కొత్త చదువుల్లో సరికొత్త మనో ‘విజ్ఞాన’ శాస్త్రం!
విఠపు బాల సుబ్రహ్మణ్యం అది ఒక పేద కుటుంబం. దానికి రెండు గేదెలు తప్ప ఏమీ వుండవు. అయినా అది ఎప్పుడూ సంతోషంగా వుంటుంది. ఒకరోజు పిల్లలు తిండి లేక మాడుతుండడంతో భార్య తమ గేదెను అమ్మాల్సిందిగా భర్తకు చెబుతుంది. దీనికి కుటుంబం అంతా సంతోషంగా ఒప్పుకుంటుంది. ఇంటి యజమాని గేదెను మార్కెట్టుకు తీసుకెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాడు. పిల్లలు తండ్రి చుట్టూ మూగుతారు. 'గేదెను అమ్మి గుర్రాన్ని తీసుకున్నాను'
