కె శ్రీకృష్ణ సాయి

రసాయన శాస్త్రంలో “బాణం గుర్తులు” (Arrow Marks) చాలా ముఖ్యమైనవి. ఒక రసాయనిక చర్య ఎలా జరుగుతుందో, ఏ పదార్థాలు కలిసి కొత్త పదార్థాలు ఏర్పరుస్తాయో, చర్య దిశ ఏమిటో, శక్తి మార్పులు ఎలా జరుగుతాయో తెలిపేందుకు బాణం గుర్తులు ఉపయోగిస్తారు. రసాయన సమీకరణాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే బాణం గుర్తుల అర్థం తెలుసుకోవడం అత్యవసరం. రసాయన శాస్త్రంలో బాణం గుర్తులు చాలా కీలకమైనవి. అవి కేవలం గుర్తులు మాత్రమే కాదు; రసాయనిక మార్పుల భాష. ప్రతిచర్య ఎలా జరుగుతుందో, ఏ పదార్థాలు ఏర్పడుతున్నాయో, శక్తి ఎలా మారుతుందో తెలియజేసే శాస్త్రీయ సంకేతాలు.
సాధారణ బాణం నుండి సమతుల్య బాణం వరకు ప్రతి గుర్తుకూ ప్రత్యేక అర్థం ఉంది. ఆధునిక రసాయన శాస్త్ర అభివృద్ధిలో వీటి పాత్ర అమోఘం. బెర్జేలియస్ వంటి శాస్త్రవేత్తలు ప్రారంభించిన సంకేతాల వ్యవస్థ, నేటి ప్రపంచ కెమిస్ట్రీకి బలమైన పునాది అయింది.అందువల్ల రసాయన సమీకరణాలలో బాణం గుర్తులను అర్థం చేసుకోవడం అంటే రసాయన భాషను అర్థం చేసుకోవడమే.
రసాయన శాస్త్ర చరిత్రలో మొదట రసాయన సమీకరణాలు ఆధునిక రూపంలో ఉండేవి కావు. శాస్త్రవేత్తలు పదాలతోనే రసాయన చర్యలను వ్రాసేవారు.
ఉదాహరణ: “Hydrogen combines with oxygen to form water”
తర్వాత సంకేతాల పద్ధతి అభివృద్ధి చెందింది.
బాణం గుర్తు రాకముందు ఎలా వ్రాసేవారు?
17వ శతాబ్దానికి ముందు రసాయన శాస్త్రవేత్తలు (అల్కెమిస్టులు) ప్రత్యేకమైన రహస్య సంకేతాలు వాడేవారు.
వారు:గ్రహాల గుర్తులు, మాంత్రిక చిహ్నాలు, చిత్రాల రూపంలో సంకేతాలు వాడేవారు.
ఉదాహరణకు:
- బంగారం = ☉
- వెండి = ☽
ఈ విధానం అందరికీ అర్థం కాకపోవడంతో శాస్త్ర అభివృద్ధికి అడ్డంకిగా మారింది.
1615లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త Jean Beguin తన పుస్తకం Tyrocinium Chymicum లో మొదటిసారిగా రసాయన చర్యలను చిత్రరూపంలో చూపించాడు.అతను ఇంకా ఆధునిక బాణం గుర్తు ఉపయోగించలేదు. కానీ పదార్థాలు ఎలా కలుస్తాయి,కొత్త పదార్థాలు ఎలా ఏర్పడతాయి అనే భావాన్ని చూపే ప్రయత్నం చేశాడు.ఇది రసాయన సమీకరణాల ప్రారంభ దశగా భావిస్తారు ఈ ప్రసిద్ధ చిత్రరూప సమీకరణం ఆయన రచించిన Tyrocinium Chymicum అనే పుస్తకంలో కనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని “ప్రారంభ రసాయన శాస్త్రం” (Beginner’s Chemistry) అని కూడా పిలుస్తారు
ఇది ప్రపంచంలో మొదటిసారిగా రసాయనిక చర్యను చిత్ర రూపంలో చూపించిన ఒక పురాతన డయాగ్రామ్. దీనిని ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త Jean Beguin తన 1615లో ప్రచురించిన Tyrocinium Chymicum అనే పుస్తకంలో వాడాడు.

