శాస్త్ర వికాసం

శాస్త్ర వికాసం

నాగరికతల సంగమంలో భారతీయ గణిత విజ్ఞానం - అనుసృజన: వి. రాహుల్జీ ఇంత దూరం మానవ నాగరికత వర్ధిల్లుతోందంటే అదంతా ఇచ్చిపుచ్చుకోవడాల వల్లే సాధ్యమైంది. ఒక్కో చారిత్రక సంధ్యలో ఒక్కో నాగరికత ఒక్కో ఆవిష్కరణకు బాట వేసి వుండొచ్చు, ఒక ప్రకృతి నియమాన్ని పట్టుకొని వుండొచ్చు. దీనికి కచ్చితంగా ఆ నాగరికతను ప్రశంసించాల్సిందే. చరిత్రలో దానికా స్థానం దక్కాల్సిందే. అయితే ఏ నాగరికతా తనకు తాను సంపూర్ణం కాదు. ఒంటరిదీ కాదు.
శాస్త్ర వికాసం

ఉద్దాలక అరుణి

ఉద్దాలక అరుణి ఉవాచ! - విటపు బాల సుబ్రహ్మణ్యం "పుత్రా! శ్వేతకేతూ! వచ్చావా నాయనా? పన్నెండేళ్ళ గురుకుల వాసంలో ఎంత పెద్దవాడివైపోయావురా? విద్యాభ్యాసం సంతృప్తిగా పూర్తి చేసావా? ఇరవై నాలుగేళ్లు వచ్చాయి కదా! గురువులు గృహస్థాశ్రమానికి అనుమతించారా?" "తండ్రీ! నాలుగు వేదాలు ఆపోశనం పట్టాను. షడ్దర్శనాలు నా నాలుక మీదే వున్నాయి. 'ఉద్దాలకపుత్రుడు శ్వేతకేతువిప్పుడు సకల శాస్త్ర పారంగతుడు! తండ్రిని మించిన కొడుకు! గురువును మించిన శిష్యుడు!' అని మా గురువులే మెచ్చుకున్నారు!"