ప్రొఫెసర్ వి. శ్రీనివాసచక్రవర్తి

రీల్స్‌, డోపమైన్‌, మన మెదడు చేసే చిన్న లెక్కలు

“ఒక్క రీల్ మాత్రమే చూస్తాను!”

ఫోన్ తీసుకున్నప్పుడు మనలో చాలామంది ఇలా అనుకునే ఉంటాం. ఒక రీల్ అయిపోతుంది. వేళ్లు వాటంతట అవే పైకి జరుపుతాయి. ఇంకో వీడియో వస్తుంది. అది అంతగా నచ్చకపోతే వెంటనే మరో swipe. ఈసారి మాత్రం అదిరిపోయే వీడియో! దాని తర్వాత ఇంకోటి. “ఇదే చివరిది” అనుకునేలోపే అరగంట గడిచిపోయి ఉంటుంది.

అసలు ఈ చిన్న చిన్న వీడియోలకు అంత శక్తి ఎక్కడిది? మనలో సంకల్పబలం లేదా? లేక మన మెదడులోనే వాటికి అనుకూలంగా పనిచేసే ఏదైనా వ్యవస్థ ఉందా?

ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మన మెదడులోని ఒక ప్రముఖ రసాయన దూతను కలవాలి.

దాని పేరు డోపమైన్.

ఆనందం వచ్చినప్పుడు మెదడులో ఏమవుతుంది?
డోపమైన్‌ను చాలాసార్లు మెదడులోని “pleasure chemical” — ఆనంద రసాయనం అని పిలుస్తారు. మనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు, క్రికెట్ మ్యాచ్‌లో మన జట్టు గెలిచినప్పుడు, పరీక్షలో మంచి మార్కులు వచ్చినప్పుడు, ఎవరైనా మనల్ని మెచ్చుకున్నప్పుడు మెదడులోని dopamine వ్యవస్థ చురుకవుతుంది.

అయితే డోపమైన్ పని కేవలం “బాగుంది!” అని చెప్పడమే కాదు. అది మన మెదడుకు మరో ముఖ్యమైన సందేశం ఇస్తుంది:

ఇది ముఖ్యమైనది. దీన్ని గుర్తుపెట్టుకో. మళ్లీ దీనిని పొందడానికి ప్రయత్నించు.”

అందుకే dopamine ఆనందంతో పాటునేర్చుకోవడం, ప్రేరణ, ఏది విలువైనదో అంచనా వేయడంవంటి పనుల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇక్కడి నుంచే Reels కథ మొదలవుతుంది.

బహుమతి ద్వారా నేర్చుకునే మెదడు

ఒక చిన్న ఆట ఊహించండి. మీ ముందు రెండు బటన్లు ఉన్నాయి. ఎరుపు బటన్ నొక్కితే ఏమీ జరగదు. ఆకుపచ్చ బటన్ నొక్కితే మీకు పది పాయింట్లు వస్తాయి.

మొదట మీకు ఏది మంచిదో తెలియదు. ఒకటి నొక్కుతారు. తర్వాత ఇంకొకటి నొక్కుతారు. కొన్ని ప్రయత్నాల తర్వాత ఆకుపచ్చ బటన్ మంచిదని నేర్చుకుంటారు. ఇక దానినే ఎక్కువగా నొక్కుతారు.

ఇలాంటి నేర్చుకోవడాన్ని శాస్త్రవేత్తలు Reinforcement Learning, అంటేబహుమతి ద్వారా నేర్చుకోవడం, అంటారు.

ఇది కంప్యూటర్ గేమ్‌లలో మాత్రమే కాదు. మన జీవితం అంతటా జరుగుతుంది. ఒక పని చేస్తాం. మంచి ఫలితం వస్తే దాన్ని మళ్లీ చేయాలని మెదడు నేర్చుకుంటుంది. చెడు ఫలితం వస్తే దాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తుంది.

కానీ మెదడు ప్రతి అనుభవాన్ని ఒక విడివిడిగా ఉన్న జ్ఞాపకంలా మాత్రమే దాచదు. అది ఒక ప్రశ్న కూడా అడుగుతుంది:

ఈ విషయం నాకు ఎంత విలువైనది?”

