సంపాదకీయం

మళ్ళీ తూర్పు దేశాలకు వైజ్ఞానిక వైభవం!

సంపాదకీయం విజ్ఞాన శాస్త్రపు ప్రయాణాన్ని ,పరిణామాన్ని కూడా చరిత్రగా రాస్తే అదీ మానవ చరిత్రకు నకలుగా కనిపిస్తుంది. కాలం కలిసి రానప్పుడు అప్పటి దాకా జాజ్వల్యమానంగా వెలిగిన చోటి నుండి ఎక్కడ  ఠికాణా దొరికితే అక్కడికి సైన్సూ వలస పోయింది .అలా ప్రపంచంలో ఒక్కో యుగంలో ఒక్కో చోట అది కొలువు తీరింది .వెళ్లిన చోటల్లా వెలుగులు చిమ్ముతూ ఆ సమాజాల్ని విప్లవీకరించింది. మళ్లీ కష్టకాలం వస్తే మూటా ముల్లే సర్దుకుని
శాస్త్ర ప్రచారం

డార్వినిజం పై మన వ్యతిరేకతకు కారణం?

డా. విరించి డార్విన్ పరిణామ సిద్ధాంతం కీర్తించదగ్గ గొప్పదేమీ కాదనీ, దానికి నిరూపణలేవీ లేవనీ, అది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమేననీ, అంత మాత్రాన సత్యం అయిపోదనీ- ఇలాంటి వాదనలు, “కోతి నుంచి మనిషి వచ్చాడన్నప్పుడు ఇంకా కోతులు ఎందుకు ఉన్నాయి?” వంటి వాదనలు లేదా దశావతారాల క్రమం చూస్తేనే అర్థమైపోతుంది. మన వాళ్ళకు జీవ పరిణామం ఎప్పుడో తెలుసని అనే వాదన,—ఇవి మన సమాజంలో తరచూ కనిపిస్తుంటాయి. అయినా
చరిత్ర ఏమంటుంది

భావజాల సంఘర్షణల మధ్య ఎదిగిన మన ప్రాచీన సైన్సు

డా. యం. గేయానంద్ 2000 సంవత్సరాల నాడు, భారత ఉపఖండంలో గొప్ప వైజ్ఞానిక కృషి జరిగింది. క్రీస్తుపూర్వం 200 నుండి క్రీస్తుశకం 700 దాకా ఉన్న కాలమది. అనుభవ జ్ఞానం, వృత్తి నైపుణ్యం, తాత్వికత -ఇవన్నీ నాటి శాస్త్ర సాంప్రదాయానికి పునాదివేశాయి. కొంచెం అటు ఇటుగా, ఈ కాలాలనే, దేవి ప్రసాద్ చటోపాధ్యాయ 'ఏజ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ సైన్స్' అన్నారు. ఈ కాలాల, తొలి శతాబ్దాలను, సంఘటిత దశ
శాస్త్ర వికాసం

హబుల్: విశ్వ రహస్యాలను ఛేదించిన అద్భుతం!

రవిరాజా పోతినేని విశాల విశ్వాన్ని అన్వేషించడం మరియు దాని ఆరంభాన్ని అర్థం చేసుకోవడం అనేది మానవ సహజమైన జిజ్ఞాసకు పరాకాష్ట. "మనం ఎక్కడి నుండి వచ్చాం?", "ఈ విశ్వం ఎలా మొదలైంది?", "ఈ అనంత విశ్వంలో మన స్థానం ఏమిటి?" అనే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలోనే ఈ అన్వేషణ యొక్క ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం నక్షత్రాలను, గెలాక్సీలను చూడటం మాత్రమే కాదు; ఇది మన అస్తిత్వపు మూలాలను
శాస్త్రజ్ఞులు

ఆనకట్టల నిర్మాణంలో దిట్ట ఏ. ఎన్. ఖోస్లా

డా. నాగసూరి వేణుగోపాల్ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1962లో మొట్టమొదటిసారి ఒక ఇంజనీరును గవర్నర్ గా నియమించారు. అతనే ఏ.ఎన్. ఖోస్లా (A. N. Khosla) (1892-1984). దేశంలో మొట్టమొదటి సాంకేతిక విజ్ఞానశాస్త్ర విశ్వవిద్యాలయం రూపశిల్పి ఆయన. భాక్రా డ్యామ్ సృష్టికర్త కూడా అయనే! జలవనరులను సద్వినియోగం  చేసుకోవాలని తపించిన దేశభక్తుడు ఈ అజుదియ నాథ్ ఖోస్లా! ఒరిస్సా గవర్నర్ గా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడటమే కాక, తన
నమ్మకం-నిజం

రొమ్ము పైన దెయ్యం

యం. యుగంధర్ బాబు మనలో చాలామంది చందమామ కథలు చదువుతూ, వింటూ, పెరిగాము కదా .ఈ తరానికి కూడా ఇప్పుడు చందమామ కథలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చింది. "చందమామ" పుస్తకం ఒక్కో సంచిక  కూడా ఆన్లైన్లో కనిపిస్తోంది. ఆ కథలలో రాజు, సామాన్యుడు, రాజకుమారి, ఓ బ్రహ్మ రాక్షసి ఉండేవారు. బ్రహ్మ రాక్షసి రాజ కుమారిని తీసుకెళ్లి పోతుంది. చివరికి రాజకుమారుడో, సామాన్యుడో ఆ బ్రహ్మ రాక్షసుడిని ఎదుర్కొని, వాడిని
తెలుసుకొందాం

ప్రకృతి సూత్రాలు-పదహారవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఎ.రామచంద్రయ్య పదార్థం అంతిమంగా క్వార్కులమయము(Matter is Ultimately Made Up of Quarks) డాల్టన్ మహాశయుడు పరమాణు సిద్ధాంతాన్ని ప్రవేశపట్టినపుడు అన్నమాటలివి. “పదార్థాన్ని విడగొడితే ముక్కలు వస్తాయి. ఆ ముక్కల్ని విడగొడితే మరింత చిన్న చిన్న ముక్కలు వస్తాయి. అలా పదార్థాన్ని విడగొట్టుకొంటూ వెళితే ఇంక ఏ మాత్రం విడదీయడానికి వీల్లేని మూలకణాలు వస్తాయి. ఆ మూలకణాలనే అబేధ్య కణాలని అంటారు. (Can not be further tomed
ప్రకృతి-పర్యావరణం

డేటా సెంటర్లు – పర్యావరణం

వి. రాహుల్జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ ఇలాంటి పదాలు ఈమధ్య చాలానే వింటూ ఉన్నాం. ఇదే పత్రికలో ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే చాట్ జిపిటి లాంటివి మనుషుల భాషను ఎలా అర్థం చేసుకుంటాయి అని చర్చించాం. ఇంతవరకు ఏదైనా విషయం మీద సమాచారం కావాలంటే మనం గూగుల్ ని ఉపయోగించే వాళ్ళం. గూగుల్ మనకు కావలసిన సమాచారం ఎక్కడెక్కడ ఉంటుందో చూసి ఆ వెబ్సైట్ల వివరాలు ఇచ్చేది.
మంచిమాట

మంచి మాట

మన ప్రపంచం"మనం నివసిస్తున్న ప్రపంచంశోభాసౌందర్యాలతో, సాహసాలతో  నిండినది.మనం నిజంగా కళ్ళు తెరిచి చూడగలిగితేసాధించడానికిందులో అంతే ఉండదు".-జవహర్లాల్ నెహ్రూ