విఠపు బాలసుబ్రహ్మణ్యం కాలం ప్రవాహం లాంటిది. మానవ అవసరాలూ, సంబంధాలు ఆ ప్రవాహంలో నిరంతరం మారుతుంటాయి. వాటికి తగ్గ విలువలూ ఏర్పడి సమాజపు అన్ని పొరల్లోకి విస్తరిస్తూ వుంటాయి. విద్యారంగమేమీ దీనికి మినహాయింపు కాదు. మానవుడికి బతుకుదెరువు నైపుణ్యాలు, పరిసర జ్ఞానము మాత్రమే అవసరమైన కాలంలో ఒక గురువు, నేర్చుకునేందుకు ఒక వ్యవస్థ వుండేవి కావు. నేర్పేది ఇంటి పెద్దలే కాబట్టి, నేర్చుకునేది ఇంటిపట్టున కొంతా, ప్రత్యక్ష పరిసరాల నుంచి