ఆదిత్య‑L1 సూర్యుడి రహస్యాల ఛేదనకు భారత అన్వేషణ
రవిరాజా పోతినేని సూర్యుడు ఉదయిస్తేనే మన రోజు మొదలవుతుంది. వెలుగు, వేడి, వర్షాలు, పంటలు ఇలా మన జీవన విధానంలోని ప్రతి అంశం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుడిపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ సూర్యుడిలో జరిగే అనేక కీలక ప్రక్రియలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ రహస్యాలను ఛేదించేందుకు భారతదేశం చేపట్టిన చారిత్రక అంతరిక్ష మిషన్నే ఆదిత్య‑L1. సూర్యుడి నుంచి కేవలం కాంతి మాత్రమే కాకుండా, నిరంతరం
