సంపాదకీయం "గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అంటాడు తిక్కన భారతంలో. మరి తిక్కనకు అంతకు ముందటి కాలమంతా అంత గొప్పగా ,తన కాలం దానికి తీసికట్టుగా ఎందుకు కనిపించిందో మరి! వర్తమానం మీదా, భవిష్యత్తు మీదా ఆయనకెందుకు ఆశాభావం లేదో మరి ! కానీ గురజాడ "మంచి గతమున కొంచెమేనోయ్" అంటాడు. శ్రీశ్రీ మరో అడుగు ముందుకేసి "గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళ్లతో" అన్నాడు. వీళ్ళిద్దరికీ