సంపాదకీయం

ఏ వెలుగులకీ ప్రస్థానం?

"చారిత్రక విభాత సంధ్యల మానవ కథా వికాసమెట్టిది?ఏ దేశం ఏ కాలంలోసాధించినదే పరమార్ధం ?" అంటూ శ్రీశ్రీ అంతిమంగా "ఏ వెలుగులకీ ప్రస్థానం" అని ప్రశ్నిస్తాడు. నిజంగానే మానవ సమాజం వెలుగుల వైపే ప్రయాణం సాగిస్తోందా?  మొత్తంగా ప్రస్తుత కాలపు మానవజాతి ఆలోచనలు ఎలా వున్నాయి? ఏ దేశాల మానవుల భావ స్రవంతి ఎటువైపు ప్రవహిస్తోంది ? మళ్లీ పొరలు పొరలుగా  విడదీస్తే ఒకే దేశంలోని భిన్న సామాజిక వర్గాలు వేటికవిగా ఏ
సందర్భం

మారుతున్న గురుశిష్య ప్రేమానుబంధాలు!

 విఠపు బాలసుబ్రహ్మణ్యం కాలం ప్రవాహం లాంటిది. మానవ అవసరాలూ, సంబంధాలు ఆ ప్రవాహంలో నిరంతరం మారుతుంటాయి. వాటికి తగ్గ విలువలూ ఏర్పడి సమాజపు అన్ని పొరల్లోకి విస్తరిస్తూ వుంటాయి. విద్యారంగమేమీ దీనికి మినహాయింపు కాదు. మానవుడికి బతుకుదెరువు నైపుణ్యాలు, పరిసర జ్ఞానము మాత్రమే అవసరమైన కాలంలో ఒక గురువు, నేర్చుకునేందుకు ఒక వ్యవస్థ వుండేవి కావు. నేర్పేది ఇంటి పెద్దలే కాబట్టి, నేర్చుకునేది ఇంటిపట్టున కొంతా, ప్రత్యక్ష పరిసరాల నుంచి
సంస్కృతి

సంస్కృతి

ఇస్లామిక్ రామాయణాలు! - విఠపు బాల సుబ్రహ్మణ్యం 'రామాయణపు అందమంతా దాని వైవిధ్యంలోనే వుంద' ని  నానుడి ! అవును రామాయణం చిత్ర విచిత్రమైంది. అది ఎల్లలు దాటి అల్లుకుపోయింది. ఒక్కోచోట ఒక్కో రూపంలో కనిపిస్తూ దేనికదే ప్రత్యేకం కావడం, స్థానిక సంస్కృతులతో మిళితమై పోవడం, ఎవరికి వారు వారి పద్ధతుల్లోకి మార్చుకోవడం రామాయణానికే చెల్లింది. మతంతో సంబంధం లేకుండా, ఏ వివాదాలతో నిమిత్తం లేకుండా ఒక సాంస్కృతిక సంపదగా
మంచిమాట

మంచిమాట

ఉపాధ్యాయుడు      ఉపాధ్యాయుడు తాను అబద్ధాలు చెపుతూ పిల్లల్ని సత్యం పలకమనడం వృథా! తాను పిరికితనం పులుము కొని పిల్లల్ని సాహసవంతులుగా తీర్చాలనుకోడం అసాధ్యం!! తనకు ఆత్మనిగ్రహం లేకండా పిల్లలకు ఆత్మనిగ్రహాన్నిఅలవర్చడం అసంభవం!!! - మహాత్మాగాంధీ
తెలుసుకొందాం

తెలుసుకొందాం!

