నమ్మకం-నిజం

ప్రమాదంలో (ప్రమాదమైన) గుడ్లగూబ

మిఠాయి యుగంధర్ బాబు గూబ యెక్కినట్టి గురము పాడుగ బెట్టివెళ్లి పోదురంత వెర్రి వారుగూబ యేమి చేసె గురమేమి చేసును?విశ్వదాభిరామ వినురవేమ! ఆరు శతాబ్దాల క్రితమే వేమన గారు పై పద్యములో ప్రజల మూఢనమ్మకాల గురించి గుడ్డి నమ్మకాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. పై పద్యంలో గుబ అంటే గుడ్లగూబ గురము అంటే ఇక్కడ గుర్రము అనుకోవచ్చు (లేక ఓ ఇల్లు అనుకోవచ్చు) ఒక గుడ్లగూబ ఓ ఇంటి
నమ్మకం-నిజం

రైస్ పుల్లింగా? లేక రూకలు పుల్లింగా??

మిఠాయి యుగంధర్ బాబు బెల్లం చీమల్ని ఆకర్షిస్తుంది. అది ప్రకృతి నైజం. అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. అది పదార్థ నైజం. ధనం మనుషుల్ని ఆకర్షిస్తుంది. ఇది ఆధునిక సమాజపు నైజం కదా! మరి దీనికి వ్యతిరేకంగా అంటే రివర్స్ గేర్ లో ఆ ధనాన్ని మనం ఆకర్షించ గలమా? అలా ఆకర్షించడానికి ఏదైనా యంత్రం ఉందా? (ఉంటే, గింటే దేశమంతా జనాలకు తలా ఒక యంత్రం ఇచ్చేస్తే పోలా). "ధనమేరా
నమ్మకం-నిజం

పాములు పగబడతాయా?

మిఠాయి యుగంధర్ బాబు "సార్ ! వాడు పున్నమినాగు సార్. వాడిని ముట్టుకోకండి." "వాడిని పాము చాలా సార్లు కాటేసింది సార్. వాడి వొళ్లంతా విషం". "వాడిని ముట్టుకోకండి". పాఠశాలలో మధ్యాహ్నం పూట వంట చేసే ఆమె తన కొడుకు గురించి అందరూ ఇలా అంటుంటే... పిల్లవాడిని తీసుకొని ఊరు వదిలి పోవడానికి తయారయింది. ఓ పది ఏళ్ల ముందు జరిగిన విషయం ఇది. ఒకే అబ్బాయిని పాము అనేకసార్లు
నమ్మకం-నిజం

అమ్మవారా??… వ్యాధులా????

మిఠాయి యుగంధర్ బాబు ప్రపంచంలో ప్రతి సంస్కృతి, నాగరికత మనిషికి సంక్రమించే వ్యాధులకు ఏదో రకమైన ముఢనమ్మకాలను ఆపాదిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఈ వ్యాధుల గురించి శాస్త్రీయ అవగాహన లేనప్పుడు, వ్యాధులు దేవతల యొక్క కోప, ప్రకోపాలని భావించే వాళ్ళు. ఆ దేవతలను ప్రసన్నం చేసుకుంటే వ్యాధి తగ్గుతుందని భావించి అందుకోసం బలులిచ్చి, పూజలు, జాతరలు చేసేవాళ్లు (ఇప్పటికీ జాతరలు అన్నిచోట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి). తరం నుండి మరోతరానికి
నమ్మకం-నిజం

ఆధునిక యుగంలో అమానుష విశ్వాసం

యుగంధర్ అది ఊరి బయట ఒక ఇంటిలో ఓ గది. గది గోడల నిండా రకరకాల దేవతల భయంకర రూపంలో ఫోటోలు. గది అంతా దీపపు కాంతితో వెలిగిపోతోంది. అక్కడక్కడ సాంబ్రాణి పొగ లుంగ చుట్టుకుని మెల్లగా వెలువడుతోంది. గది మధ్యలో పెద్ద ముగ్గు. ఆ ముగ్గులో అక్కడక్కడ పూలు, పసుపు కుంకుమలు, పెద్ద పెద్ద నిమ్మకాయలతో అలంకరించబడి ఉంది. ముగ్గు మధ్యలో పిండితో చేయబడి, వికృతంగా కాళ్లు, చేతులు
నమ్మకం-నిజం

“దెబ్బకు దెయ్యం దిగుతుందా?!!”

