సందర్భం

స్వతంత్ర భారతపు  తొలి వేకువలో..

స్వతంత్ర భారతపు  తొలి వేకువలో "స్వావలంబన కోసం సైన్సు" ప్రయత్నాలు ! ఆధునిక భారతదేశం సాధించిన శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక విజయాలకు కారణం స్వాతంత్రం వచ్చిన కొత్తలో  ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగంలోని పరిశోధనశాలలు, పరిశ్రమలు. వీటిని స్థాపించడం లో ప్రధమ ప్రధాని జవహర్లాల్ నెహ్రు పాత్ర మాత్రమే చూస్తే సరిపోదు. మేఘ నాధ్ సాహా, సాహిబ్ సింగ్ సోఖి, సయ్యద్ హుస్సేన్ జహీర్ వంటి శాస్త్రవేత్త లే కాక J.B.S
సంపాదకీయం

విజ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును

సంపాదకీయం విజ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును సమాజపు అవసరాలే విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించాయా లేక వైజ్ఞానిక ఆవిష్కరణలే సమాజానికి కొత్త అవసరాల్ని సృష్టించాయా?  ఏ చారిత్రక సంధ్యలో  ఏ ఆవిష్కరణలు ఏ అవసరాల కోసం వెలుగు చూసాయి? ఏ  వైజ్ఞానిక కాంతిరేఖల ఫలితంగా చరిత్ర ఏ మలుపులు తిరిగింది? ఎలాంటి అవసరాలు, ఎవరి అవసరాలు అంతి మంగా ఈ కథ నడిపిస్తున్నాయి? ఈ ప్రక్రియలో సామాన్యుడి పాత్ర
సమాచారం

జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం!

ఆగస్టు 20 జాతీయ శాస్త్రీయ దృక్పథ దినం! ఆగస్టు 20, డాక్టర్ నరేంద్ర దబోల్కర్ ను మతఛాందసశక్తులు  కిరాతకంగా బలిగొన్నదినం. సైన్సు కోసం, శాస్త్రీయ ఆలోచనల కోసం ఒక యోధుడు బలిదానం చేయాల్సి రావటం స్వతంత్ర భారత చరిత్రలో సిగ్గుతో తలవంచుకోవలసిన దినం. మరోవైపు ఆధునిక దృక్పథం కోసం తపించే శక్తులందరికీ ఇది ఒక దీక్షాదినం కూడా. దబోల్కర్ ఉసురు తీసిన శక్తులే ఆ తరువాత డాక్టర్ గోవింద పన్సారేని,
చరిత్ర ఏమంటుంది

సైన్స్ చరిత్రలో కొన్ని పుటలు..

సైన్స్ చరిత్రలో కొన్ని పుటలు.. - డాక్టర్ గేయానంద్ 18వ శతాబ్దం, విప్లవాల కాలం. మేధావులు మామూలు మనుషులు కలిసిమెలిసి మాట్లాడుకున్న కాలం. సంఘాలుగా ఏర్పడిన కాలం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం చుట్టూ మొట్టమొదటిసారిగా సంఘాలు ఏర్పడిన కాలం ఆదే. అట్లా ఏర్పడిందే లూనార్ సొసైటీ. ఇంగ్లాండ్ లో1765-1813 మధ్యకాలంలో ఈ సొసైటీ చురుగ్గా ఉండేది. అందులో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఆలోచన పరులూ ఉండేవారు. నెలకు ఒకసారి, పున్నమికి దగ్గరలో
శాస్త్ర వికాసం

ఉద్దాలక అరుణి

ఉద్దాలక అరుణి ఉవాచ! - విటపు బాల సుబ్రహ్మణ్యం "పుత్రా! శ్వేతకేతూ! వచ్చావా నాయనా? పన్నెండేళ్ళ గురుకుల వాసంలో ఎంత పెద్దవాడివైపోయావురా? విద్యాభ్యాసం సంతృప్తిగా పూర్తి చేసావా? ఇరవై నాలుగేళ్లు వచ్చాయి కదా! గురువులు గృహస్థాశ్రమానికి అనుమతించారా?" "తండ్రీ! నాలుగు వేదాలు ఆపోశనం పట్టాను. షడ్దర్శనాలు నా నాలుక మీదే వున్నాయి. 'ఉద్దాలకపుత్రుడు శ్వేతకేతువిప్పుడు సకల శాస్త్ర పారంగతుడు! తండ్రిని మించిన కొడుకు! గురువును మించిన శిష్యుడు!' అని మా గురువులే మెచ్చుకున్నారు!"
మంచిపుస్తకం

