సంపాదకీయం

చరిత్రపాఠాలు చేదుగా వుంటాయి!

సంపాదకీయం "ప్రపంచ నాగరికతల ఘర్షణా ప్రవక్త" శామ్యూల్ హటింగ్టన్ సమాధి నుంచి లేచొచ్చి అమాంతం అమెరికా ప్రభుత్వాన్ని ఆవహించినట్టుంది! పాశ్చాత్యదేశాల నాగరికతకు ఎప్పుడూ లేని ముప్పు ముంచుకొచ్చిందనీ, వలసల్ని అడ్డుకోకుంటే వాటి ప్రాభవం, భవిష్యత్తూ మంటగలిసి పోతాయనీ అది గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. దీనికోసం ఒక "నూతన వ్యూహాత్మక నివేదికను" రూపొందించి, దాన్ని ప్రపంచ దార్శనికతా పత్రంగా వర్ణిస్తూ ముందుకు తెచ్చింది. ఒకవైపు అమెరికా మానవ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన
ప్రకృతి-పర్యావరణం

ప్రకృతి నియమాలను మనం అధిగమించగలమా?

డాక్టర్ కె. బాబురావు “ప్రకృతిలో దయ లేదు, జాలి లేదు. అక్కడ నియమం మాత్రమే ఉంది” అని అమెరికా మూలవాసుల నాయకుడు ఒరెన్ లయోన్స్ చెప్పిన మాట ఈ రోజుల్లో మరింత సత్యంగా అనిపిస్తోంది. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత సాంకేతిక విజ్ఞానం పెరిగినా, ప్రకృతి నియమాల ముందు అందరూ సమానమే. ఈ నియమాలకు ఎలాంటి మినహాయింపులూ లేవు. మన అవసరాలు, కోరికలు, ఆశలు ప్రకృతికి అర్థం కావు.
తెలుసుకొందాం

ప్రకృతి సూత్రాలు-17,18వ సార్వత్రిక నియమాలు

ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య 17. సార్వత్రిక నియమముజీవం కేవలం కణాల్లో మాత్రమే ఉండగలదు (Life Exists only Inside a Cell). భూమ్మీద మాత్రమే జీవం ఉన్న ఆధారాలున్నాయి. భూమి లాంటి పరిస్థితులు విశ్వంలో కొన్ని గ్రహాల్లో ఉన్నట్లు అంచనా వేశారు. అయినా భూమికి తోడుగా మరెక్కడయినా జీవులు ఉన్న దాఖలాలు ఇంత వరకు ఋజువు కాలేదు. భూమ్మీద జీవులు ఏర్పడే పరిస్థితులు నేటికి సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రిందట
శాస్త్రజ్ఞులు

కరువు సీమ నుంచి వచ్చిన అంతర్జాతీయ శాస్త్రవేత్త డా. ఎమ్. శాంతప్ప

డా. నాగసూరి వేణుగోపాల్ ఉమ్మడి అనంతపురంజిల్లాలో గిన్నిస్ పుస్తకంలో ఎక్కిన మర్రిచెట్టు వుంది. ఈ తిమ్మమ్మ మర్రిమాను విస్తీర్ణంలో ప్రపంచంలోకెల్లా పెద్దది. దాని కాండం ఏదో, ఊడలు, ఏవో గుర్తుపట్టలేం. ఇటువంటి మర్రి చెట్టును పరిశీలించి, దీనికి మూలం అయిన మర్రి విత్తనం ఎంత చిన్నగా వుంటుందో గుర్తు తెచ్చుకోండి. విస్మయం చెందడం అనివార్యం. సరిగ్గా ఇటువంటి భావనే కలిగింది డా॥ ఎమ్. శాంతప్ప నేపథ్యం పరికించినపుడు! కరువు జిల్లా
శాస్త్ర వికాసం

