సంపాదకీయం

పురాణగాధా శోధనలో తరిస్తున్న పురాతత్వ శాఖ

సంపాదకీయం రంగస్థలం పైకి మహాభారత సీరియల్ యోధుడి గెటప్ తో నటుడు మనోజ్ బాజ్ పాయి స్వగతంలో భారత యుద్ధవీరుల్ని మననం చేసుకుంటూ ప్రత్యక్షమవుతాడు. కృష్ణుడి, కర్ణుడి రథాల్ని కీర్తిస్తూ నేపథ్యగానం వీనులవిందు చేస్తుంది. ఇంతలో గ్రాఫిక్స్ మాయాజాలం మధ్య రెండు చక్రాల గుర్రాల రథం సాక్షాత్కరిస్తుంది. అది కొయ్యదే గానీ చక్రాలతో సహా మొత్తం రాగి రేకుల తాపడంతో ధగధగలాడుతుంటుంది. ఓ నిమిషం తర్వాత రంగురంగుల ఫ్లడ్ లైట్ల
శాస్త్ర వికాసం

భారతీయ అంతరిక్ష స్వప్నాలకు తొలి మెట్టు ఆర్యభట!

రవి రాజా పోతినేని అది 1975 ఏప్రిల్ 19 తెల్లవారుజాము. కాస్పియన్ సముద్రానికి ఉత్తరాన ఉన్న సోవియట్ అంతరిక్ష కేంద్రపు కపుస్టిన్ యార్ ప్రయోగస్థల వాతావరణమంతా ఉత్కంఠతో నిండిపోయివుంది. భారత ఇంజనీర్లు సోవియట్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు. చుట్టూ ఉద్వేగభరిత నిరీక్షణ ఆవరించి వుంది. పురాతన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట పేరు మీద భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని కాస్మోస్ 3-ఎం ప్రయోగ వాహనం సాయంతో అంతరిక్షంలోకి
పిల్లలు-చదువులు

డిజిటల్ మాయాజాలంలో ఆబాలగోపాలం!

సోఫీ వింకిల్మాన్ నేను నాలుగు వారాల క్రితం లండన్ లో ఒక బస్సులో నిలబడి ప్రయాణిస్తున్నాను. నా పక్కనే ఓ యువతీ, యువకుడూ కూర్చుని వున్నారు. ఇద్దరూ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఇద్దరి చేతుల్లో రెండు స్మార్ట్ ఫోన్లున్నాయి. ఆసక్తిగా వారిద్దరి ఫోన్లలోకి కొంచెం తొంగి చూస్తే ఇద్దరూ డేటింగ్ యాప్ లు చూస్తున్నారు. తమ లాంటి యువతీ యువకుల స్నేహం కోసం వెతుకుతున్నారు. కొంచెం సేపటికి బస్సు ఆగింది.
తెలుసుకొందాం

పరమాణువులు ఎలక్ట్రాను మేఘాలతోనే సంధానించుకొని అణువుల్నీ సంయోగ పదార్ధాల్నీ ఏర్పరుస్తాయి.

ప్రొఫెసర్ A. రామచంద్రయ్య పదమూడవ సార్వత్రిక నియమంపరమాణువులు ఎలక్ట్రాను మేఘాలతోనే సంధానించుకొని అణువుల్నీ సంయోగ పదార్ధాల్నీ ఏర్పరుస్తాయి.(Atoms are Bound Together by electron clouds to form molecules and compounds) మనం రెండు కాగితాల్ని అంటించడానికి బంక (గమ్ము, జిగురు) వాడతాము. ఆ రెండు కాగితాల మధ్య జిగురు సంధానకర్తగా వ్యవహరిస్తుంది. గోడకట్టేటప్పుడు ఇటుకల మధ్య సిమెంటు పెడతారు. సిమెంటు సంధానకర్తగా వ్యవహరించడం వల్లే ఆ రెండు
ప్రకృతి-పర్యావరణం

