బడి బయట పాఠాలు -2 భయం భయంగా.. - సి. వి. కృష్ణయ్య ఆ పిల్లవాడికి ఎనిమిదేళ్లు ఉంటాయి. రెక్కలు దొడిగే వయసు. వాడి ముందు మూడు ప్రపంచాలు నిలిచి ఉన్నాయి. అందులో బడి ఒకటి. అంటే టీచర్లు, అక్షరాలు, అంకెలు, శిక్షలు. రెండోది వింత అనుభూతులు పంచే అద్భుత ప్రపంచం - కొండలు, గుట్టలు, తోటలు, దొడ్లు, పిట్టలు పురుగులు. మూడోది నిజమో అబద్ధమో అర్థం గాని మాయా