నల్ల పిల్లి చూడతరమా!
- యుగంధర్ బాబు "ఎరుపు అంటే కొందరికి భయం భయం చిన్నపిల్లలు వారికంటే నయం నయం..".. అన్నాడు ఓ కవి. కానీ మన దేశంలో చాలామందికి నలుపు అంటే కూడా భయమే. నలుపుని అశుభానికి సూచకంగా భావిస్తారు. కొందరు నలుపు రంగు దుస్తులు ధరించరు. నలుపు రంగు వస్తువులు వాడరు. అంతటితో ఆగి పోకుండా ఆ రంగుని జంతువులకు కూడా ఆపాదించారు. "పిల్లులలో నల్ల పిల్లి వేరయా" అని... నల్ల
