజానికి పూర్వరూపం. వాస్తవానికి జాతిని నిర్ధారించేందుకు
ప్రజారోగ్యం

మన ఆరోగ్యం… జన్యువుల్లో దాగిన రహస్యం

వి.రాహుల్జీ వేల ఏళ్ల నాటి ఎముకల నుంచి ఆధునిక మధుమేహం, గుండెజబ్బులు, అరుదైన వ్యాధుల వరకు... మన DNA చెబుతున్న ఆరోగ్య చరిత్ర గోవాలోని సెయింట్ అగస్టిన్ చర్చి శిథిలాల్లో పురావస్తు తవ్వకాలు జరుగుతున్నప్పుడు కొన్ని మానవ అస్థికలు బయటపడ్డాయి. వందల సంవత్సరాలుగా మట్టిలో పడి ఉన్న ఆ ఎముకలు ఎవరివి? వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కాలంలో జీవించారు? ఒకప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం చారిత్రక
చరిత్ర ఏమంటోంది

మధ్యయుగాలు – యుద్ధాలు – ప్రయాణాలు

డా. యం. గేయానంద్ మనిషి భౌతిక జీవితంతో ముడిపడి ఉండేదే టెక్నాలజి. భౌతిక జీవితాన్ని మెరుగు చేసుకునే క్రమంలోనే టెక్నాలజి అభివృద్ధి అవుతూ ఉంటుంది. శాస్త్ర సాంకేతికాంశాల అభివృద్ధిలో మానవుడికి సహజంగా ఉండే ఉత్సుకత/జిజ్ఞాస కూడా ఒక పాత్ర వహిస్తుంది. ఒక్కోసారి ఇతరుల్ని చూసి నేర్చుకొని, టెక్నాలజీని మనిషి సొంతం చేసుకొంటాడు. అట్లే టెక్నాలజి వ్యాప్తిలో అధికారం, వ్యాపారం కూడా పాత్ర వహిస్తాయి. అయితే మధ్యయుగాల భారతంలో టెక్నాలజి అభివృద్ధిలో
తెలుసుకొందాం

ఒక్క రీల్ మాత్రమే… అన్నాక గంట ఎలా గడిచిపోతుంది?

ప్రొఫెసర్ వి. శ్రీనివాసచక్రవర్తి రీల్స్‌, డోపమైన్‌, మన మెదడు చేసే చిన్న లెక్కలు “ఒక్క రీల్ మాత్రమే చూస్తాను!” ఫోన్ తీసుకున్నప్పుడు మనలో చాలామంది ఇలా అనుకునే ఉంటాం. ఒక రీల్ అయిపోతుంది. వేళ్లు వాటంతట అవే పైకి జరుపుతాయి. ఇంకో వీడియో వస్తుంది. అది అంతగా నచ్చకపోతే వెంటనే మరో స్వైప్. ఈసారి మాత్రం అదిరిపోయే వీడియో! దాని తర్వాత ఇంకోటి. “ఇదే చివరిది” అనుకునేలోపే అరగంట గడిచిపోయి
శాస్త్రజ్ఞులు

సైన్స్ పరిశోధకుడు, సత్యశోధకుడు, దేశరక్షణ దీపదారి డా. సూరి భగవంతం

వైజ్ఞానిక వెలుగు దివ్వెలు- 16 డా. నాగసూరి వేణుగోపాల్ తెలుగునాట శాస్త్రవేత్తగా గణనీయమైన పేరు గాంచిన వ్యక్తి డా.సూరి భగవంతం. వీరు సి.వి.రామన్ శిష్యులుగా, అంతే వాసిగల శాస్త్రవేత్తగా, యుద్ధ విజ్ఞానశాస్త్ర సంబంధించిన దార్శనికులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగపు నిర్మాతగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్దేశకులుగా, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మూలపురుషుడుగా సదా చిరస్మరణీయులు!  1909 అక్టోబర్ 14న కృష్ణా
నమ్మకం-నిజం

చావంటే భయమా

మిఠాయి యుగంధర్ బాబు చాలా ఏల క్రితం మా అంకుల్ (నాన్న గారి స్నేహితుడు) ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. ఎన్నో ఏళ్ల పాటు జాతకాలు వెతికి వెతికి, చివరికి నిశ్చయమైన పెళ్లి అది. కానీ అనుకోకుండా పెళ్లికి ముందు పెళ్లికూతురు వాళ్ళ నాన్నమ్మ  ఆసుపత్రిలో చనిపోయింది. అంకుల్ దహన సంస్కారాలు చేయాలి. కానీ పెళ్లికి పెళ్లి కొడుకు వాళ్ళు  మెలిక పెట్టారు. ఇంట్లో ధన సంస్కారం జరిగితే
శాస్త్ర వికాసం

భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS) – రోదసిలో భారత శాశ్వత పరిశోధనా స్థావరం

రవిరాజా పోతినేని పరిచయం & చారిత్రక ప్రస్థానంకాలం 1963, నవంబర్ 21 సాయంత్రం.కేరళలోని తుంబా తీరం... అరేబియా సముద్రపు అలల సవ్వడులు, కొబ్బరి చెట్ల వీవనల మధ్య నిశ్శబ్దంగా ఉన్న ఒక చిన్న మత్స్యకార గ్రామం. తీరానికి ఆనుకుని ఉన్న సెయింట్ మేరీ మాగ్డలీన్ చర్చి అప్పుడప్పుడే ఒక ప్రార్థనా మందిరం నుంచి సరికొత్త చరిత్రకు ప్రయోగశాలగా రూపాంతరం చెందుతోంది. బిషప్ గది శాస్త్రవేత్తల ఆలోచనల కేంద్రంగా మారగా, చర్చి
సైన్స్ పాఠం

 కొవ్వొత్తి  కధ

కె .శ్రీకృష్ణ సాయిసైన్స్ పాఠం కొవ్వొత్తి  లేని రోజుల్లో  మనిషి కట్టెలు, ఎండిన గడ్డి, కొవ్వు మరియు నూనెలను కాల్చి వెలుగును పొందేవాడు. కొవ్వొత్తి మనిషి కనుగొన్న అత్యంత పురాతనమైన కృత్రిమ కాంతి సాధనాల్లో ఒకటి. నేడు కొవ్వొత్తిని ఎక్కువగా పుట్టినరోజులు, పండుగలు, ప్రార్థనలు, అలంకరణ కోసం ఉపయోగిస్తున్నప్పటికీ, ఒకప్పుడు అది రాత్రివేళ మనిషికి ప్రధానమైన కాంతి వనరు. కొవ్వొత్తి చరిత్ర అనేది కేవలం ఒక వస్తువు చరిత్ర కాదు;
మంచిమాట

మంచిమాట

సెక్యులర్ విద్య మతోన్మాదం,ఛాందసవాదం అనేవిసాంస్కృతిక సామరస్యాన్ని సాధించే మార్గానికి అతి పెద్ద అవరోధాలు.సెక్యులర్ విద్య తప్ప మరేదీ దీనికి పరిష్కారం కాదు.- నేతాజీ సుభాష్ చంద్ర బోస్