పద్దెనిమిది ప్రకృతి సూత్రాలు - ఎ. రామచంద్రయ్య ఇంగ్లీషు భాషంతా 26 అక్షరాల సమాహారమే అన్నట్లుగా సైన్స్ లో ఎన్ని వేల సూత్రాలు వున్నా అవన్నీ మౌలికంగా 18 ప్రాథమిక సూత్రాల సమాహారమని ఆధునిక శాస్త్రజ్ఞులు రుజువు చేశారు. ఈ మిలీనియం ఆరంభంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిగిన శాస్త్రజ్ఞుల మహాసభలో ఈ సూత్రాలను తీర్మానించారు.  ఈ సూత్రాలు ఇక అంతిమమనీ వీటికి డోకా లేదని సైన్సు శాసించదు. కానీ
నమ్మకం-నిజం

నమ్మకం- నిజం

గబ్బిలం అరిష్టమా? - యుగంధర్ బాబు అదేదో సీరియల్ లో పాము మనిషిగా మారిపోతుంది. మనిషి పాముగా అయిపోతాడు. నాగమ్మ .. శ్వేతనాగు... ఇలా రకరకాల పేర్లతో రకరకాల సినిమాలూ, సీరియళ్ళూ! అసలు మనిషిగా పుట్టిన వాళ్లు కనీసం మనిషిగా మారడానికే ప్రయత్నం చేయడం లేదు కానీ జంతువుల్ని మాత్రం మనుషులుగా మార్చేస్తున్నారు! ఇలా జంతువులు మనుషులుగా మారే కథల్లో ముందంజలో వుంటుంది ఒక జీవి. అదే అమాయక ప్రాణి
పిల్లలు-చదువులు

పిల్లలు-చదువులు

బడి బయట పాఠాలు  -2 భయం భయంగా.. - సి. వి. కృష్ణయ్య ఆ పిల్లవాడికి ఎనిమిదేళ్లు ఉంటాయి. రెక్కలు దొడిగే వయసు. వాడి ముందు మూడు ప్రపంచాలు నిలిచి ఉన్నాయి. అందులో బడి ఒకటి. అంటే టీచర్లు, అక్షరాలు, అంకెలు, శిక్షలు. రెండోది వింత అనుభూతులు పంచే అద్భుత ప్రపంచం - కొండలు, గుట్టలు, తోటలు, దొడ్లు, పిట్టలు పురుగులు. మూడోది నిజమో అబద్ధమో అర్థం గాని మాయా
శాస్త్ర వికాసం

శాస్త్ర వికాసం

నాగరికతల సంగమంలో భారతీయ గణిత విజ్ఞానం - అనుసృజన: వి. రాహుల్జీ ఇంత దూరం మానవ నాగరికత వర్ధిల్లుతోందంటే అదంతా ఇచ్చిపుచ్చుకోవడాల వల్లే సాధ్యమైంది. ఒక్కో చారిత్రక సంధ్యలో ఒక్కో నాగరికత ఒక్కో ఆవిష్కరణకు బాట వేసి వుండొచ్చు, ఒక ప్రకృతి నియమాన్ని పట్టుకొని వుండొచ్చు. దీనికి కచ్చితంగా ఆ నాగరికతను ప్రశంసించాల్సిందే. చరిత్రలో దానికా స్థానం దక్కాల్సిందే. అయితే ఏ నాగరికతా తనకు తాను సంపూర్ణం కాదు. ఒంటరిదీ కాదు.
శాస్త్ర ప్రచారం

శాస్త్ర ప్రచారం

సృజనను పెంచే సైన్సు ఫిక్షన్  -   ఎస్. వెంకట్రావు మనిషిని జంతువు నుండి వేరు చేసే ప్రధాన లక్షణం ఊహాశక్తి. జంతువు ఆలోచనల్లో  "నిన్న" లేదు కాబట్టి" రేపు" కూడా వుండదు. దానికి వున్నది "అప్పుడు" " అక్కడ" మాత్రమే. కానీ మనిషి ఊహాశక్తి అతన్ని "నేటి" నుండి విడగొట్టింది. అందుకే అతడు నిన్నటి గురించి ఆలోచించగలడు. రేపటి గురించి ఊహించగలడు. ఇదే అతడిని ఆధునిక మానవునిగా మెట్టు మెట్టు ఎదగడానికి