ఆహార భద్రతా చట్టాన్ని సాధ్యపరచింది వ్యవసాయ సాంకేతికాలేనంటున్న స్వామినాధన్

ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు ఇంటర్వ్యూ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిర్వహణాధికారి, రాజ్యసభ సభ్యుడు, జాతీయ రైతు కమిషన్ ఛైర్మన్ వంటి అనేక బాధ్యతల్ని నిర్వహించిన ప్రొ. ఎం.ఎస్. స్వామినాధన్ ఆయన తొంబయ్యవ జన్మదిన సందర్భంగా “జనవిజ్ఞానం”తో తన అభిప్రాయాల్ని పంచుకొన్నారు. జనవిజ్ఞానం ప్రతినిధిగా ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ప్ర. హరిత విప్లవ మూలకారకుల్లో ఒకరిగా గత
శాస్త్రజ్ఞులు

ఆధునిక భారతదేశపు తొలి మహిళాభౌతిక శాస్త్రవేత్త – బిభా చౌదురి

డా నాగసూరి వేణుగోపాల్ వైజ్ఞానిక వెలుగు దివ్వెలు-3 అణుకేంద్రకంలో ఉండే 'మెసాన్' (Meson) ద్రవ్యరాశిని తొలిసారి లెక్కించిన శాస్త్రవేత్త బిభా చౌదురి (Bibha Chowdhuri)! అంతేకాదు మనదేశంలో 'హై ఎనర్జీ ఫిజిక్స్' (High Energy Physics) విభాగపు తొలి మహిళా శాస్త్రవేత్త, ఇంకా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ తొలి మహిళా శాస్త్రవేత్త కూడా ఆమే.  మహా శాస్త్రవేత్తల సహచర్యం బిభా చౌదురి (1913-1991) గురించిన వివరాలకు
చరిత్ర ఏమంటుంది

యూరోప్ లో వీచిన, తొలి విజ్ఞానాల గాలులు…

డా యం. గేయానంద్ భారతదేశంలో, 2500 సంవత్సరాల నాడు, జరిగిన వైజ్ఞానిక వికాసం ఇంతకుముందు చూసాము. అటువంటిదే, యూరోప్ లో కూడా జరిగింది. దాన్ని కొంచెం తెలుసుకుందాము.విజ్ఞానం ఏ ఒక్క ప్రాంతపు గుత్త సొత్తు కాదు. కొన్ని కొన్ని భౌతిక పరిస్థితులలో, కొన్ని కొన్ని భావాలు, విజ్ఞానాలు పుడతాయి.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక నాగరికత నుంచి ఇంకో నాగరికతకు విజ్ఞానం వ్యాపించే క్రమంలో, జరిగే రాపిడిలో,
నమ్మకం-నిజం

ప్రమాదంలో (ప్రమాదమైన) గుడ్లగూబ

మిఠాయి యుగంధర్ బాబు గూబ యెక్కినట్టి గురము పాడుగ బెట్టివెళ్లి పోదురంత వెర్రి వారుగూబ యేమి చేసె గురమేమి చేసును?విశ్వదాభిరామ వినురవేమ! ఆరు శతాబ్దాల క్రితమే వేమన గారు పై పద్యములో ప్రజల మూఢనమ్మకాల గురించి గుడ్డి నమ్మకాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. పై పద్యంలో గుబ అంటే గుడ్లగూబ గురము అంటే ఇక్కడ గుర్రము అనుకోవచ్చు (లేక ఓ ఇల్లు అనుకోవచ్చు) ఒక గుడ్లగూబ ఓ ఇంటి
మంచిమాట

మంచిమాట

సత్యంసత్యం అధిక సంఖ్యాకుల గుత్తాధిపత్యం కానక్కర్లేదు!అల్ప సంఖ్యాకులు కూడా ప్రపంచంలో ఎన్నో సత్యాల్ని వెలికితీసారు!!అందరూ అంగీకరించిన తర్వాతే సత్యం నిర్ధారణ కావడమనేది ఎప్పుడూ జరుగదు!!!- ఆచార్య సచ్చిదానంద మూర్తి