వృక్ష శిధిలాలతో చరిత్రను విశ్లేషించిన విజ్ఞాని బీర్బల్ సహా సాహ్ని
డా. నాగసూరి వేణుగోపాల్ వృక్షశిథిలాలతో చరిత్ర గానాలు విశ్లేషించిన మహనీయుడు బీర్బల్ సాహ్ని! మనదేశంలో పాలియో బోటని అనగానే గుర్తుకు వచ్చే శాస్త్రవేత్త ఆయన. శిలావశేషాలలోని వివిధ పొరలలో ఉండే వృక్ష సంబంధమైన పదార్థాలను అధ్యయనం చేయడమే 'పాలియో బోటని (Paleo Botany)'. దీనిని తెలుగులో 'పురావృక్షశాస్త్రం' అని అంటాం. ఒకవైపు వృక్షశాస్త్రం, మరోవైపు భూభౌతికశాస్త్రం, ఇంకోవైపు చరిత్ర పరిశోధన మేళవించిన