ఈ డయాగ్రామ్‌లో మధ్యలో Antimoine (Antimony) ఉంది.
దాని చుట్టూ ఉన్న పదార్థాలతో చర్య చేసి వేర్వేరు ఉత్పత్తులు ఏర్పడుతున్నాయని చూపించారు.అంటే ఇది ఒక “reaction relationship map” లాంటిది.
ఆధునిక రసాయన సమీకరణంగా
ఆ కాలంలోని ఈ భావనను ఇప్పుడు ఇలా రాస్తాం
ఇక్కడ:
- HgCl₂ = Mercuric chloride
- Sb₂S₃ = Antimony sulfide
- SbCl₃ = Antimony chloride
- HgS = Mercury sulfide
ఆధునిక బాణం గుర్తు ఎలా వచ్చింది?
18వ–19వ శతాబ్దాల్లో Antoine Lavoisier,Jöns Jacob Berzelius
వంటి శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేశారు.
ఆ సమయంలో మూలకాల సంకేతాలు (H, O, Na), సమీకరణాలు, ప్రతిచర్యల రీతులు
సరళీకరించబడ్డాయి.తరువాత “equals (=)” గుర్తు బదులుగా “arrow (→)” వాడటం ప్రారంభమైంది. ఎందుకంటే కానీ రసాయన చర్యలో పదార్థాలు మారిపోతాయి, ఒక దిశలో చర్య జరుగుతుంది అందుకే “→” మరింత సరైన భావాన్ని ఇచ్చింది.
రసాయనిక చర్యను సంకేతాల రూపంలో చూపినదాన్ని రసాయన సమీకరణం (Chemical Equation) అంటారు.
ఉదాహరణ: 2H2 + O2→ 2 H2O
ఈ చర్యలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలిసి నీటిని తయారు చేస్తున్నాయి.
రసాయన సమీకరణంలో బాణం గుర్తు “ఇవ్వబడుతుంది”, “మారుతుంది”, “ఫలితంగా ఏర్పడుతుంది” అనే అర్థాలను తెలియజేస్తుంది.
ఉదాహరణ: C + O2 –→CO2
కార్బన్ + ఆక్సిజన్ → కార్బన్ డయాక్సైడ్
ఇక్కడ బాణం:
- చర్య దిశను సూచిస్తుంది
- చర్య తర్వాత ఏర్పడే పదార్థాన్ని తెలియజేస్తుంది
బాణం గుర్తులు లేకుండా రసాయన సమీకరణం అసంపూర్ణంగా ఉంటుంది.
ఇవి:
- చర్య దిశను తెలియజేస్తాయి
- రియాక్టెంట్లు మరియు ఉత్పత్తులను వేరు చేస్తాయి
- శక్తి మార్పులను సూచిస్తాయి
- చర్య తిరోగమనమా కాదా తెలియజేస్తాయి
- ప్రయోగ పరిస్థితులను చూపిస్తాయి
బాణం ఎడమవైపు ఉన్న పదార్థాలను క్రియా జనకాలు క్రియా జన్యాలు (reactants)అంటారు.
కుడివైపు ఉన్న పదార్థాలను క్రియా జన్యాలు (products) అంటారు.
ఉదాహరణ: Zn + 2HCl → ZnCl2 + H2
ఇక్కడ:
reactants: జింక్ (Zn),హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl)
products:జింక్ క్లోరైడ్,హైడ్రోజన్ వాయువు
బాణం గుర్తుల రకాలు
రసాయన శాస్త్రంలో అనేక రకాల బాణం గుర్తులు ఉపయోగిస్తారు.
1 సాధారణ బాణం (→)
ఇది అత్యంత సాధారణమైన బాణం. ఇది “ఉత్పత్తి ఏర్పడింది” అనే అర్థం.
ఉదాహరణ: 2 Mg + O2 → 2MgO
మ్యాగ్నీషియం ఆక్సిజన్‌తో కలిసి మ్యాగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది.
2 Double-Headed Arrow (⇌)
కొన్ని చర్యలు ముందుకు మరియు వెనుకకు రెండూ జరుగుతాయి. వాటిని సమతుల్య ప్రతిచర్యలు అంటారు.
అటువంటి ప్రతిచర్యలకు ⇌ గుర్తు ఉపయోగిస్తారు.
ఉదాహరణ: N2+ 3 H2 ⇌ 2NH3
ఇది హేబర్ ప్రక్రియ.
ఇక్కడ:
- అమోనియా తయారవుతుంది
- అదే సమయంలో అమోనియా మళ్లీ నైట్రోజన్, హైడ్రోజన్ గా విడిపోతాయి
అందువల్ల రెండు దిశల బాణం వాడుతారు.
3. Upward Arrow (↑)
ఒక రసాయన చర్య లో వాయువు విడుదలైనప్పుడు ↑ ఉపయోగిస్తారు.
ఉదాహరణ: Zn + 2HCl → ZnCl2 + H2↑
ఇక్కడ హైడ్రోజన్ వాయువు విడుదల అవుతోంది.
4. Downward Arrow (↓)
ఒక రసాయన చర్య లో అవక్షేపం ఏర్పడితే ↓ గుర్తు ఉపయోగిస్తారు.
ఉదాహరణ: AgNO3+3 NaCl → AgCl + NaNO3
ఇక్కడ తెల్లని సిల్వర్ క్లోరైడ్ అవక్షేపం ఏర్పడుతుంది.
5.Resonance Arrow ⟷
రెసోనెన్స్ బాణం ఏమి తెలియ చేయును అంటే అసలు నిర్మాణం అన్ని రూపాల మిశ్రమం అని సూచిస్తుంది ఎలక్ట్రాన్‌ల డిలోకలైజేషన్‌ను తెలియజేస్తుంది
ఉదాహరణ:
ఓజోన్ ( O3) అణువు
O=O-O ⟷ O-O=O
ఇక్కడ:
- ఓజోన్ అణువుకు రెండు రెసోనెన్స్ నిర్మాణాలు ఉన్నాయి.
- ఒక నిర్మాణంలో డబుల్ బాండ్ ఎడమవైపు ఉంటుంది.
- మరొక నిర్మాణంలో డబుల్ బాండ్ కుడివైపు ఉంటుంది.
అసలు ఓజోన్ అణువు ఈ రెండు నిర్మాణాలలో ఏదో ఒకటి మాత్రమే కాదు; రెండింటి మిశ్రమ రూపం (Resonance Hybrid) గా ఉంటుంది.
అందువల్ల ఈ రెండు నిర్మాణాల మధ్య రెసోనెన్స్ బాణం ఉపయోగిస్తారు.
6..Retrosynthetic Arrow :⇐ లేదా ⟹
ఈ గుర్తు అర్ధం ఏమిటి అంటే ఈ సమ్మేళనం ఎలాంటి చిన్న పదార్థాల నుంచి తయారవుతుంది?” అంటే ఉత్పత్తి నుంచి వెనక్కు వెళ్లి ఆలోచించడం