ఈ అంచనాను neuroscienceలో Value అంటారు.

ఇక్కడ Value అంటే మార్కెట్ ధర కాదు. “ఇది చేస్తే నాకు ఎంత మంచి ఫలితం రావచ్చు?” అనే మెదడు లెక్క.

ఐస్‌క్రీమ్‌కు ఒక Value ఉంటుంది. స్నేహితుడి phone callకు ఒక Value ఉంటుంది. గేమ్‌లో level complete చేయడానికి ఒక Value ఉంటుంది. అలాగే ఫోన్‌లో notification కనిపించినప్పుడు దానికీ ఒక Value ఉంటుంది.

మెదడు చేసే ఒక ఆసక్తికరమైన పొరపాటు

ఇప్పుడు ఒక పని చేస్తే మీకు ప్రతిసారీ 10 పాయింట్లు వస్తున్నాయని అనుకుందాం. మీ మెదడు దానికి అలవాటు పడుతుంది. “ఇది చేస్తే 10 వస్తాయి” అని ముందే ఊహిస్తుంది.

ఒక రోజు అకస్మాత్తుగా 100 పాయింట్లు వచ్చాయి!

అప్పుడు మెదడు అంటుంది:

“అరే! నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చింది!”

ఇలాంటి తేడాను శాస్త్రవేత్తలు Reward Prediction Error అంటారు.

సరళంగా చెప్పాలంటే:

నిజంగా వచ్చిన బహుమతి – ముందుగా ఊహించిన బహుమతి.

ఊహించిన దానికంటే మంచి ఫలితం వస్తే dopamine neurons బలంగా స్పందిస్తాయి. “ఈ పని నేను అనుకున్నదానికంటే మంచి పని” అని మెదడు తన Value అంచనాను మార్చుకుంటుంది.

ఇలా మన మెదడు ప్రతి రోజు లక్షల చిన్న చిన్న లెక్కలు చేస్తూ ఉంటుంది.

Reward System అంటే ఏమిటి?

మన మెదడులో “ఆనందం” కోసం ఒక్క బటన్ ఉండదు. అనేక ప్రాంతాలు కలిసి పనిచేసే ఒక reward system ఉంటుంది.

దానిలో ముఖ్యమైన ప్రాంతం Ventral Tegmental Area, సంక్షిప్తంగా VTA. ఇది మెదడులో లోతుగా ఉండే చిన్న ప్రాంతం. ఇక్కడ dopamine తయారు చేసే చాలా neurons ఉంటాయి.

VTA నుంచి dopamine సంకేతాలు Nucleus Accumbens, లేదా విస్తృతంగా చెప్పాలంటే Ventral Striatum, అనే ప్రాంతాలకు వెళ్తాయి. ఏదైనా పొందాలనే కోరిక, దాని కోసం ప్రయత్నించడం, rewardను ఆశించడం వంటి విషయాల్లో ఈ వ్యవస్థ ముఖ్యమైనది.

ఇంకో ముఖ్యమైన ప్రాంతం Orbitofrontal Cortex — OFC. ఇది నుదుటి వెనుక భాగంలో ఉంటుంది. “ఈ అనుభవం ఎంత విలువైనది?”, “ఇది మంచిదా, ఇంకేదైనా మంచిదా?” వంటి పోలికలలో OFC పాత్ర వహిస్తుంది.

అలాగేPrefrontal Cortexమన నిర్ణయాలు, లక్ష్యాలు, self-controlలో సహాయపడుతుంది. Amygdala భావోద్వేగాలను, Hippocampus జ్ఞాపకాలను rewardతో కలుపుతుంది.

అందుకే “ఇంకో రీల్ చూడాలా? లేక ఫోన్ మూసి homework చేయాలా?” అనేది బయటికి చిన్న నిర్ణయంలా కనిపించినా, లోపల అనేక brain systems మధ్య జరిగే పోటీ.

ఇప్పుడు రీల్స్ దగ్గరకు వద్దాం

ఒక Reel చూసిన తర్వాత వచ్చే video ఎలా ఉంటుందో మీకు తెలియదు.

బోరింగ్‌గా ఉండొచ్చు.