ఆదిత్య‑L1  సూర్యుడి రహస్యాల ఛేదనకు భారత అన్వేషణ

రవిరాజా పోతినేని సూర్యుడు ఉదయిస్తేనే మన రోజు మొదలవుతుంది. వెలుగు, వేడి, వర్షాలు, పంటలు ఇలా మన జీవన విధానంలోని ప్రతి అంశం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుడిపైనే ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ సూర్యుడిలో జరిగే అనేక కీలక ప్రక్రియలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ రహస్యాలను ఛేదించేందుకు భారతదేశం చేపట్టిన చారిత్రక అంతరిక్ష మిషన్‌నే ఆదిత్య‑L1. సూర్యుడి నుంచి కేవలం కాంతి మాత్రమే కాకుండా, నిరంతరం
చరిత్ర ఏమంటుంది

మధ్యయుగాలలో సైన్స్- యూరప్ లో చీకట్లూ వెలుతురూ

డా. యం. గేయానంద్ చరిత్రలో, కొన్ని కొన్ని సామాజిక శక్తులు సైన్స్ కు అండగా నిలిచాయి. అవి చరిత్రను ముందుకు తీసుకుపోయిన శక్తులు కూడా. వాటి అండతో, సైన్సులో జరిగే ఆవిష్కరణలు, కొత్త సామాజిక మార్పులకు దారి తీస్తాయి. ఒక్కోసారి సైన్సు మౌలిక భావాలలో కూడా మార్పు తెస్తుంది. అప్పుడు సమాజం విప్లవాత్మక మార్పులకు సిద్ధపడుతుంది. కానీ సమాజ గమనం మందగించినప్పుడు, వైజ్ఞానిక పురోగమనము కూడా, అంతంత మాత్రంగానే ఉంటుంది.
నమ్మకం-నిజం

అరచేతిలోని రేఖలు మన భవిష్యత్తును చెబుతాయా ?

మిఠాయి యుగంధర్ బాబు అది 1988... అప్పటికి ఎల్ఐసి లో చేరి సంవత్సరం దాటింది. నేను ఉద్యోగరీత్యా రాయచోటిలో ఉండేవాడిని. మా అన్న కూడా చెన్నైలో ఉండేవాడు. ఓ నెల విరామం తర్వాత ఇద్దరం ఇంటికి చేరాము. తీరా చూస్తే మా ఇంటి ఎదురుగా ఫలానా జ్యోతిష్యాలయం వెలిసి ఉంది. మా ఊరి దగ్గర నల్లగుట్లపల్లె అనే విలేజ్ ఉంది. ఆ పల్లె నుంచి జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ,
శాస్త్ర వికాసం

ఉరికంబం నీడలో రాకెట్ డిజైన్

అది 1881 ఏప్రిల్ 7వ తేదీ. రెండవ అలెగ్జాండర్ జార్ను పై బాంబు విసిరి చంపినందుకు టెర్రరిస్టులపై విచారణ జరుగుతోంది. బాంబు విసిరిన వాడు రిస్సాకఫ్. బాంబునెలా ప్రయోగించాలో నేర్పిన వాడు కిబాల్చిచ్. క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. నేరం నిర్ధారణ కాక తప్పదని తెలిసిపోతూనే ఉంది. ఏం జరుగుతున్నా తనకేమీ సంబంధం లేనట్టే ఉంది కిబాల్చిచ్ ముఖం. ఏదో తప్పనిసరి బేరంగా కోర్టులో ఏదో తమాషా చూడ్డానికి వచ్చినట్టే ఉంది
మంచిమాట

మంచి మాట

హేతుబుద్ధి అది ఏ గ్రంథంలోనైనా వుండొచ్చు.దాన్నెవరైనా చెప్పొచ్చు.చివరకు నేను కూడా చెప్పివుండొచ్చు.నీ సొంత హేతువుకూ, నీ ఇంగితజ్ఞానానికీ అది నిలబడకపోతే దాన్ని నమ్మొద్దు!-గౌతమ బుద్ధుడు