చరిత్ర ఏమంటుంది

మధ్యయుగాల్లో సైన్సు– కొందరు ఇస్లాం విజ్ఞానులు

డా. యం. గేయానంద్ క్లాసిక్ గ్రీకు, రోం సామ్రాజ్యాల ప్రభావం నశించి, చిన్నచిన్న ముక్కలుగా, ఆటవిక రాజ్యాలుగా యూరోప్ మారిపోయింది. క్రైస్తవం క్రమేణా ఈ ఖాళీలో ఎదిగి నిలదొక్కుకొంటున్నది. ప్రజల్లో క్రైస్తవానికి ఉండే ఆదరణ చూసిన పాలకులూ, క్రైస్తవంలోకి మారడం ప్రారంభించారు. అది క్రీ.శ.5-6 శతాబ్ధాల మాట.                ఈ సమయంలో మధ్య ప్రాచ్యంలోని ఎడారులలో ఉండే ఎన్నో తెగల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. బహుదేవతారాధనతో గొడవలు