సంపాదకీయం

కాలమనంతం, భూమి విశాలం

సంపాదకీయం అనంత కాలప్రవాహంలోకి మరో సూక్ష్మ శకలం కలిసిపోయింది. మరొకటి కొత్త ఏడాది రూపంలో తలెత్తింది. ఆధునికమానవుడు అవనీతలంపై అవతరించిన నాటి నుండి కాలానికి ఎదురీదాలని ఎన్నెన్ని సాహసాలు చేస్తూ వచ్చాడో చెప్పలేము. ఎక్కడో తూర్పు ఆఫ్రికా నుంచి తెరలు తెరలుగా, గుంపులు గుంపులుగా మహానదీనదాలు. సాగరాలు దాటుకుంటూ భూమండలం అంతా విస్తరించిన అతని తెగువనూ, పట్టుదలనూ తలచుకుంటే మనల్ని సంభ్రమాశ్చర్యాలే కాదు, ఉత్తేజోద్వేగాలూ చుట్టుముడతాయి. ఆధునిక మానవుడి ఊహకైనా
శాస్త్ర వికాసం

ప్రాచీన భారత దేశంలో గణిత శాస్త్రం

జవహర్ లాల్ నెహ్రూ ప్రాచీన భారతీయులు ఉన్నత విజ్ఞానవంతులై రూపం లేని వాటిని గురించి కూడా ఎక్కువ ఆలోచించేవారు. కాబట్టి గణిత శాస్త్రంలో కూడా వారెంతో గొప్పవారు. యూరపు అంక బీజ గణితాలను అరబ్బుల నుంచి నేర్చుకొంది. కానీ ఆ అరబ్బులు భారతదేశ నుండి వీటిని నేర్చుకున్నారు. అందువల్లనే ప్రపంచమంతా వాడుకలో ఉన్న అంకెలను అరబ్బీ అంకెలు అంటారు. కానీ ఇప్పుడు అంక బీజగణితాల జన్మస్థలం భారతదేశమేనని అందరూ అంగీకరిస్తున్నారు.
చరిత్ర ఏమంటుంది

పునర్వికాసం – డావిన్సీ

కె యల్ కాంతారావు సైన్సు పురోగతిలో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఒక ప్రాంతంలో శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలు స్తంభించి పోతే అవి మరొక ప్రాంతాల్లో మొగ్గదొడిగాయి. ప్రాచీన కాలంలో భారతదేశం, చైనా ఈ రంగాల్లో ముందున్నాయి. కానీ మధ్యయుగాలనాటికి వచ్చేసరికి వీటిలో ఈ పరంపర స్తంభించిపోయింది. కానీ అదే కాలంలో అరబ్బు దేశాల్లో శాస్త్రీయ ఆలోచనలు మొగ్గతొడిగాయి. సైన్స్ పురోగతి కొనసాగింది. కానీ 15వ శతాబ్దం నాటికి అరబ్బు
సందర్భం

డార్విన్‌ లేని జీవశాస్త్రం, న్యూటన్‌, ఐనస్టీన్‌ లేని భౌతికశాస్త్ర పాఠాలతో పిల్లలు నేర్చుకునేది ఏమిటి?

దినేష్‌. సి. శర్మ  పదో తరగతి జీవశాస్త్ర పాఠ్య పుస్తకం నుండి డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం అధ్యాయాన్ని తొలగిస్తూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (NCERT) నిర్ణయించింది. కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కోవిడ్‌ పుట్టుక, వ్యాప్తిని అర్థం చేసుకోవాలంటే డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి సమయంలో కోవిడ్‌ పేరు చెప్పి దాని పుట్టు
పిల్లలు-చదువులు

అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది?

సి.వి.కృష్ణయ్య అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది? కొంప కొల్లేరవుతుంది. చేసిన కష్టమంతా వ్యర్థమవుతుంది. వల్లెవేత చదువుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో చూస్తున్నాం గదా. ప్రపంచ దేశాల్లో మన స్థానం ఎక్కడ వుందో అర్థం కావడం లేదా? ఇప్పటివరకు మనకు వచ్చిన నోబుల్ అవార్డులు ఎన్ని? మనం ఎన్ని కొత్త ఆవిష్కరణలు చేశాము? ప్రతి ఏటా మనం సంపాదిస్తున్న పేటెంట్లు ఎన్ని? ప్రపంచ దేశాల్లో మన విశ్వవిద్యాలయాల స్థానం ఎక్కడ?
తెలుసుకొందాం

ఆరవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్. A. రామచంద్రయ్య కేంద్రక శక్తి అన్ని రకాల శక్తులకు మూలం.కేంద్రక శక్తి పదార్థ వినిమయంతో విడుదల అవుతుంది.పదార్థ రూపాంతరమే శక్తి. ఇంట్లో ఎలక్ట్రిక్ లైట్లు, ఫ్యాను, మోటారు వాడతాం ఇవి విద్యుత్ శక్తితో పనిచేస్తాయని తెలుసు. ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఉదాహరణకు అది శ్రీశైలం ఆనకట్టలాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టు నుండి వచ్చిందనుకుందాం. దీన్నే జలవిద్యుత్తు అంటారు. అక్కడ ఆనకట్టకు అటువైపున నీటి ఎత్తు
మంచిపుస్తకం

భౌతికవాదుల చేతిలో బ్రహ్మాస్త్రం “భారతీయ నాస్తికవాదం”

పుస్తక పరిచయం - వి. బాల సుబ్రహ్మణ్యం ప్రపంచం ఉనికిలోకి ఎలా వచ్చింది ? ఈ ప్రశ్నే తత్వశాస్త్రానికి మూలం. 'ఒక మానవాతీత శక్తి దీనికి కారణం' అనేది ఒక భావన. దీని చుట్టూ శతాబ్దాల తరబడి చర్చోపచర్చలు చేశారు. సిద్ధాంతాలు సృష్టించారు. మన వేదాలనుంచి సూత్ర గ్రంధాల దాకా దీని సమర్థన అవిచ్ఛిన్నంగా కొనసాగింది. తర్వాత వచ్చిన పురాణాలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించాయి. దీన్ని ప్రాచీనం, సనాతనం
మంచిమాట

మన కర్తవ్యం

మంచి మాట మన కర్తవ్యంప్రపంచాన్నేగాదు మనల్ని గురించి కూడా అర్థం చేసుకోనీకుండా అడ్డగించే సంకుచిత మత దృక్పథాన్నుంచి, లోకాతీత పారలౌకిక ఊహా సౌధాల భ్రమల్లో నుంచి మనం బయటపడాలి. వర్తమానంతో, ఈ జీవితంతో, ఈ ప్రపంచంతో, మన చుట్టూ ఆవరించి ఉన్న ఈ ప్రకృతితో ముఖాముఖి పోరాడాలి.- జవహర్ లాల్ నెహ్రూ