- మిఠాయి యుగంధర్ బాబు అది జార్ఖండ్ లోని పాలెం జిల్లా దగ్గర హైదర్ నగర్. మిట్ట మధ్యాహ్నం మంచి ఎర్రటి ఎండలో ఎర్రటి పిడకల మంట.. ఆ మంటలో ఎవరో కొబ్బరికాయలు, బియ్యం వేశారు. మంట పైకి ఎగసింది. కొంచెం దూరంలో నల్ల మేకకు ఎర్రటి బొట్టు పెడుతున్నారు. కొందరు ఓ మహిళ శరీరాన్ని దారంతో గట్టిగా చుడుతున్నారు. అక్కడ ఓ మాంత్రికుడు మంత్రాలు పటిస్తూ అన్నంలో మాంసం
నమ్మకం-నిజం

“హ్యాపీ టు బ్లీడ్”

          “రాజేశ్వరి అలా తాకడానికి వీలు లేకుండా దూరంగా ఎందుకు ఉండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిది ఏముంది ? ప్రకృతి సిద్ధంగా, స్త్రీకి ఎంతో సహజమైన ఈ 'ఋతు కార్యక్రమం' ఇలా ఎడంగా కూర్చుని ఫలానా అని నలుగురికి చాటి చెప్పడం ఏం బాగుంది ? … ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు ?”           ఈ వాక్యాలు 45 ఏళ్ల ముందు
నమ్మకం-నిజం

ఏది అరిష్టం? ఏది అశుభం?? ఏది అనర్థం???

- యుగంధర్ దేశమంటే మట్టి కాదోయ్దేశమంటే మనుషులోయ్....అన్నారు గురజాడ వారు. కానీ మనుషులందరినీ మనం ఒకటిగా చూస్తున్నామా? అంత పెద్ద మాటలు ఎందుకు గానీ... మహిళలందరినీ ఒకే విధంగా చూస్తున్నామా?... ఒకే విధంగా గౌరవిస్తున్నామా? "విప్రులెల్ల జేరి వెర్రి కూతలు కూసిసతిపతులను గూర్చి సమ్మతమునమును ముహూర్తముంచ ముండెట్లు మోసేరావిశ్వదాభిరామ వినురవేమ." అని వేమన గారు సూటిగా ప్రశ్నించారు..... అసలు "ముండమోయడం" అంటే ఏంటి ? అంటే భర్త చనిపోవడమా?. ఒకవేళ
నమ్మకం-నిజం

దిష్టికి బలమెంత?… కంటికి పవరెంత??

- యం.యుగంధర్ బాబు ఎవరిదో దిష్టి తగలకుండాఓ నల్ల చుక్క బుగ్గననల్లటి తాడు కాలికి...అసలు..దిష్టి పెట్టడం తెలీనిఅసూయ పడడం రానిమనుషుల్ని పెంచితే పోలా... (అంతర్జాలం నుండి) అని ఓ కవిత. ఈ కవితలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం లో దిష్టి తగలడం గురించి. రెండవ భాగములో అసలు "అసూయ పడని" మనుషులే ఉంటే బాగుంటుంది అని. ఇది కవి గారి అత్యాశ కావచ్చు. సరే మనం ఈ
నమ్మకం-నిజం

నల్ల పిల్లి చూడతరమా!

- యుగంధర్ బాబు "ఎరుపు అంటే కొందరికి భయం భయం    చిన్నపిల్లలు వారికంటే నయం నయం.."..  అన్నాడు ఓ కవి. కానీ మన దేశంలో చాలామందికి నలుపు అంటే కూడా భయమే. నలుపుని అశుభానికి సూచకంగా భావిస్తారు. కొందరు నలుపు రంగు దుస్తులు ధరించరు. నలుపు రంగు వస్తువులు వాడరు. అంతటితో ఆగి పోకుండా ఆ రంగుని జంతువులకు కూడా ఆపాదించారు. "పిల్లులలో  నల్ల పిల్లి వేరయా"  అని... నల్ల