సంపాదకీయం అనంత కాలప్రవాహంలోకి మరో సూక్ష్మ శకలం కలిసిపోయింది. మరొకటి కొత్త ఏడాది రూపంలో తలెత్తింది. ఆధునికమానవుడు అవనీతలంపై అవతరించిన నాటి నుండి కాలానికి ఎదురీదాలని ఎన్నెన్ని సాహసాలు చేస్తూ వచ్చాడో చెప్పలేము. ఎక్కడో తూర్పు ఆఫ్రికా నుంచి తెరలు తెరలుగా, గుంపులు గుంపులుగా మహానదీనదాలు. సాగరాలు దాటుకుంటూ భూమండలం అంతా విస్తరించిన అతని తెగువనూ, పట్టుదలనూ తలచుకుంటే మనల్ని సంభ్రమాశ్చర్యాలే కాదు, ఉత్తేజోద్వేగాలూ చుట్టుముడతాయి. ఆధునిక మానవుడి ఊహకైనా