చరిత్ర ఏమంటుంది

పునర్వికాసం – డావిన్సీ

కె యల్ కాంతారావు సైన్సు పురోగతిలో ఒక ముఖ్యమైన విషయం ఏమంటే ఒక ప్రాంతంలో శాస్త్రీయ ఆలోచనలు, ఆవిష్కరణలు స్తంభించి పోతే అవి మరొక ప్రాంతాల్లో మొగ్గదొడిగాయి. ప్రాచీన కాలంలో భారతదేశం, చైనా ఈ రంగాల్లో ముందున్నాయి. కానీ మధ్యయుగాలనాటికి వచ్చేసరికి వీటిలో ఈ పరంపర స్తంభించిపోయింది. కానీ అదే కాలంలో అరబ్బు దేశాల్లో శాస్త్రీయ ఆలోచనలు మొగ్గతొడిగాయి. సైన్స్ పురోగతి కొనసాగింది. కానీ 15వ శతాబ్దం నాటికి అరబ్బు