శాస్త్ర వికాసం

చంద్రుడిపై నీరు – అంతరిక్ష భవిష్యత్తుకు కొత్త దారి

రవిరాజ పోతినేని కొందరు చంద్రుడిని కవిత్వానికి ప్రతీకగా చూస్తారు. మరికొందరు ప్రేమకు, అందానికి చిహ్నంగా భావిస్తారు. అయితే శాస్త్రవేత్తల దృష్టిలో చంద్రుడు ఇప్పుడు మరో కారణంతో అత్యంత ప్రాధాన్యం పొందుతున్నాడు. అదే చంద్రుడిపై నీటి ఉనికి. ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయిన, ప్రాణం లేని రాతిగోళంగా భావించిన చంద్రుడిపై నీరు ఉందని నిర్ధారణ కావడం అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణగా నిలిచింది. ఈ ఆవిష్కరణ మానవాళి అంతరిక్ష భవిష్యత్తును