కాకి రక్షతి రక్షితః
మిఠాయి యుగంధర్ బాబు కాకి ఒకటి నీళ్లకి కావు కావు మనెను.... చిన్నప్పుడు ఈ పద్యాన్ని పాటలాగా ప్రతి పిల్లవాడు, ప్రతి ఒక్కరూ పాడుకొనే ఉంటారు. ఒక కాకికి దాహం వేసి నీటి కోసం చూస్తే దానికి మట్టికుండ కనిపించింది. కానీ కుండలో నీరు అడుగున ఉండటంతో దానికి అందలేదు. అప్పుడు ఉపాయంతో గులకరాళ్లు ఒక్కొక్కటి తీసుకువచ్చి కుండలో వేసింది. నీళ్లు పైకి వచ్చినవి. వెంటనే దాని దాహం తీర్చుకుంది.
