సంపాదకీయం

ఇంకా నరబలులా?

కొన్ని వార్తలు వింటుంటే మనం ఆదిమ బర్బర యుగాల్లోంచి ఇంకా ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోతున్నామా అనిపిస్తుంది. అలాంటి వార్తల్లో ఒకటి ' 2014 -21 మధ్య 103 నరబలులు జరిగా'యన్న వార్త! సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ "జాతీయ నేర రికార్డు బ్యూరో" (NCRB) బయటపెట్టిన వాస్తవమిది. అంతే కాదు 2022లో కూడా ఇలాంటివి ఆరు జరిగాయట! ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ (26 అక్టోబరు 2024) తాజా కథనమిది.
సందర్భం

పిల్లలే ప్రపంచం! పిల్లలే భవిష్యత్తు!

విఠపు బాలసుబ్రహ్మణ్యం "నిండు గర్భిణిని చూసినప్పుడల్లా భవిష్యత్ ప్రపంచంపై భరోసా ఏర్పడుతుంది" అంటాడు ఆరుద్ర. చరిత్రలో పిల్లలే ప్రపంచమని నమ్మని కాలం అంటూ ఏదీ లేదు. అసలు పిల్లలే లేకుంటే ఏ జాతికైనా కొనసాగింపంటూ ఏముంటుంది? అందువల్ల సంతానమే జీవన సాఫల్యమని, పరమార్ధమని చెప్పని ప్రపంచ ప్రాచీన సాహిత్యం అంటూ ఏదీ లేదు. సంతాన తంతువు, సంతాన వృక్షం, సంతానలక్ష్మి, సంతాన గోపాలుడు లాంటి పదాలన్నీ ఇలా వచ్చినవే. ఆదిమ
పిల్లలు-చదువులు

పిల్లల సైకాలజీని పట్టించుకోని బోధన

సి. వి. కృష్ణయ్య చదువు మానసికమైనది, పిల్లలైనా పెద్దలైనా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటూ తర్కిస్తూ జ్ఞానం సంపాదించుకుంటారు. పిల్లలు సంసిద్ధులుగా ఉన్నారా లేదా అని చూడకుండా ఈ గంటలో ఈ పాఠాన్ని నేర్చుకోవాలని నిర్బంధిస్తే ఏం జరుగుతుంది? ఇందుకు సంబంధించి నా అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు వివరిస్తాను. తొలి సంఘటనఒకరోజు 20 ఏళ్ల యువకుడు నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు."నేను మీ స్టూడెంట్ రవిని, గుర్తున్నానా
చరిత్ర ఏమంటుంది

ఆస్ట్రానమీకి డార్విన్! సైన్స్ ఉద్యమానికి డార్లింగ్! మేఘనాథ్ సాహా !

డా. యం. గేయానంద్ శాస్త్రవేత్తలంటే ప్రయోగశాలలకు పరిమితమై వుంటారు. కానీ మన దేశంలో పుట్టిన ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేశాభివృద్ధికోసం తనదైన ఆలోచనలతో జీవితపు చివరి ఘడియ దాకా భాగస్వామి అయ్యాడు. ఇలాంటి అరుదైన భారతీయ మేధావి మేఘనాధ్ సాహా! 1854 అక్టోబర్ 6న ఆయన ఇప్పటి బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా కష్టాలమయం. తండ్రి పేదరికం వల్ల చదివించడానికి సిద్ధంగా లేడు.
తెలుసుకొందాం

నాలుగవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య ఈ విశ్వంలో కేవలం నాలుగు రకాల బలాలు మాత్రమే ఉన్నాయి. అవి ఎ. గురుత్వాకర్షణ బలాలు బి. విద్యుదయస్కాంత బలాలు.సి. బలమైన కేంద్రక బలాలుడి. బలహీనమైన కేంద్రక బలాలు There are Only Four Operating Forces in the Universe; they are(a) Gravitational Forces;(b) Electromagnetic Forces;(c) Strong Nuclear Forces and(d) Weak Nuclear Forces. విశ్వంలో జరిగే ప్రతి సంఘటన
సంస్కృతి

భిన్న వాదాల భారతం!

రాహుల్జీ భారత దేశపు వైవిధ్యం దాని భౌగోళిక స్వరూపంలో దాని సంప్రదాయం, సంస్కృతిలో మాత్రమే కాదు దాని తాత్విక ధోరణుల్లో కూడా వైవిధ్యం, భిన్నత్వం ఆ భిన్నత్వాన్ని అమోదిందించే సంప్రదాయం వుంది. ఇది ప్రాచీన కాలం నుంచే వుంది. ఇది భారతదేశపు ప్రత్యేకతా, బలం కూడా. భిన్న వాదాలను సమ్మతించే సంప్రదాయం మనకు మన పురాణాల్లో కనిపిస్తుంది. మన పురాణాల్లో చాలాసార్లు అసలు కథతో పాటు ఎన్నో పక్క కథలు
నమ్మకం-నిజం

దిష్టికి బలమెంత?… కంటికి పవరెంత??

- యం.యుగంధర్ బాబు ఎవరిదో దిష్టి తగలకుండాఓ నల్ల చుక్క బుగ్గననల్లటి తాడు కాలికి...అసలు..దిష్టి పెట్టడం తెలీనిఅసూయ పడడం రానిమనుషుల్ని పెంచితే పోలా... (అంతర్జాలం నుండి) అని ఓ కవిత. ఈ కవితలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం లో దిష్టి తగలడం గురించి. రెండవ భాగములో అసలు "అసూయ పడని" మనుషులే ఉంటే బాగుంటుంది అని. ఇది కవి గారి అత్యాశ కావచ్చు. సరే మనం ఈ