సందర్భం

పిల్లలే ప్రపంచం! పిల్లలే భవిష్యత్తు!

విఠపు బాలసుబ్రహ్మణ్యం "నిండు గర్భిణిని చూసినప్పుడల్లా భవిష్యత్ ప్రపంచంపై భరోసా ఏర్పడుతుంది" అంటాడు ఆరుద్ర. చరిత్రలో పిల్లలే ప్రపంచమని నమ్మని కాలం అంటూ ఏదీ లేదు. అసలు పిల్లలే లేకుంటే ఏ జాతికైనా కొనసాగింపంటూ ఏముంటుంది? అందువల్ల సంతానమే జీవన సాఫల్యమని, పరమార్ధమని చెప్పని ప్రపంచ ప్రాచీన సాహిత్యం అంటూ ఏదీ లేదు. సంతాన తంతువు, సంతాన వృక్షం, సంతానలక్ష్మి, సంతాన గోపాలుడు లాంటి పదాలన్నీ ఇలా వచ్చినవే. ఆదిమ