చాలా funnyగా ఉండొచ్చు.

మీకు ఇష్టమైన పాట వచ్చి ఉండొచ్చు.

మీ favourite cricketer six కొట్టిన clip కావొచ్చు.

ఒక cute puppy video కావొచ్చు.

లేదా మీరు ఎప్పుడూ చూడని అద్భుతమైన science fact కావొచ్చు.

అంటే ప్రతి swipeలో ఒక చిన్న suspense ఉంది:

తర్వాత ఏమొస్తుంది?”

ఇది reward-learning brainకు చాలా ఆసక్తికరమైన పరిస్థితి. reward ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలియదు. కానీ ఎప్పుడో ఒకసారి చాలా మంచి video వస్తుంది. అందుకే మన మెదడు మరోసారి swipe చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

ఇంతటితో కథ ముగియదు.

Instagram, TikTok, YouTube Shorts వంటి platforms మీరు ఏ video దగ్గర ఎంతసేపు ఆగారు, ఏది వెంటనే swipe చేశారు, దేనిని like చేశారు, ఏదిని మళ్లీ చూశారు—ఇలాంటి సమాచారాన్ని గమనిస్తాయి. దాని ఆధారంగా తర్వాత మీకు నచ్చే అవకాశం ఉన్న videosను ఎంపిక చేస్తాయి.

అంటే ఒక విచిత్రమైన ఆట జరుగుతోంది.

మీరు algorithmకు మీ ఇష్టాలు నేర్పుతున్నారు.
Algorithm
మీకు ఏ rewards నచ్చుతాయో నేర్చుకుంటోంది.

TikTok చూస్తున్నప్పుడు VTA ఏమి చేస్తుంది?

2021లోNeuroImage journalలో వచ్చిన ఒక ఆసక్తికరమైన అధ్యయనంలో పరిశోధకులు TikTok videos చూస్తున్నప్పుడు మనుషుల brain activityని fMRI తో పరిశీలించారు.

వారికి సాధారణ videos ఒకసారి, TikTok algorithm ప్రత్యేకంగా ఆ వ్యక్తి కోసం recommend చేసిన personalized videos మరోసారి చూపించారు.

Personalized videos చూసినప్పుడు కొన్ని brain regions మరింత చురుకయ్యాయి. వాటిలో ఒకటి మనకు ఇప్పుడు పరిచయమైన VTA.

అదే dopamine reward systemలోని ముఖ్యమైన ప్రాంతం.

అంటే recommendation algorithm కేవలం “మీకు నచ్చే videos”ను మాత్రమే ఎంపిక చేయడం కాదు. అవి మన reward systemను బలంగా ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది.

Short-video addiction ఉన్నవారి మెదడు ఎలా కనిపిస్తుంది?

2025లోNeuroImageలో వచ్చిన మరో అధ్యయనం short-video addiction symptoms ఎక్కువగా ఉన్నవారి brain scansను పరిశీలించింది.

వారిలో Orbitofrontal Cortex నిర్మాణంలోని కొన్ని తేడాలు addiction symptoms తీవ్రతతో సంబంధం చూపించాయి. OFC గురించి మనం ముందే చూశాం: rewardకు Value కేటాయించడంలో ఇది భాగస్వామ్యం చేస్తుంది.

అలాగే dorsolateral prefrontal cortex, posterior cingulate cortex, temporal ప్రాంతాలు, cerebellum వంటి brain regionsలో activity కూడా addiction symptomsతో సంబంధం చూపించింది.

ఇది చాలా ఆసక్తికరమైన finding. కానీ ఇక్కడ scienceలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం.

ఈ అధ్యయనం వల్ల:

“Reels చూడటం వల్ల మీ brain తప్పకుండా ఇలా మారిపోతుంది” అని చెప్పలేం.

రెండింటి మధ్య సంబంధం కనిపించింది అంతే.

కొన్ని brain characteristics ముందే ఉండి, వాటివల్ల కొందరు short videosకు ఎక్కువగా ఆకర్షితులై ఉండవచ్చు. లేదా ఎక్కువ usage వల్ల brainలో మార్పులు రావచ్చు. లేదా రెండూ ఒకదానిని ఒకటి ప్రభావితం చేస్తూ ఉండవచ్చు.

