డార్విన్ కి ముందున్న జీవశాస్త్రం
డా. విరించి డార్విన్ను సరిగా అర్థం చేసుకోవడం నిజానికి చాలా అవసరం. నేటికీ అతడిని సరైన రీతిలో అర్థం చేసుకుంటున్నామా అన్నది ప్రశ్న. డార్విన్ నుంచి సరిగ్గా అర్థం చేసుకోకపోతే అతడు వాడుకోబడతాడు; అతడి సిద్ధాంతమూ వాడుకోబడుతుంది—చరిత్ర ఇది ఎన్నోసార్లు నిరూపించింది కూడా. డార్విన్ను “జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త”గా మాత్రమే నిర్వచించిన క్షణంలోనే, అతడి మేధో ప్రాముఖ్యతను మనం సంకుచితం చేస్తున్నట్టు. డార్విన్ను అర్థం చేసుకోవడం అంటే
