సంపాదకీయం

జ్ఞానం-మౌనం

సంపాదకీయం జ్ఞానం మౌన సంస్కృతిని బద్దలు చేయాలి. మన బుర్రల్ని తొలిచేస్తున్న అసంగత ఆలోచనావైపరీత్యాల నుంచి మనల్ని బయటపడేసి నిరంతర క్రియాశీలురుగా మార్చాలి. ఆ క్రమంలో జ్ఞానం కూడా తనకు తాను పునరుజ్జీవితమై కొత్త చివుళ్ళు తొడగాలి, వుంటే అలాంటి జ్ఞానం వుండాలి, ఇస్తే అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి అలాంటి జ్ఞానాన్ని ఎందుకు అందివ్వలేకపోతున్నాం? అటువంటి జ్ఞానాన్ని మాత్రమే జ్ఞానంగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఈ నిర్ధారణల్ని, ప్రశ్నల్ని చరిత్రలో
పిల్లలు-చదువులు

కథలు చదవని మనుషులు

సి. వి. కృష్ణయ్య అవి నా చిన్నప్పటి రోజులు. నేను ఐదో తరగతి చదువుతున్నాను. మా ఇంటి పక్కన ఒక పెద్దమనిషి ఉండేవాడు. ఆయనది మా ఊరు కాదు. ఎక్కడినుంచో వచ్చాడు. ఒంటరిగా ఉండేవాడు. వైద్యం చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన్ను అందరూ "కథల బాబాయ్" అని పిలిచేవారు. ఆయన అసలు పేరేమిటో తెలియదు. ఇంట్లో పిల్లల్ని చుట్టూ కూర్చుండబెట్టుకొని కథలు చెబుతూ ఉండేవాడు. చెప్పిన కథ చెప్పకుండా చెపుతూ
చరిత్ర ఏమంటుంది

గ్రీసులో మలి దశ వైజ్ఞానిక వికాసం. ప్రజాస్వామ్య పుట్టుక….

డాక్టర్ గేయానంద్ గ్రీక్ ప్రకృతి విజ్ఞానులు, తొలిదశలో, ప్రకృతి కారణాలతోనే, ప్రకృతిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేశారు. అన్వేషణలో, వాళ్లు ప్రకృతికి అతీతమైన శక్తులలో, ఈ కారణాలు చూడలేదు..అదొక దశ. కానీ ఆ తర్వాత దశలో, ప్రకృతి విజ్ఞానంతో పాటు, ప్రజాస్వామ్యం వంటి సామాజిక సూత్రాల పట్ల కూడా వారి దృష్టి మళ్లీంది. .ఏథేన్స్ లో ప్రజాస్వామ్యం...ఇనుప యుగం గ్రీస్ లో తెచ్చిన మార్పులుచూద్దాం. ఇనుప సాంకేతికత మానవ శ్రమకు
శాస్త్రజ్ఞులు

వృక్ష శిధిలాలతో చరిత్రను విశ్లేషించిన విజ్ఞాని బీర్బల్ సహా సాహ్ని

డా. నాగసూరి వేణుగోపాల్ వృక్షశిథిలాలతో చరిత్ర గానాలు విశ్లేషించిన మహనీయుడు బీర్బల్ సాహ్ని! మనదేశంలో పాలియో బోటని అనగానే గుర్తుకు వచ్చే శాస్త్రవేత్త ఆయన. శిలావశేషాలలోని వివిధ పొరలలో ఉండే వృక్ష సంబంధమైన పదార్థాలను అధ్యయనం చేయడమే 'పాలియో బోటని (Paleo Botany)'. దీనిని తెలుగులో 'పురావృక్షశాస్త్రం' అని అంటాం.             ఒకవైపు వృక్షశాస్త్రం, మరోవైపు భూభౌతికశాస్త్రం, ఇంకోవైపు చరిత్ర పరిశోధన మేళవించిన
నమ్మకం-నిజం

కుక్క ఏడిస్తే మరణమేనా?

యుగంధర్ బాబు కుక్కపిల్లసబ్బుబిళ్ళఅగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ మనవాళ్లు కుక్కపిల్ల, కాకి పిల్ల, పిల్లి పిల్ల కాదేది భయాలకు అనర్హమని అపోహల్లో కొట్టుకు పోతున్నారు. తెనాలి సినిమాలో కమలహాసన్ అంటాడు "నాకు అంతా భయమయం, తలుపు భయం, మూసి ఉన్న తలుపు భయం, తీసి ఉన్న తలుపు భయం, మూసి మూయని తలుపు భయం, తీసి తీయని తలుపు భయం, బార్ల తెరచిన తలుపు
శాస్త్ర వికాసం

ఆస్ట్రోశాట్: ఖగోళ పరిశోధనలో భారత విజయం – దశాబ్దపు మైలురాళ్లు

రవిరాజా పోతినేని తొలిమాటవిశ్వం అంటే మనకు కనిపించే ఆకాశం మాత్రమే కాదు — అపరిమితమైన రహస్యాలతో నిండిన అద్భుత ప్రపంచం. విశ్వాన్ని అధ్యయనం చేయడం ద్వారా మన ఆరంభం ఎక్కడో, భూమి ఎందుకు ప్రత్యేకమో, నక్షత్రాల, గ్రహాల జీవన చక్రం ఎలా ఉందో తెలుసుకుంటాం. ఈ జ్ఞానం మనలో జిజ్ఞాసను పెంచి, కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపుతుంది. విశ్వం మనకు కేవలం శాస్త్రం కాదు, ఆశ్చర్యం, ఆలోచన, స్ఫూర్తి కలిగించే
తెలుసుకొందాం

ప్రకృతి సూత్రాలు – పదిహేనవ సార్వత్రిక నియమము

ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య జీవులు వేరయినా అన్ని జీవుల్లోనూ ఒకే విధమైన జన్యుస్మృతి (జెనిటిక్ కోడ్) ఉంది.(All Life is Base on the Same Genetic code) జీవులను జీవంతో ఉంచేవి కణంలోని వివిధ జీవ భౌతిక చర్యలేనని, బహుకణ జీవుల్లో కణాలతో పాటు కణజాలాలు (tissue) కూడా కీలక ధర్మాలు నిర్వహిస్తాయని తెలిసిందే. కణాలతో జీవ రసాయనిక చర్యలు నడవాలంటే కొన్ని ఎంజైములు కావాలి. ఇవన్నీ రసాయనిక
మంచిపుస్తకం

కొండను అద్దంలో చూపే ప్రయత్నం “సైన్సుకూ చరిత్ర వుంది”

మంచి పుస్తకం సమీక్ష - విఠపు బాల సుబ్రహ్మణ్యం "ఆదిమ మానవుడు జంతువుల్ని చంపి మాంసాన్ని తిన్నాక వాటి తోలును వెచ్చగా కప్పుకోవడం నేర్చుకున్నాడు. తర్వాత దానితో పాదరక్షలు చేసుకున్నాడు. దీంతో అతనికి అడవుల్లో విశాల ప్రాంతాల్లో తిరిగే సామర్థ్యం ఎంతో పెరిగింది" అంటాడు జెడి బెర్నాల్. చర్మం వాడకానికీ, మనిషి తిరగడం పెరగడానికి మధ్య ఇంత కథ వుందన్న సంగతి మన ఊహకందని విషయం. మట్టి పూసిన బుట్టలో