సైన్సు సమాజము పుస్తక సమీక్ష

సైన్సు సమాజము పుస్తక సమీక్ష ~ డా. సిహెచ్. రవికుమార్ సైన్సు సమాజం అనేవి రెండు విడి విడి అంశాలు కావు. ఈ విషయం చాలామందికి అవగాహన ఉండవచ్చు. కానీ సైన్సు సమాజం మధ్య సంబంధం లోతైనదనీ ఆ రెండూ చాలా సూక్ష్మ అంశాల వల్ల పరస్పరం ప్రభావితం చేయబడతాయని ప్రత్యేకమైన అంశాన్ని ఈ పుస్తకంలో లోతుగానే విశ్లేషించారు రచయిత సుందర రామన్. ఈ పుస్తకం కేవలం సైన్సు సాంస్కృతిక
పిల్లలు-చదువులు

ఆడపిల్ల మన ఆశ, మన భవిష్యత్తు

ఆడపిల్ల మన ఆశ, మన భవిష్యత్తు - విటపు బాలసుబ్రమణ్యం "భారతదేశంలోని నేటి అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి ఏమంటే ఆడపిల్ల తన స్కూలు బ్యాగు వీపుపై పెట్టుకుని ఉదయం బడికి బయలుదేరడం". ఏ విద్యాభిమానో భావోద్వేగంతో  చెప్పిన మాటలు కావివి. న్యాయశాస్త్రాన్ని కాచి వడపోసిన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పులోని వాక్యమిది! ఈ స్పృహ మనలో ఎంత మందికి వుంది?  మన విద్యారంగ పాలసీల నిర్ణేతలకు, ప్రభుత్వాలకు, సామాజిక ఉద్యమకారులకు, మేధావులకు మాత్రం ఏ
పిల్లలు-చదువులు

బడి బయట పాఠం

బడి బయట పాఠం ఎన్నాళ్లు బడిలో ఉన్నా ఎన్ని చదువులు చదివినా బతకాల్సింది బడి బయట. - సి. వి. కృష్ణయ్య ఏదో ఒక ఉద్యోగంలో చేరతాం. పెళ్లి చేసుకుంటాం. కుటుంబం ఏర్పడుతుంది. బంధువులు స్నేహితులు ఇరుగుపొరుగు- వీరందరిలోకలిసి జీవించాలి. ఎన్నో సమస్యలు వస్తాయి. మరి వీటిని ఎలా పరిష్కరించుకోవాలి ? ఆఫీస్ కి వెళతాం..హాస్పిటల్ కి వెళతాం. పోలీసుస్టేషన్ వెళతాం. ఒక్కోసారి కోర్టు మెట్లూ ఎక్కుతాం. అక్కడ మన
నమ్మకం-నిజం

బల్లి పురాణం

నమ్మకం-నిజం బల్లి పురాణం! - యుగంధర్ బాబు బల్లిని చూడగానే చాలామంది కెవ్వుమంటారు. ఎక్కడ మీద పడిపోతుందోనని కంగారు పడతారు, హడలిపోతారు. చాలామందికయితే బల్లి అంటే ఎక్కడాలేని అసహ్యం. దాన్ని బయటకు తరిమేంతవరకు  ఆ గదిలో అడుగు కూడా పెట్టరు. ఇక  దీని చుట్టూ అల్లుకున్న నమ్మకాలు, అపోహలు రాస్తే ఒక పురాణమే అవుతుంది. ఇంట్లో బల్లిని తాకితే అపచారమనీ, అసహ్యమనీ ఈసడించుకొనే వారే కంచిపెళ్లి బంగారు బల్లిని  తాకడం కోసం నానా తండాలు పడతారు.