అలసట లేని ఎదురీత !
సంపాదకీయం "జన విజ్ఞానం" మూడో ఏడాది ముంగిట్లోకి అడుగుపెడుతోంది. దాదాపు అన్ని వైపుల నుంచి సవాళ్లు తప్ప సానుకూలత సన్నగిల్లుతున్న సందర్భమిది. ఇలాంటి ఎదురీత యుగంలో ఒక ఆన్ లైన్ ప్రజా సైన్సు పత్రికకు రెండేళ్లేమీ తక్కువ కాలం గాదు. ఈ మాటలు రాస్తుండగా కలల చక్రవర్తి పరమేశ్వరన్ గారు( యంపి) కలగా మిగిలిపొయ్యారన్న వార్త శరాఘాతంలా వచ్చి తగిలింది. "జన విజ్ఞానం" ప్రారంభ సంచికలో "శాస్త్ర ప్రచారంతో సరిపెట్టక
