ప్రాచీనం- ఆధునికం!ప్రాచీనమైనంత మాత్రాన ప్రతిదీ మంచిది గాదు.ఆధునికమైందని త్యజించాల్సిన అవసరమూ లేదు.సజ్జనులు పరీక్షించి మంచి దాన్ని ఎంచుకొంటారు.మూర్ఖులు ఇతరులు చెప్పిందాన్ని గుడ్డిగా నమ్ముతారు. -మహాకవి కాళిదాసు
యుద్ధమూ శాంతీ! మన పాఠ్యగ్రంథాలు యుద్ధాల్ని కీర్తిస్తాయి. వాటి దుర్మార్గాల్ని దాచిపెడతాయి. అవి మన పిల్లల హృదయాల్ని విద్వేషమయం చేస్తాయి. నేనైతే యుద్ధాన్ని కాదు శాంతిని బోధిస్తాను. ద్వేషాన్ని కాదు ప్రేమను వారిలో నింపుతాను. - ఆల్బర్ట్ ఐన్ స్టీన్
మన విద్యా శిక్షణాసంస్థలు! మన విద్యా శిక్షణాసంస్థలు!స్వతంత్రంగా వ్యవహరించే వారినీ,స్వేచ్ఛగా ఆలోచించే వారినీ,విధేయతను పాటించని వారినీజల్లెడ పట్టి దూరంగా నెట్టడమేమొత్తం మన విద్యా శిక్షణాసంస్థలు చేస్తున్న పని.ఎందుకంటే వీరున్నంతకాలం ఇవి పనిచెయ్యలేవు మరి! -నోమ్ చోమ్స్కీ
👏