7. Fishhook Arrow:

ఇది ఒకే తల (single-headed curved arrow) కలిగిన వంకర బాణం.
ఇది ఒక ఎలక్ట్రాన్ (single electron) కదలికను లేదా విభజనను చూపించడానికి ఉపయోగిస్తారు.

8.Dipole arrow: 
డైపోల్ బాణం ఎప్పుడూ:
- ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువగా ఉన్న వైపు చూపిస్తుంది.
- అంటే ఎక్కువ electronegative atom వైపు.
బాణం గుర్తులు ప్రాధ్యానత
ప్రపంచవ్యాప్తంగా రసాయన శాస్త్రవేత్తలు ఒకే విధంగా సమీకరణాలు వ్రాస్తారు.
దీనివల్ల: పరిశోధనలు సులభంగా అర్థమవుతాయి,భాషా భేదాలు సమస్య కాకుండా ఉంటాయి,అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానం పంచుకోవచ్చు రసాయన శాస్త్రంలో బాణాలు ఒక “భాష” లాంటివి. వాటి ద్వారా చర్య దిశ, ఎలక్ట్రాన్ కదలిక,సమతుల్యత, polarity, synthesis planning, energy changes వంటి అనేక ముఖ్యమైన భావనలు చాలా సులభంగా అర్థమవుతాయి.
కె శ్రీకృష్ణ సాయి, రేవతి సైన్స్ ఫౌండేషన్. మొబైల్ నం. 9866130320



