తెలుసుకొందాం

ఒక్క రీల్ మాత్రమే… అన్నాక గంట ఎలా గడిచిపోతుంది?

ప్రొఫెసర్ వి. శ్రీనివాసచక్రవర్తి రీల్స్‌, డోపమైన్‌, మన మెదడు చేసే చిన్న లెక్కలు “ఒక్క రీల్ మాత్రమే చూస్తాను!” ఫోన్ తీసుకున్నప్పుడు మనలో చాలామంది ఇలా అనుకునే ఉంటాం. ఒక రీల్ అయిపోతుంది. వేళ్లు వాటంతట అవే పైకి జరుపుతాయి. ఇంకో వీడియో వస్తుంది. అది అంతగా నచ్చకపోతే వెంటనే మరో swipe. ఈసారి మాత్రం అదిరిపోయే వీడియో! దాని తర్వాత ఇంకోటి. “ఇదే చివరిది” అనుకునేలోపే అరగంట గడిచిపోయి