Scienceలోcorrelationకనిపిస్తే వెంటనేcausationఅని చెప్పకూడదు.

ఏదైనా మిస్ అవుతున్నానేమో!”

2025లో వచ్చిన మరో longitudinal studyలో 280 మందిని కొంతకాలం పాటు పరిశీలించారు.

అందులో ఒక ఆసక్తికరమైన psychological factor బయటపడింది:

FoMO — Fear of Missing Out.

“నా friends ఏదో చూస్తున్నారు.”

“ఏదో trend జరుగుతోంది.”

“నేను phone చూడకపోతే ఏదైనా miss అవుతానేమో!”

ఇలాంటి భావన ఎక్కువగా ఉన్నవారిలో తర్వాత short-video addiction symptoms ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని researchers గుర్తించారు.

Negative emotions కూడా ఇందులో పాత్ర పోషించాయి.

అంటే Reels సమస్య కేవలం dopamine కథ కాదు. ఇందులోreward, attention, emotion, habit, curiosity, social informationఅన్నీ కలుస్తాయి.

మరి apps మన మెదడును “hack” చేస్తున్నాయా?

“Reels dopamineను hijack చేస్తాయి” అని social mediaలో తరచుగా వింటాం.

అది కొంచెం అతిశయోక్తి.

Dopamine మన శత్రువు కాదు. Dopamine లేకపోతే మనం కొత్త విషయాలు నేర్చుకోవడం, లక్ష్యాల కోసం ప్రయత్నించడం, ఆహారం కోసం వెతకడం, కొత్త అవకాశాలను అన్వేషించడం కూడా కష్టమవుతుంది.

మన reward system జీవించడానికి అవసరమైన అద్భుతమైన వ్యవస్థ.

కానీ short-video platforms ఒకేసారి కొన్ని శక్తివంతమైన అంశాలను కలిపాయి:

కొత్తదనం.
ఆశ్చర్యం.
Reward.
Social information.
తర్వాత ఏమొస్తుందో తెలియని uncertainty.
మన ఇష్టాలను నేర్చుకునే personalized algorithm.

అందుకే “ఇంకొక్కటి…” అనే చిన్న కోరిక మళ్లీ మళ్లీ పుడుతుంది.

Reels చూడటం తప్పా?

కాదు.

Short videosలో మంచి science ఉంటుంది. మంచి music ఉంటుంది. art ఉంటుంది. humour ఉంటుంది. కొత్త skills నేర్చుకోవచ్చు. ప్రపంచం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

అసలు ప్రశ్న “Reels మంచివా? చెడ్డవా?” కాదు.

ప్రశ్న:

వాటిని ఎవరు నియంత్రిస్తున్నారు?

మీరు ఫోన్‌ను ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తున్నారా?

లేక notification కనిపించగానే మీ చెయ్యి phone వైపు వెళ్తుందా?

ఐదు నిమిషాలు చూడాలని అనుకుని యాభై నిమిషాలు చూస్తున్నారా?

అక్కడే reward-learning కథ మన జీవితంలోకి వస్తుంది.

మన మెదడు పదే పదే reward పొందే పనులకు Value పెంచుతుంది. కాబట్టి ఒక habitను ఎంత ఎక్కువ practice చేస్తే, దాని దారి మెదడులో అంత సులభంగా మారుతుంది.

అందుకే కొన్నిసార్లు phoneను తెరవకుండా ఉండటం కూడా ఒక చిన్న brain-training exercise.

తర్వాత మీరు ఒక Reel swipe చేసినప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి:

“నేను ఈ videoను చూస్తున్నానా?

లేక నా brain ‘తర్వాత ఏమొస్తుందో చూద్దాం’ అని నన్ను మరో swipe చేయిస్తున్నదా?”

ఎందుకంటే ప్రతి swipeతో రెండు systems నేర్చుకుంటున్నాయి.

ఒకటి మీ మెదడు.
మరొకటి మీ phoneలోని algorithm.

ఇవిరెండింటిలో చివరకు ఎవరు ఎవరిని ఎక్కువగా అర్థం చేసుకుంటారో — అదే అసలు కథ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *